NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi అక్టోబర్ 31 ఎపిసోడ్ 241: కావ్యకి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్వప్న.. రేపటికి ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్..

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

Brahmamudi అక్టోబర్ 31 ఎపిసోడ్ 241: ఏంటి మా నువ్వు ఏదో చేస్తానన్నావు. ఇంకా ఏం జరగలేదు ఏంటి అని రాహుల్ రుద్రాణిని అడుగుతాడు. నాకు ఆ స్వప్నను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని రాహుల్ అంటాడు. కడుపుతో ఉంది కాబట్టి లేకపోతే నేనేం చేసేవాడినో నాకే తెలియదు అని రాహుల్ అంటాడు. అసలు దానికి కడుపు ఉంటేనే కదా అని రుద్రాణి అంటుంది. అసలు దానికి కడుపే లేదు ఇదంతా ఒట్టి యాక్టింగ్ అని అంటుంది. లేదు మామ్ స్వప్నకు అంత తెలివి లేదు అని రాహుల్ అంటాడు. అసలు అది ఇంటికి వచ్చిందే నన్ను పెళ్లి చేసుకుంది కడుపు ఉందన్న కారణంతోనే కదా.. ఆ కడుపుని ఎలా దాస్తుంది అని రాహుల్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. సినిమాల్లో ఎంతమంది కడుపు వేషం వేసి నటించడం లేదు అది కూడా అంతే అని అంటుంది. నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు మామ్. అయినా ఇన్ని రోజుల నుంచి మనకు ఎందుకు దొరకలేదు అని రాహుల్ అంటాడు. నీకు సాక్షాదారాలతో సహా నేను చూపిస్తాను అని అంటుంది.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

కావ్య రాజ్ ఇద్దరూ త్వరగా రెడీ అయ్యారండి మీరు ఇంకా ఇలా ఉన్నారేంటి అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది. ఇద్దరు వాళ్ళ గదికి వెళ్తారు. రాజ్ కావ్యాను గదిలోకి వెళ్ళనివ్వకుండా నేను త్వరగా రెడీ అయి వచ్చేస్తాను వెయిట్ చేయమని గది బయటే నిలబడతాడు. కావ్య రాజుకి చక్కలిగింతలు పెట్టి లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది. రాజ్ కావ్య గురించి ఆలోచిస్తూ బయట నిలబడిపోతాడు. ఇక కావ్య గబగబా లోపలికి వెళ్లి చీర కట్టుకొని అందంగా ముస్తాబయి బయటకు వస్తుంది.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

కావ్యను చూడగానే రాజ్ కి షాక్ తగిలినట్టుగా అవుతాడు. కావ్యని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక కావ్య రాజ్ ని తన ఫోన్లో ఫోటో తీయమని అడుగుతుంది. ఫోటో చాలా బాగా వచ్చింది అని కావ్య అంటుంది. ఈ ఫోన్ కావాలంటే నువ్వే తీసుకోమని రాజ్ అన్నాడు. లేదు నాకు మీ ఫోన్లో ఫోటో తీస్తే చాలు అని కావ్య అంటుంది రాజ్ గదిలోకి వెళ్తూ వెళ్తూ నేను నీకు ఇవ్వాల్సింది ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అని చెప్పి.. కావ్యకి రాజ్ చకలిగింతలు పెట్టి, లోపలికి వెళ్తూ వెళ్తూ నాకు నువ్వు ఇచ్చింది ఏదైనా సరే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అని రాజ్ అంటాడు.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

రాజ్ గదిలోకి వెళ్ళగానే తన కళ్ళ ఎదురుగా వాళ్ళ అమ్మ ఇచ్చిన డ్రెస్సు రెండు బెడ్ పైన కనిపిస్తాయి. ఒకవైపు అమ్మ మరొకవైపు కావ్య ఇద్దరిలో ఏ డ్రెస్ వేసుకోవాలి అని రాజ్ ఆలోచనలో ఉంటాడు. మొత్తానికి కావ్య తీసుకువచ్చిన డ్రెస్ వేసుకొని కావ్యతో పాటు కలిసి కిందకు నడుచుకుంటూ వస్తాడు. అప్పుడే రుద్రాణి వాళ్ళ అమ్మ ఇచ్చిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకున్నాడు అని రాహుల్ తో మాట్లాడుతుంది. ఇక ఈ విషయాన్ని నేను అస్సలు వదలను దీన్ని ఓ పెద్ద ఎపిసోడ్ గానే చేస్తాను అని అంటుంది. రాజ్ వాళ్ళ అమ్మ ఇచ్చిన డ్రెస్ కాకుండా కావ్య కొన్న డ్రెస్ వేసుకుంటాడు అది చూసిన అపర్ణ కూడా షాక్ అవుతుంది. ఇక ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ అపర్ణ దగ్గర రుద్రాణి మాట్లాడుతుంది‌ నీ కొడుకు నీ చేతిలో నుంచి జారిపోయాడు నువ్వు తీసుకువచ్చిన డ్రెస్ కూడా వేసుకోలేదు అని అంటుంది. ఇక మొత్తానికి రాజ్ మౌనంగా ఉంటాడు.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

రుద్రాణి ఆ డాక్టర్ కి ఫోన్ చేసి రిపోర్ట్స్ గురించి అడగగా మీరు చెప్పింది. నిజమే ఆ డాక్టర్ ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చింది. మీ స్వప్న ప్రెగ్నెంట్ కాదు అని చెబుతుంది. థాంక్యూ డాక్టర్ ఈ విషయాన్ని నాకు చెప్పినందుకు అని చెబుతుంది దీన్ని ఎలాగైనా ప్రూవ్ చేయాలని అనుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని రాహుల్ తో చెబుతుంది. ఇంత పెద్ద విషయాన్ని ఎంత నిదానంగా ఎలా చెబుతున్నావు మమ్మీ. పద వెంటనే వెళ్లి ఈ విషయాన్ని అందరిలో చెప్పేసి ఆ స్వప్నని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామని రాహుల్ అంటాడు. తొందర పడకు రాహుల్ అని రుద్రాణి అంటుంది. దీనికి మనం సరైన సాక్షదారాలు చూపించాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ మన మీదే రివర్స్ అవుతారు అని అంటుంది. ఇక ఈ విషయాన్ని ఇప్పటివరకు స్వప్నకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారు. ఈ ఫేక్ రిపోర్ట్స్ అన్నింటినీ సృష్టించారు తన ఫ్రెండ్ ప్రియ చేత ఇవన్నీ చెప్పిస్తాను అని రుద్రాణి అంటుంది. అదే కరెక్ట్ అని రాహుల్ అంటాడు.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

రుద్రాణి స్వప్న ఫ్రెండ్ ప్రియ కు ఫోన్ చేస్తుంది‌ హలో ఎవరు అని అడగగా నీ ఫ్రెండ్ కి లేని కడుపు ఉన్నట్టు ట్రీట్మెంట్ చేస్తున్నావ్ కదా వాళ్ళ అత్తని అని రుద్రాణి అంటుంది. మీరు ఎవరికో ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశారు అని ప్రియా అంటుంది. నువ్వు చేసింది తప్పు. నువ్వు ఇచ్చిన ఫేక్ రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయి మర్యాదగా నువ్వు వచ్చి అందరి ముందు నిజం చెపితే బాగుంటుంది లేకపోతే నేను ఏం చేయాలో అది చేస్తాను అని రుద్రాణి బెదిరిస్తుంది. అయితే ఈ విషయాన్ని వెంటనే మీరు వచ్చి మా ఇంట్లో అందరికీ చెప్పండి అని చెబుతుంది.

Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights
Brahmamudi today episode october 31 2023 Episode 241 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న కి శ్రీమంతం జరుగుతుండగా స్వప్నది అసలు కడుపే కాదని ఇదంతా నాటకం అని రుద్రాణి అందరి ముందు చెబుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. స్వప్న ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు ఆ నిన్ననే వాళ్ళ అక్క మీద వేస్తుంది అసలు కావ్య నేను ప్రెగ్నెంట్ అని చెప్పమని స్వప్న చెబుతుంది. ఆ విషయం విని కావ్య షాక్ అవుతుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N