NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Mahesh Babu: ఏంట్రా జుట్టు ఇంత పొడుగ్గా పెంచావ్‌.. మ‌హేష్ బాబును ఓ ఆట ఆడుకున్న మంజుల.. వీడియో వైర‌ల్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో ఈ ఏడాదిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే పండుగ అడ్వాంటేషన్ మరియు మహేష్ బాబు క్రేజ్ తో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.

మహేష్ బాబు కరీర్ లో 29వ ప్రాజెక్ట్ ఇది. అలాగే ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం రాజమౌళి చేయబోతున్న సినిమా కావడంతో అంచనాలు మరింత ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, స్టార్ రైట‌ర్‌ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. అలాగే దుర్గ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నిర్మిస్తుండ‌గా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేష్ తన మేకోవర్ ను మార్చుకుంటున్నారు. కొత్త హెయిర్ స్టైల్ ప్రయత్నించడానికి జుట్టును కూడా పొడుగ్గా పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ పెళ్లికి మహేష్ బాబు హాజరు అయ్యారు. ఆయన వెంట భార్య నమ్రతా శిరోద్కర్ మరియు కూతురు సితార కూడా వెళ్లి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఈ పెళ్లి వేడుకలో మహేష్ బాబు, ఆయన అక్క మంజుల ఘట్టమనేని మధ్య చోటు చేసుకున్న ఫన్ మూమెంట్స్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మహేష్ బాబు కంటే ముందే సదరు వివాహానికి ఫ్యామిలీతో స‌హా మంజుల కూడా హాజ‌రు అయింది. మహేష్ బాబు రాగానే మంజుల తమ్ముడి వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఆపై వెంటనే మహేష్ బాబు జుట్టును పట్టుకొని `ఏంట్రా ఇంత పొడుగ్గా పెంచావ్.. ఒరిజినలేనా..?` అంటూ ఆట పట్టించింది. అందుకు మహేష్ బాబు `ఒరిజిన‌లే గానీ వ‌ద‌ల‌వే.. రాజమౌళి సినిమా కోసం తప్పట్లేదు` అన్నట్లుగా బదిలిచ్చాడు. దాంతో మంజుల పడి పడి నవ్వేసింది. అక్క నవ్వుతో మహేష్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. అనంత‌రం ఇద్దరు సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా, ఇదే పెళ్లి వేడుక‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌, దివంగ‌త న‌టుడు కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామలా దేవి కూడా వచ్చారు. మహేష్ ని చూడగానే శ్యామ‌లా దేవి దగ్గరికి వెళ్లి పలకరించడ‌మే కాకుండా ఆయ‌న‌తో క‌లిసి ఫోటో దిగింది. అలాగే నమ్రతని కౌగలించుకొని పలకరించింది. ఇక అక్క‌డే ఉన్న సితార‌ను కూడా ప‌ట్టుకుని ఆశీర్వ‌దించారు.

https://x.com/PG_4005/status/1784771137429455207

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N