Ennenno Janmala Bandham: తెలుగింటి బుల్లితెర ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించిన సీరియల్స్ లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కూడా ఒకటి. స్టార్ మా చానల్లో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం కానున్న నేపథ్యంలో రాత్రి 9:30 నుంచి స్లాట్ రెడీ చేయడానికి ఆ సమయంలో ప్రసారమయ్యే సీరియల్స్ అన్నింటికీ ముగింపు పలికారు. అందులో భాగంగానే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కి కూడా శుభం కార్డు పలికారు .ఇకపోతే ఈ సీరియల్ లో హీరో యశ్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే .
ముఖ్యంగా హీరో యశ్ కి మొదటి భార్యగా ఆయనకు లవర్ గా నటించిన మాళవిక తన అందంతో అందరిని కట్టిపడేసింది. తన నటనతోనే ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు. ఇక సీరియల్ పూర్తయి దాదాపు వారానికి పైగానే అవుతున్నా ఇంకా ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటుల గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మాళవిక పూర్తి పేరు ?ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో హీరో యశ్ కి మొదటి భార్యగా నటించిన మాళవిక అసలు పేరు హీనా రాయ్. తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై అడుగు పెట్టక ముందు ఒక మోడల్ గా పనిచేసేది. అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తో కలిసి పలు ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొనుంది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాన్ని దక్కించుకొని నటించింది. అంతేకాదు పలు యాడ్స్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుల్లితెర తో పాటు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటుంది.

ఎన్నెన్నో జన్మల బంధం,ఈ సీరియల్ స్టార్ మా లోమంచి పి ఆర్ పి రేటింగ్ తో అన్ని సీరియల్స్ కన్నా ఎక్కువ ఆదరణ పొందిమంచి ముగింపు పలికిన సీరియల్.ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హిందీ టెలివిజన్ లో ఏ హే మొహబత్తేన్ రీమేక్ గా తెరకెక్కిన సీరియల్.ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రకి తగ్గట్టుగా, నటించి అభిమానుల్ని మెప్పించారు.ఇక ఈ సీరియల్ లో మాళవికా క్యారెక్టర్ లో నటించిన “హీన రాయ్ ” అందరికీ గుర్తుంటుంది.ఈ సీరియల్లో ఈమె కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది మాళవిక.ఈ సీరియల్ లో ఈమె హీరోకి మొదటి భార్యగా నటించి ఆ తర్వాత నెగిటివ్ రోల్ కూడా ఇదే సీరియల్ లో ప్లే చేసింది.తన భర్తను మోసం చేసే పాత్ర లో ఈమె తన నటను అద్భుతంగా కనపరిచింది.క్యారెక్టర్ ఏదైనా దానికి తగ్గట్టుగా నటించడం హీనరాయ్ ప్రత్యేకత.ఈమె చిన్నతనం నుండి మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ తో,తన కెరీయర్ని మోడల్ గా స్టార్ట్ చేశారు.తనకంటూ మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందింది.కొన్ని యాడ్ షూటింగ్స్ లో కూడా పాల్గొంది. బిగ్బాస్ విన్నర్ కౌశిక్ తో కలిసి ఈమె ఫ్యాషన్ షోలో పాల్గొంది. కొన్ని యాడ్స్ కి ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పనిచేసింది హీనరాయ్.ఈమె 1996 ఏప్రిల్ 12వ తేదీన జన్మించింది. ఈమె కర్ణాటకలో పుట్టి పెరిగింది.ఈమె ఎక్కువగా జువెలరీ యాడ్స్ లో నటించింది. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించింది అభిమానుల్ని.

ఆ సినిమాలలో బాగా చెప్పుకోదగినవి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, సెక్షన్497,పాయింట్ బ్లాక్,ఇలా కొన్ని సినిమాల్లో కూడా నటించారు హీన రాయ్.హీనరైకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఇంస్టాగ్రామ్ లోటచ్ లోనే ఉంటుంది.ఈమె పెట్టే ప్రతి పోస్టు కూడా ఆమె అభిమానులను కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఈమె పెట్టే ప్రతి పోస్ట్ వీడియోలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఏదేమైనా హీనా అటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్ ద్వారా యాడ్ల ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే చెప్పాలి. తెలుగులో ఈమెకు గుర్తింపు తెచ్చిన సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఈ సీరియల్ లో వచ్చిన క్రైస్ ఇప్పుడు ఆమె తను అడుగులు సినిమా వైపుకు మళ్ళిస్తోంది.పాత్ర ఏదైనా ఆ పాత్రకు ఇచ్చే కంటెంట్ ని బట్టి ఈమె నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని ఈమెకి మంచి సినిమాల్లో అవకాశాలు రావాలని, మంచి సీరియల్స్ లో కూడా ఈమె నటించాలని, తన అభిమానులను ఎప్పటికీ ఈమె అలరిస్తూ ఉండాలని కోరుకుందాం.