Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 15: సౌదామిని గౌరీ ఇలా చేసింది ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏదో ఆలోచిస్తున్నావు అని ఉజ్వల అంటుంది. నువ్వు ఆఫీసుకు వెళ్తే ఈశ్వర్ ని నీ వైపు తిప్పుకోవడం చాలా తేలిక అవుతుందని అనుకుంటే గౌరీ ఏంటే మన ప్లాన్ అంతా రివర్స్ చేసింది అని సౌదామిని అంటుంది. గౌరీ నేను ఆఫీస్ కి వెళ్తే ఎక్కడ బావని నా వెనకాల తిప్పుకుంటానో అని అలా మాట్లాడి ఉంటుంది అమ్మ అని ఉజ్వల అంటుంది. దానికి పెద్దగా చదువు లేకపోయినా కలంకారి వేసుకుంటూ ఉంటుంది అనుకున్నాను కానీ దాన్ని మనం తక్కువ అంచనా వేసాం బేబీ అని సౌదామిని అంటుంది.

గౌరీ ఆఫీసుకు వస్తే భావనే నా వెనకాల తిప్పుకోవడం ఎలా కుదురుతుంది మమ్మీ అందుకని నువ్వే ఏదో ఒకటి చేసి గౌరీని ఆఫీసుకి రాకుండా చేయి అని ఉజ్వల అంటుంది. కుదరదు బేబీ రెండు రోజులు వెయిట్ చెయ్ ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని సౌదామిని అంటుంది. అంతే అంటావా మమ్మీ అని ఉజ్వల అంటుంది.నువ్వు తొందరగా వెళ్లి రెడీ అవ్వు బేబీ నిన్ను వదిలేసి వాళ్ళు ఆఫీసుకి వెళ్తారు అని సౌదామని అంటుంది. కట్ చేస్తేఅమ్మ కొత్త డిజైన్స్ ప్లాన్ చేస్తే మార్కెట్లోమనకు ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అని ఆదిత్య అంటాడు.అవకాశం రావాలి అని అంటావేంటి ఆదిత్య సక్సెస్ అవ్వాలి అని సునంద అంటుంది. అమ్మ నేను అన్నయ్య దగ్గర నేర్చుకుంటున్నాను ఈ క్రెడిట్ అంతా అన్నయ్యకే దక్కాలి అని ఆదిత్య అంటాడు. ఇంతలో ఈశ్వర్ అక్కడికి వచ్చి ఏంట్రా అన్నయ్య అన్నయ్య అని మోసే స్తున్నావు అని ఆ ఈశ్వర్ అంటాడు. ఈశ్వర్ కలలో కూడా నీ తమ్ముడు నీ మీద అపనిందలు వేయడు రా అని సునంద అంటుంది.

అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని గౌరీ అంటుంది. కానీ ఇంతలో ఉజ్జల అక్కడికి వచ్చి అత్తయ్య ముందు నన్ను దీవించు గౌరీని కాదు అని ఉజ్వల అంటుంది. కానీ ముందు నేను గౌరీని ఆశీర్వదిస్తాను అని సునంద అంటుంది. అత్తయ్య ఇద్దరు కోడంలే కదా ఎందుకు అలా అన్నావు అని అఖిల అంటుంది. మేనకోడలు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు అలా కాదు కదా ఈ ఇంటి వంశాన్ని కీర్తి ప్రతిష్టలని నిలబెడతారు నాకు ఒక కూతురు ఉన్న నేను ఇలాగే చెప్పే దాన్ని మెట్టినింటిని కాపాడమని అని సునంద అంటుంది. సరే ఏమండీ మనం ఆఫీస్ కి వెళ్దాం పదండి అని గౌరీ అంటుంది. నేను నా అవిటితనాన్ని గుర్తు చేసుకోవడానికి నిన్ను ఆఫీస్ కి తీసుకు వెళ్లడం లేదు అమ్మ చెప్పిందని తీసుకు వెళ్తున్నాను ఇంతకుముందు కూడా నేను ఆఫీస్ కి వెళ్ళాను నువ్వేమీ నా చెయ్యి పట్టుకొని తీసుకు వెళ్ళక్కర్లేదు నేను ఏమైనా చిన్నపిల్లాడిలా అని ఈశ్వర్ అంటాడు. మహా ప్రభువు నేను అలా అనలేదు ఇప్పటికే లేట్ అవుతుంది పద ఆఫీస్ కి వెళ్దాం అని వాళ్లు అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా. సౌదామని చేతిలో ముత్యాలు పట్టుకొని కింద పోస్తుంది అవి చూసుకొని ఈశ్వర్ వాటి మీద కాలు వేయగానే జారి కింద పడబోతాడు అది చూసి గౌరీ పట్టుకుంటుంది నేను మీ పక్కనే ఉండగా మిమ్మల్ని కింద పడనివ్వనండి అని గౌరీ అంటుంది.

అయ్యో కొంచమైతే నువ్వు కింద పడిపోయా వాడినిగా అని సౌదామని అంటుంది. నా కోడలు ఉండగా అది జరగదు అని సునంద అంటుంది. అమ్మ నేను ఏదో చూసుకోకుండా కిందపడి పోయాను అంతేగాని గౌరీ క్రెడిట్ ఏమీ లేదు ఇక్కడ అని ఈశ్వర్ అంటాడు. థాంక్స్ పిన్ని అని గౌరీ సౌదామిని కి చెబుతుంది. అమ్మ ఆ గౌరీ నీకెందుకు థాంక్స్ చెప్పింది అని ఉజ్వల అంటుంది. నా తలకాయ నా తలకాయ అని సౌదామినేత్తి కొట్టుకుంటుంది. కట్ చేసే వాళ్ళు ఆఫీసుకు వస్తారు గౌరీ కారు దిగి ఏమండీ దిగండి అని అంటుంది.

నేను దిగగలను అని ఈశ్వర్ అంటాడు. నేను దించుతాను అనలేదు దిగమనే అన్నాను అని గౌరీ అంటుంది. టైం దొరికినప్పుడల్లా సెటైర్ వేస్తుంది అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. అందరూ కలిసి ఆఫీసులోకి వస్తారు ఆఫీస్ స్టాప్ అంతా వెల్కమ్ సార్ అంటూ వాళ్లకి బుగ్గలు ఇస్తారు. నేనేమైనా కొత్తగా ఆఫీసుకు వస్తున్నానా నాకు వెల్కమ్ చెబుతున్నారు అని ఈశ్వర్ అంటాడు. మేము చెప్పింది మీకు కాదు సార్ మేడానికి అని స్టాఫ్ అంటారు. తను ఆఫీసుకి వస్తుందని నేను చెప్పలేదు కదా అనేశ్వర్ అంటాడు.

అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు బాబు అని సత్యమూర్తి అంటాడు. సత్యమూర్తి గారు తనేమీ ఎండి పోస్టు తీసుకొని ఉద్యోగం చేయడానికి రాలేదు మా బావకి కేర్ టేకర్ గా వచ్చింది అని ఉజ్వల అంటుంది. బాబాయ్ గారు మా ఆయనకు ఉజ్వల మరదలు అవుతుంది అని మీరు తనకు ఏ పని చెప్పకుండా ఒంటరిదాన్ని చేయకండి ఏ పనైనా సరే చెప్పండి చేస్తుంది అని గౌరీ అంటుంది. సరే అమ్మ అని సత్యమూర్తి గారు అంటాడు.

ఏవండీ ఆ బుక్ ఇలా ఇవ్వండి అని గౌరీ బుకే తీసుకొని ఉజ్వల ఇవి తీసుకువెళ్లి మా ఆయన క్యాబిన్లో పెట్టు అని అంటుంది. వాట్ నేనేమన్నా ఫ్యూ నా నన్ను పెట్టమంటున్నావ్ అని ఉజ్వల అంటుంది. ఉజ్వల అలాంటివి పట్టించుకోకుండా వదిన చెప్పింది చేయి అని ఆదిత్య అంటాడు. కోపంతో రగిలిపోతూ ఉజ్వల వెళ్లి క్యాబిన్లో బొకేలు పెడుతుంది ఈ కంపెనీ ఎండి భార్య అయి ఉండి కూడా ఈ స్టాఫ్ అందరినీ సొంత మనుషుల్లా మాట్లాడుతుంది అంటే మీరు చాలా అదృష్టవంతులు సార్ అని సత్యమూర్తి అంటాడు. సత్యమూర్తి గారు నేను చెప్పిన డిజైన్ రెడీ అయ్యాయా వాటి గురించి ఆలోచించండి మీటింగ్ అరేంజ్ చేయండి అని ఈశ్వర్ అంటాడు. అలాగే సార్ అని సత్యమూర్తి గారు అక్కడనుండి వెళ్ళిపోతాడు. గౌరీ నన్ను ఇంతలా అవమానిస్తుందా భూకే నన్ను క్యాబిన్లో పెట్టమంటుందా అని ఉజ్వల ఆలోచిస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది