Brahmamudi Today సెప్టెంబర్ 198 ఎపిసోడ్: మళ్ళీ గొడవలకు దిగిన అప్పు : తమ గ్రౌండ్ లో వేరే వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నారని అప్పు వాళ్ళని చితక్కొట్టడానికి బయలుదేరుతుంటే కనకం అప్పు ని ఆపి గదిలో బంధిస్తుంది. ఆడపిల్లని అలా గదిలో బంధించడం ఏమిటి కనకం అని మూర్తి నిలదియ్యగా, గతం లో కూడా ఇలాగే గొడవలకు పోయి ఒకడి తల పగలగొట్టింది. అప్పుడు సమయానికి కళ్యాణ్ బాబు దేవుడిలాగా వచ్చి కాపాడబట్టి ఇది పోలీస్ కేసు నుండి తప్పించుకుంది. ఇప్పుడు ఈ గొడవల్లో మరొకరికి అలాగే తల పగలగొడితే మళ్ళీ ఎవరు కాళ్ళు పట్టుకోవాలి?, మీరంతా సైలెంట్ గా ఉండండి. అది ఈరోజు ఆ గది నుండి బయటకి వచ్చే సమస్యే లేదు అని చెప్పి వెళ్తుంది కనకం. అప్పుడు అప్పు ఎలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి అని ఆలోచిస్తున్న సమయం లో కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. చిరాకు గా అప్పు కాల్ ఎత్తుకొని ఏమిటి చెప్పు అనగా, కళ్యాణ్ ఏమిటి అంత చిరాకు గా ఉన్నావ్ అని అడుగుతాడు. అప్పుడు అప్పు ఇలా మా గ్రౌండ్ ఎవరో కబ్జా చేసారు వెళ్లి వాళ్ళ సంగతి చూడాలి అని అంటుంది.

కావ్య కి నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన రాజ్ :
అప్పుడు కళ్యాణ్ వద్దు బ్రో గతం లో కూడా ఇలాగే ఒకడి తల పగలగొట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళావ్, మనం ఈ విషయం లీగల్ గా డీల్ చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు. పిచ్చి పట్టిందా నీకు అని ఫోన్ పెట్టేసి, రూమ్ లో నుండి తప్పించుకొని గ్రౌండ్ లో గొడవలు పడడానికి వెళ్తుంది అప్పు. కళ్యాణ్ ఎలా అయినా బ్రో ని ఆపాలి అని గ్రౌండ్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.

మరోపక్క కావ్య వరలక్ష్మి వ్రతం, అలాగే కృష్ణాష్టమి కి కృష్ణుడి పూజ ఎంతో అద్భుతంగా చెయ్యడం తో ఇంట్లో అందరూ ఆమెని పొగడ్తలతో ముంచి ఎత్తుతారు. అప్పుడు రాజ్ కావ్య కి గిఫ్ట్ గా ఒక నెక్లెస్ తెస్తాడు. ఏమిటది అని ఇంట్లో అందరూ అడగగా, మా కంపెనీ కి మిడిల్ క్లాస్ నెక్లెస్ ని డిజైన్ చేసే కాంట్రాక్టు వచ్చింది. వాళ్లకి ఈ కళావతి వేసిన డిజైన్స్ చాలా బాగా నచ్చాయి, ఆ కాంట్రాక్టు మనకే ఇచ్చారు. అందుకే కళావతి కి మొదట డిజైన్ చేసిన నెక్లెస్ ని బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి ఆమె మేడలో ఆ నెక్లెస్ వేస్తాడు.

3 నెలల్లో కావ్య ని గర్భవతి ని చేస్తాను అంటూ సీతారామయ్య కి మాట ఇచ్చిన రాజ్:
అప్పుడు సీతారామయ్య కూడా రాజ్ ని ఒక బహుమతి అడుగుతాడు. మూడు నెలల్లో కావ్య గర్భవతి అయ్యింది అనే వార్త వినిపించాలి, ఇదే నా కోరిక అని అంటాడు. అప్పుడు రాజ్ కాస్త తడబడుతూ తాతయ్య అడిగిన ఆ కోరిక ని తీరుస్తా అని మాట ఇస్తాడు. కావ్య వెంటనే వంటింటికి వెళ్ళిపోయి ఆనందం తో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఇందిరా దేవి ఏమిటమ్మా ఆ కన్నీళ్లు అని కావ్య ని అడగగా,నాకు ఈ ఇంట్లో కోడలి స్థానం దక్కింది అమ్మమ్మ గారు, ఒకప్పుడు నా భర్త ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా ఉండేవాడో పూర్తిగా వ్యత్యాసం తెలుస్తుంది అని తనలో ఉన్న సంతోషం మొత్తాన్ని చెప్పుకుంటూ సంబరపడుతుంది.

ఇదంతా దూరం నుండి రాజ్ , అపర్ణ వింటూ ఉంటారు. అపర్ణ రాజ్ ని గదిలోకి తీసుకెళ్లి, ఏంటి నువ్వు వరలక్ష్మి వ్రతం తర్వాత నుండి పూర్తిగా మారిపోయావ్, కావ్య ని నిజంగానే ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు రాజ్ తాతయ్య కోసం ఇలా చేస్తున్నాను అనే విషయం నీకు తెలియకూడదు అనుకోని, కళావతి ని ఈ జన్మలో నేను భార్య గా అంగీకరించలేను, కానీ ఇప్పుడు నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అనేది చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.