Brahmamudi నవంబర్ 1 ఎపిసోడ్ 242: నిన్నటి ఎపిసోడ్ లో, స్వప్న శ్రీమంతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. స్వప్నకి కడుపు లేదన్న విషయం రుద్రానికి తెలిసిపోతుంది.ఇంట్లో అందరూ అంగరంగ వైభవంగా స్వప్నశ్రీమంతం చేస్తూ ఉంటారు స్వప్న కూడా అంతే ఆనందంగా శ్రీమంతం చేయించుకుంటూ ఉంటుంది.ఇక రుద్రాణి టైం చూసి బాంబు బ్లాస్ట్ చేయాలనుకుంటుంది.రాహుల్ తో నీ పెళ్ళాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసే టైం వచ్చేసిందిరా అని అంటుంది.

ఈరోజు242 ఎపిసోడ్లో స్వప్న ఫ్రెండ్ అయినా డాక్టర్ కు రుద్రాణి కాల్ చేసి మాట్లాడుతుంది స్వప్నకు తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది అవి నా దగ్గరే ఉన్నాయి అవి గనుక బయటపెట్టే పెట్టాను అంటే నీ ఉద్యోగం ఏమవుతుంది అని రుద్రాణి బెదిరిస్తుంది డాక్టర్ని. ఏం కావాలి నీకు అని అడుగుతుంది. ఏం కావాలి కాదు ఏం చేయాలి అని అడుగు అని అంటుంది రుద్రాణి స్వప్న ఫ్రెండ్ అయిన డాక్టర్ సరే ఏం చేయాలో చెప్పండి అని అంటుంది ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి స్వప్నకి కడుపు లేదు అన్న విషయం మా ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలి అని అంటుంది. స్వప్న ఫ్రెండు బతిమిలాడుకుంటుంది మీ గొడవల్లోకి నన్ను లాగొద్దండి నేనేదో ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని అని రుద్రాణి నీకు కన్వెస్ట్ చేయాలనుకుంటుంది స్వప్న ఫ్రెండ్. కానీ రుద్రాన్ని మాత్రం వినదు, ఇందులో నా తప్పేం లేదు అని ఉంటుంది నీ తప్పు లేదన్న విషయమే వచ్చిఇక్కడ చెప్పు, చాలు ఇంక నాకేం అవసరం లేదు నాకు ఎక్కువ టైం లేదు నువ్వు త్వరగా రా అని రుద్రాణి అంటుంది స్వప్న డాక్టర్ సరే మేడం మీరు మాత్రం, ఏమి చేయకండి నేను వస్తాను అని అంటుంది శభాష్ మీరు తొందరగానే ఒప్పుకున్నావు అని అంటుంది రుద్రాని.

స్వప్న కు శ్రీమంతం..
ఇంట్లో అందరూ స్వప్నకు శ్రీమంతం ఘనంగా జరిపిస్తూ ఉంటారు. కావ్య మాత్రం మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది స్వప్న డాక్టర్ ఫ్రెండ్ కారులో వస్తుంది. ఇప్పటిదాకా ఉన్నాను కదా ఇంక వెళ్తాను అని అంటుంది అనామిక కళ్యాణ్ సిగ్గుపడుతూ ఉంటాడు. నా కూతురు శ్రీమంతం ఇంత ఘనంగా జరుగుతుంటే నేను ఈ సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇదేం చూసావు కదా నేనింకాసేపట్లో నీకు గిఫ్ట్ కి పోతున్నాను అది చూస్తే కళ్ళు తిరిగి కింద పడతారు అని అంటుంది రుద్రాణి. కళ్ళు తిరిగేంత కానుక ఏమై ఉంటుందో అని అంటుంది. ఏం గిఫ్ట్ అని అందరు అడుగుతూ ఉంటారు కాసేపు ఆగండి ఏం తెలుస్తుంది కదా అందరికీ అని అంటారు తల్లి కొడుకులు. అమ్మ స్వప్న కాసేపు అటు ఇటు నడువమ్మ, అని అంటే అటు ఇటు నడవడం కాదు శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. ఇక అప్పుడే స్వప్న ఫ్రెండ్ డాక్టర్ ఏంటి ఇస్తుంది.

స్వప్న గుట్టు రట్టు ..
ఇక స్వప్న ముందు స్వప్న ఫ్రెండ్ డాక్టర్ని చూడగానే స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ శ్రీమంతానికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి డాక్టర్లు చూపిస్తుంది రుద్రాని. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కానీ స్వప్నకి మాత్రమే తెలుసు ఆ డాక్టర్ ఎందుకు వచ్చింది. ఈ డాక్టర్ నీ ఫ్రెండే, ఇన్ని రోజులు నీ కడుపుని కాపాడుతున్న ఫ్రెండ్, అని రుద్రాణి అనగానే కావ్య కూడా షాక్ అవుతుంది. కావాలని రుద్రాణి బిడ్డ పోసిషన్ ఏంటో చూడమ్మా అని రుద్రాణి స్టేజి మీదకి తీసుకు వెళ్తుంది స్వప్న ఫ్రెండ్ ని, స్వప్నకి ఎంత అర్థం అయిపోతుంది ఇక దాచడానికి ఏమీ లేదు అని, కావ్య మాత్రం చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఎంత గొడవ అవుతుందో అని, ఇక స్టేజ్ మీద స్వప్న ఫ్రెండ్ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా డాక్టర్ వి కదా నువ్వు స్వప్న కడుపు చెక్ చేసి బిడ్డ పొజిషన్ చెప్పు అని అంటుంది రుద్రాణి. ఓకే. నీకు చెప్పడం రావట్లేదా నన్ను చెప్పమంటావా అని స్వప్న కడుపు కోసం దుస్తులను దాచుకుంటుంది ఆ దుస్తులన్నీ తీసేస్తుంది ఒక్కసారిరుద్రాణి.దీంతో అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా ఇంట్లో అందరూ లేచి నిలబడతారు నీ డాక్టర్ దగ్గరికి మచ్చ తెచ్చావు ఇంకా ఇక్కడ ఎందుకు వెళ్ళిపో, ఒక ఆడపిల్లకి కడుపు లేదని తెలిసి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తే నువ్వు దానికి దానాలంటే తందానా అని చెప్పి ఇంత మోసం చేస్తావా అని రుద్రాణి డాక్టర్ని అక్కడ నుంచి వెళ్లిపోమంటుంది.
Krishna Mukunda Murari: ముకుంద మురారిలాలకు పెళ్లా.? అందుకేనా అమెరికా పంపిస్తున్న భవాని..

కనకాన్ని అవమానించిన అపర్ణ..
రుద్రాణి కడుపు బ్యాగ్ తీసి బయట పెట్టి చూడండి ఈ స్వప్న ఎంత మోసం చేసిందో ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతే మోసం చేస్తారు అని అంటుంది అప్పుడే కనకం ఎందుకు చేసావ్ ఇదంతా ఎందుకు ఇంత బాధ పెట్టావు కనీసం ఇప్పుడైనా చెప్పాలి కదా నీకోసం ఇంత శ్రీమంతం జరుగుతుంటే నోరు మెదపకుండా ఎంత చేసావ్ ఏంటి అని అంటుంది అక్కడే ఉన్న అపర్ణ దొరికింది చాన్స్ అనుకొని నీకు వరుస పెట్టి కావ్యని వాళ్ళ అమ్మని స్వప్న నీ ముగ్గురిని కలిపి తిడుతుంది. ఇందులో రాహుల్ బయటికి లాక్కొని వస్తాడు స్టేజి మీద నుంచి స్వప్న ఎంత మోసం చేశావు నన్ను ఎంత నమ్మించావు అసలు ఎందుకు ఇదంతా చేశావు నువ్వు చేసింది ఏంటో నీకు అర్థం అవుతుందా నన్ను మా అమ్మని ఇంట్లో వాళ్ళని అందరినీ మోసం చేశావు నీకు ఒక క్షణం కూడా ఇక్కడ ఉంది అర్హత లేదు అని అంటాడు. ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఈరోజు మీ ఇంటి కాడలిగా ఇంత ఘనంగా శ్రీమంతం జరిపించుకుంది అంటే అది కడుపు లేకుండా ఇంతకన్నా మోసగత్తెలు ఎవరైనా ఉంటారా ఈ ఫ్యామిలీ మొత్తం ఇంతే అని అపర్ణఅంటూ ఉంటుంది.అది కాదు వదిన గారు అని కనకం అంటే, ఇంకా ఆపు అని అపర్ణ, ఇతను ఒకటి నాటితే చెట్టు ఇంకొక వస్తుందా నువ్వెలాగైతే పెళ్ళాడ్డానికి అబద్ధాలు చెప్పావు నీ కూతురు కూడా అలానే చేసింది ఇందులో తప్పేముంది మీ ఫ్యామిలీ అంతా ఒకటే కదా అని అపర్ణ కనకాన్ని ఇన్సల్ట్ చేస్తుంది.నీ కూతురు ఒక ఫ్రాడ్ నువ్వు ఒక ఫ్రాడ్ ఇంకా ఇట్లనే వదిలేస్తే మా దగ్గర ఫ్యామిలీ పరువు మర్యాదలు రోడ్డు మీద తీసుకెళ్లి నిలబడతారు అని అంటుంది. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి నేనిప్పుడు ఇది కనిపెట్టాను కాబట్టి సరిపోయింది లేదంటే మీ అమ్మాయి ఏ అనాధ శిశువును తీసుకొచ్చి నా వారసుడైన నా చేతులు పెట్టేది అప్పుడు నా ఇంటి పరువు ఏంటి నేను వాడినే నా మనవడు అనుకోని పెంచుకోవాలి. హాస్పటల్లో డాక్టర్స్ మేనేజ్ చేసింది నా ముందే మందులు వాడుతున్నట్టు నటించింది నా ముందు ఏంటి కనకమ్ ముందు నటించింది ఇంట్లో అందరి ముందు నటించింది. ఇంట్లో వాళ్ళందరూ నాకోసం నా కోడలికి శ్రీమంతం చేస్తుంటే హాయిగా చేయించుకుంది ఈ తల్లి గాని తల్లి అని రుద్రాణి ఫైర్ అవుతుంది.ఇంత మోసం చేసేది నాకు ఎప్పటికీ కోడలు కాలేదు, నాకు భార్య కాదు కాలేదు కాలేదు అని అంటాడు. నన్ను మా అమ్మని ఇంత అవమానించి మమ్మల్ని ఎంత మోసం చేసిందంటే ఇలాంటి అమ్మాయితో నేను ఎప్పటికీ కాపురం చేయలేను. స్వప్న చూసినప్పుడల్లా ఇక నాకు ఇదే గుర్తొస్తుంది కాబట్టి నాకు ఈ భార్య వద్దు అని అందరి ముందు తెగేసి చెప్తాడు రాహుల్, ఇక ఇంట్లో అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు రుద్ర నీ తో మమ్మీ అర్జెంటుగా దీన్ని బయటికి గెంటేసేయ్ అని అంటాడు. రుద్రాణి బయటికి గెంటేస్తుంది.

తల్లి తండ్రి ని ఎదిరించిన స్వప్న ..
రుద్రాణి రాహుల్ ఇద్దరు స్వప్నని బలవంతంగా బయటికి తీసుకెళ్లాలనుకుంటారు. అప్పుడే కనకం వచ్చి అమ్మ మీకు దండం పెడతాను నా కూతుర్ని ఇంట్లో నుంచి మాత్రం బయటికి వద్దు అని వేడుకుంటుంది. అయినా వాళ్ళు కనకం నీ వయసుకు గౌరవిస్తున్నాను నువ్వు మాత్రం మధ్యలో రాకు అని అంటారు ఇంట్లో ఎవరు చెప్పాలని చూసినా రుద్రాణి వినదు. ఇక బయటకు ఏంటే టైం లో స్వప్న మనసులో నా తప్పు లేదని నిరూపించుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంటుంది. ఇక వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి ఏంటే వినోదం చూస్తున్నావా నాకు ఆపురం రోడ్డు మీదకు వచ్చేలా ఉంది ఇప్పటికైనా నోరు విప్పి మాట్లాడు అని అంటుంది. కావికి ఏమీ అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని అంటుంది. వీలునా మీద అనవసరంగా నిందలు వేస్తుంటే నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. నువ్వే కదా అత్త చేసింది ఇప్పుడెందుకు మరి ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి నేను వినోదం చూస్తున్నావు అని అంటుంది స్వప్న కావ్యకి ఏమీ అర్థం కాదు. అనవసరంగా ఇందులోకి కళావతి లాగుతావెందుకు అంటాడు రాజ్. సంబంధం ఉంది నన్ను ఈ నాటకం ఆడమంది కావ్య అని చెప్తుంది స్వప్న. దీంతో అందరూ షాక్ అవుతారు అక్క అని కావ్య గట్టిగా అరుస్తుంది ఇలాంటి నిజమైన సలహా కళావతి ఇవ్వదు నేను నమ్మను అని రాజ్ అంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ కళావతి ఇచ్చిందంటే నమ్మరు అని అంటారు ఇంతలో కనకం పాపిష్టిదానా ఏం మాట్లాడుతున్నావే అని చేయెత్తుతుంది కానీ కనకం చేతిని స్వప్న పట్టుకొని, కనకానికి ఎదురు తిరుగుతుంది దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు కనకం ఆగిపోతుంది నలుగురిలో పరువు తీసుకోకుండా ఉంటుంది. స్వప్న అని గట్టిగా అరుస్తాడు కృష్ణమూర్తి తల్లిని పేరు పెట్టి పిలిచే అంత పెద్ద దానివయ్యావా? అయినా నీ తల్లికి ఎదురు తిరుగుతున్నావా అని అంటాడు అమాయకురాలైనా కావ్య భవిష్యత్తును బలి చేస్తున్నావు కదా అని అంటాడు. ఇంత చేస్తున్నావంటే నువ్వే తప్పు చేశావు కావేపై నింద వేస్తే చంపేస్తాను అని అంటాడు కృష్ణమూర్తి ఆగవయ్య పెద్దమనిషి అని అంటుంది స్వప్న దానికి అందరికీ దిమ్మ తిరిగిపోతుంది కోతులను సరిగా పోషించడం రాదు కానీ నువ్వు కూడా మాట్లాడుతున్నావా కావ్య నాకు సలహా ఇవ్వటం వల్ల ఇలా చేశాను అని స్వప్న అందరి ముందు గట్టిగా అరిచి చెప్తుంది. ఇక వెంటనే మనసులో రుద్రాణి ఇదేదో కలిసి వచ్చేలా ఒక దెబ్బకు రెండు పెట్టాలి అని ఆనందిస్తుంది.

కావ్య ఆవేదన..
అక్క నువ్వు చేసిన తప్పుకి నన్ను బలి చేస్తున్నావా నువ్వు దోషిగా ఉండాల్సి వచ్చిందని నన్ను మధ్యలోకి లాగుతున్నావా అంటుంది కావ్య నువ్వు ఉండు కళావతి తనకు ఏం అవసరం అలా చేయడానికి అంటాడు రాజ్. రాహుల్ కి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇలా నాటకం అది ఇక్కడికి వస్తే నేను ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు అని కావ్య నాకు సలహా ఇచ్చింది అని చెప్తుంది స్వప్న. అంటే అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి నాటక పాడారా ఇప్పటిదాకా అని అంటుంది రుద్ర అని స్వప్న అవకాశవాది తన సంతోషం కోసం కన్నవాళ్ళనైనా సరే బయటికి పడేస్తుంది అలాంటిది కావ్య ని బయటకి నెట్టదని నమ్మకం ఏముంది అని అంటాడు కృష్ణమూర్తి.
ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య తను అబద్ధం చెప్తుంది నాకేం తెలీదు అని అంటుంది అయితే అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నీకు ఈ కడుపు సంగతి తెలీదు అని అంటుంది.ఇక ఇంట్లో అందరూ షాక్ అవుతారు కావ్య ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతుంది స్వప్న చివరికి కావ్యనే బలి చేస్తుంది