Brahmamudi 186 ఎపిసోడ్: రాహుల్ తో కలిసినా కూడా గర్భం రాకపోవడం తో టెన్షన్ పడిన స్వప్న ఏమి చెయ్యాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటుంది. అతనితో పెళ్ళై మూడు నెలలు గడిచింది కడుపు వచ్చినట్టు ఇంట్లో తెలియక పోతే గుట్టు మొత్తం రట్టు అవుతుందనే భయం తో ఎలా కడుపు పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో నలుగురు తినే చికెన్ బిర్యానీ ని ఒక్కటే తినడానికి ప్రయత్నం చేస్తుంది .

కడుపు వచ్చినట్టు నమ్మించడానికి స్వప్న ట్రిక్స్ :
ఇదంతా గమనించిన ధాన్య లక్ష్మి ఏమైంది నీకు దెయ్యం పట్టిందా అని అడుగుతుంది. అప్పుడు స్వప్న ఆకలి వేస్తుంది, అందుకే తింటున్నాను, అది కూడా తప్పేనా అని అంటుంది. అప్పుడు ధాన్య లక్ష్మి ఎంత ఆకలి అయితే మాత్రం ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ బిర్యానీ ని కలిపి తినేస్తావా, లోపల ఉన్న నీ బిడ్డకు ఖాళీ దొరకాలి కదా , ఇక నుండైనా ఇలా అందం కోసం డైటింగ్ చెయ్యడం ఆపి, కావ్య వండి పెట్టే వంటకాలను తిను అని చెప్తుంది.

స్వప్న ని హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ చేయించాలి అనుకుంటున్న రాహుల్:
ధాన్య లక్ష్మి మాటలు పట్టించుకోకుండా స్వప్న బిర్యాని తినడం మొదలు పెడుతుంది. పక్కరోజు తిన్నది అరగక కక్కేస్తుంది. ఇదంతా ఇందిరా దేవి, రుద్రాణి మరియు రాహుల్ గమనిస్తారు. ఇందిరా దేవి వెంటనే డాక్టర్ కి చూపించుకోమని చెప్తుంది. అప్పుడు రుద్రాణి కడుపుతో ఉన్న అమ్మాయికి ఇలాంటివన్నీ సర్వసాధారణమే కదా అని అంటుంది, అప్పుడు ఇందిరా దేవి ఎదో ఒకసారి వస్తే అనుకోవచ్చు కానీ, అదేపనిగా వామిటింగ్స్ అయితే సమస్య ఉన్నట్టే అర్జెంటుగా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లండి అని అంటుంది. అప్పుడు రాహుల్ తీసుకెళ్లి స్వప్న కి అబార్షన్ చేయిద్దాం అని రుద్రాణి తో అంటాడు. నువ్వు అలాంటి తింగరి పనులు చెయ్యకు, ఇంట్లో చాలా తేలికగా దొరికేస్తాం అని అంటుంది. మరో పక్క కనకం మరియు మూర్తి ఇద్దరు కూడా కావ్య విషయం దిగులు చెందుతూ ఉంటారు. ఇక్కడ పని చేసుకొని వెళ్ళింది, అత్తారింట్లో కావ్య కి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో , ఒకసారి కళ్యాణ్ కి ఫోన్ చేసి అడుగుదాం అని కళ్యాణ్ కి ఫోన్ చేస్తారు.

ఇంట్లో వాళ్ళు తన తో మళ్ళీ మాట్లాడేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన కావ్య – ధాన్య లక్ష్మి :
అప్పుడు కళ్యాణ్ కావ్య వదినకి ఏమి అవుతుంది చాలా బాగుంది, ఆమెకి ఏమి సమస్య వచ్చినా నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి, అసలు గొడవ జరిగింది అనే విషయాన్నే ఇంట్లో మర్చిపోయారు అని చెప్తాడు. అప్పుడు కనకం, మూర్తి శాంతిస్తారు. మరోపక్క కావ్య ధాన్య లక్ష్మి వంట చెయ్యడం ని గమనించి అక్కడికి వస్తుంది. ఇంట్లో అందరూ నాతో మాట్లాడాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చిన్న అత్తయ్య, మీ వేలు కట్ అయ్యింది అందుకే వంట చెయ్యలేదు అని చెప్పండి, నేను చేస్తాను, వెళ్లి మీ బొటనవేలికి కట్టు కట్టుకొని రండి అని అంటుంది. అప్పుడు ధాన్య లక్ష్మి అలాగే చేస్తుంది.

కావ్య వంటింట్లో వంట చేయడాన్ని గమనించిన అపర్ణ ధాన్య లక్ష్మి ని పిలిచి నీకు వంట చెయ్యమని చెప్తే పరాయి వాళ్ళు ఎందుకు వంటింట్లోకి దూరారు అని నిలదీస్తుంది. అప్పుడు ధాన్య లక్ష్మి నా చెయ్యి కట్ అయ్యింది, అందుకే కావ్య చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు అపర్ణ ఎక్కడ లేని ఖర్మ మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది అని తిట్టుకుంటూ వెళ్తుంది. ఇక మరుసటి ఎపిసోడ్ లో సుభాష్ కి కావ్య తో ఇంట్లో ఎవ్వరు మాట్లాడకూడదు అని అపర్ణ విధించిన శిక్ష గురించి తెలుస్తుంది, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.