Krishna Mukunda Murari: అత్తయ్య నాకు డౌటు.. ఏసీబీ సారు నన్ను ప్రేమిస్తున్నానని నాకే చెప్పొచ్చు కదా మీతో ఎందుకు చెప్పించారు అని అంటుంది. ఇంకేం ఆలోచిస్తున్నా, కృష్ణ అవతల వాడు నువ్వు వస్తావా రావని టెన్షన్ తో కంగారు పడుతున్నాడు. రేవతి బలవంతం చేసి కృష్ణ నీ మురారి దగ్గరకు తీసుకువస్తుంది. ఎలాగోలా కృష్ణని కార్ ఎక్కిస్తుంది.

మొత్తానికి రేవతి కృష్ణుని తీసుకొని మురారి దగ్గరకు వెళ్తుంది మురారి చూడగానే సంతోషపడతాడు. ఏసీబీసీ ఎలా ఉంది అడుగు తున్నా ఉంది అని నిజంగానే ప్రేమిస్తున్నారా, లేదంటే రేవతి అత్తయ్య నేను ఇంటికి రావడానికి ఇదంతా చెప్పిందా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. మనసులో నేనున్నానో లేదో తెలుసుకోవాలి తెలుసుకోకుండా నేను అక్కడ సంతోషంగా ఉండ లేను అనుకుంటుంది అందుకే నేను రేవతి అత్తయ్య చీర కట్టుకోమన్న కూడా కట్టుకోకుండా డ్రెస్ తోనే ఇంటికి వస్తున్నాను కృష్ణ అంటుంది సరే పదండి అని కార్ లో అందరూ ఇంటికి బయలు దేరుతారు.

కృష్ణ కార్ల కూర్చుని తింగరి తింగరి ప్రశ్నలు అన్నీ వేస్తూ ఉంటుంది. మురారి ఇష్ట ఇష్టాలను తెలుసుకుంటుంది కృష్ణ. మురారి కూడా కృష్ణకి ఇష్టమైనవన్నీ గుర్తుంచుకొని చెబుతూ ఉంటాడు. నాకు ఎప్పటినుంచో మమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. అడిగితే మీరు నన్ను ఏమీ అనుకోరు కదా అడగనా అని కృష్ణ అంటుంది. అడుగు కృష్ణ అని మురారి అంటాడు. మీరు పెళ్ళికి ముందు ఎవరైనా ప్రేమించారా అని కృష్ణ సూటిగా మురారిని ప్రశ్నిస్తుంది. ఏసీపీ సార్ నా ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పండి అని కృష్ణ అడుగుతుంది. దయచేసి మీరు ఆ ప్రశ్నలు దాటవేయొద్దు అని అంటుంది. సరిగ్గా అదే సమయానికి ముకుందా మురారి కి ఫోన్ చేస్తుంది.

ముకుందా తన గదంతా మురారి ముకుంద కలిసి ఉన్న ఫోటోలు పెట్టి రూమ్ అంతా డెకరేషన్ చేసి ఉంచుతుంది. ప్రేమతో ఇక మనిద్దరం సంతోషంగా ఉంటామని మురారిని ఫోన్లో చూసుకుంటూ అంటుంది. మురారి కి ఫోన్ చేసి మన ఇద్దరి ప్రేమ విషయం అత్తయ్యతో చెప్పేస్తాను అని ముకుందా ఉంది. మురారి ఇప్పుడు కాదు నేను వచ్చాక చూసుకుందాం అని అన్నాడు నువ్వు వచ్చేసరికి నేను అన్ని సెట్ చేస్తాను అని ముకుందా కాల్ కట్ చేస్తుంది.

ఏసిపి సర్ ఇంకా సమాధానం చెప్పరేంటి అని కృష్ణ అడుగుతుంది. ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయాలో అర్థం కాదా, ఇక్కడ నేను ఉన్నాను డ్రైవర్ ఉన్నాడు. మీ పర్సనల్ విషయాలు మీ ఇద్దరూ ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి అని రేవతి ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. థాంక్యూ అమ్మ నన్ను కాపాడాలని మురారి మనసులోనే రేవతి థాంక్యూ చెబుతాడు. మురారి సార్ మనం ఈ విషయాలను పర్సనల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం అని కృష్ణ అంటుంది.
ముకుంద భవాని దగ్గరికి వచ్చి అత్తయ్య నేను మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది ఆ నిజాన్ని నేను చెప్పడం కన్నా మీ కళ్ళతో మీరు చూస్తేనే మంచిది రండి అంటూ అడుగుతుంది ముకుందా అసలు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకోవాలని భవాని లేచి తనతో పాటు పైకి వెళ్తుంది కృష్ణా మురారి ఉన్న గది దగ్గరకు ముకుందా తీసుకువెళ్తుంది ఏంటి ఇక్కడికి తీసుకొచ్చింది అని భవాని మనసులో అనుకుంటుంది సరిగ్గా అదే సమయానికి కృష్ణ మురారి రావడం అలేఖ్య మధు కొట్టుకుంటూ బయటకు వెళ్లి వాళ్ళని చూడటం పెద్దగా కృష్ణ వచ్చింది అని మధు అరవడంతో భవాని క్లిష్ట వచ్చింది అని తెలుసుకుంటుంది కృష్ణ మురారి లేనప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్లడం కరెక్ట్ కాదు అదేదో వాళ్ళు వచ్చాక వాళ్లతో పట్టే గదిలోకి వెళ్దామని భవాని అంటుంది ఒక్కసారిగా ముకుందా కంగు తింటుంది కృష్ణ రానని నాకు చెప్పింది కదా మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చింది ఈ ఇంటి కోడరీ స్థానం నాదే అని అంది మరి ఎందుకు మళ్ళీ వచ్చింది అని కృష్ణ ఎందుకు వచ్చిందో.. కృష్ణ మురారి ఒక్కటైపోయారా, మురారి కృష్ణ కి ప్రపోజ్ చేశాడా కృష్ణ మురారి ప్రేమను యాక్సెప్ట్ చేసిందా అంటూ.. ముకుందా మనసులో వందల ప్రశ్నలు తన మనసుని ప్రశ్నిస్తూ ఉంటాయి..

భవాని మురారి తలకు దెబ్బ తలగడం చూసి మురారి అంటూ ఏడుస్తూ గబగబా కిందకు దిగుతుంది.
కృష్ణ నేను నీకు ఇందాక ఫోటోస్ చూపించ కదా, ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను అని కృష్ణ కళ్ళు మూసి మురారి పక్కన ఉండగానే ముకుందా కృష్ణ మురారిల గదిలో చేసిన డెకరేషన్ ని ముకుందా చూపించాలని అనుకుంటుంది. మరి మురారి అదంతా కృష్ణని చూడనిస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.