Krishnamma Kalipindi Iddarini: చూడు గౌరీ ఇది ఒక బిజినెస్ స్ట్రాటెజీ, ఈ స్ట్రాటెజీ ని అర్ధం చేస్కోవడం చీరలకు కలంకారి డిజైన్ వేసినంత తేలిక కాదు అని ఈశ్వర్ అంటాడు. మీరు చెప్పింది కూడా నిజమే అండి ఒప్పుకుంటాను అని గౌరీ అంటుంది. ఈ విషయాలు గురించి నీకు తెలియదు వదిలేయ్ అంటాడు ఈశ్వర్. సార్ మీరు ఏమి అనుకోను అంటే, గౌరీ మేడం చెప్పింది నిజమే అనిపిస్తుంది అని మీటింగ్ కూర్చున్న ఒక వ్యక్తి చెప్తాడు. అవును సార్ నాకు కూడా అదే మంచిది అనిపిస్తుంది అని ఆదిత్య అంటాడు. ఇంత వరకు మన కాళూర్స్ నచ్చలేదు అని ఎవరు చెప్పలేదు ఇది మన గౌరవనికి కలంకం, రేపు మీటింగ్ ఏర్పాటు చెయ్ అని ఆదిత్య తో ఈశ్వర్ అంటాడు. అందరు వెళ్ళిపోతారు. నీకు సంబంధం లేని విషయాలలో నువ్వు తల దూర్చాలని చూడకు చూసావ్ గా ఎం జరిగిందో అని ఉజ్వల గౌరీ తో అంటుంది.

కట్ చేస్తే, అఖిల అంట్లు కడగడం పూర్తి అవుతుంది. సునంద అఖిల ని పిలుస్తుంది. ఈవిడ ఒకతి అని అఖిల అనుకుంటుంది.క్యారేజ్ పెట్టావా అని అడుగుతుంది సునంద. లేదు అత్తయ్య అని చెప్తుంది అఖిల. ఇంతలో సౌదామిని వచ్చి, పాపం పొద్దునుండి అఖిల అంట్లు కడిగి బట్టలు ఉతికి అలసిపోయింది నేను చేస్తానులే అని అంటుంది. సరే అని సునంద వెళ్లిపోతుంది. చూసావా, ఇంత కష్ట పడి పని చేసిన నిన్ను, అయ్యో పాపం అని కూడా అనకుండా వెళ్లి పోయింది, కాని గౌరీ ని అందరు మెచ్చుకుంటున్నారు అని అంటుంది సౌదామిని. అయితే నేను కూడా రేపటి నుంచి ఆఫీస్ కి వెళ్తాను అంటుంది అఖిల.

కట్ చేస్తే, ఈశ్వర్ కి గౌరీ అన్నం వడ్డిస్తుంది. ఆఫీస్ కి వస్తే నీకు దూరంగా ఉండొచ్చు అనుకున్న కాని నువ్వు ఆఫీస్ లో వైఫై లాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు అని అనుకుంటాడు ఈశ్వర్. ఏమైంది అండి అలా ఉన్నారు తల నొప్పి గా ఉందా బామ్ తెచ్చి రాయన చెప్పండి అంటుంది గౌరీ.తల నొప్పికి కారణం అయ్యే వాళ్లే అడుగుతున్నారు ఏంటి ఈ కర్మ అనుకుంటాడు ఈశ్వర్. ని హడావిడి చూస్తుంటే ఏకంగా అంబులెన్సు కి కాల్ చేసేలా ఉన్నావ్ అని అంటాడు. సంబంధం లేకుండా నా మీద మా ఆయన నా మీద జోక్ లు వేస్తారు అని అంటుంది గౌరీ.అన్నయ్య వదిన ఇంత కంగారు పడడానికి కారణం ని మీద ఉన్న ప్రేమ అని ఆదిత్య అంటాడు. అది నిజమైన ప్రేమే అయితే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు కాని ప్రేమ వెనకాల ఒక స్వార్ధం ఉంది అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు.

ఒక చిన్న అబద్ధం మిమ్మల్ని మోసం అనే ముసుగులో కామ్మేస్తుంది, నిజం తెలిసిన రోజు మీరే సంతోషిస్తారు అని గౌరీ అనుకుంటుంది.గౌరీ ఇప్పుడు ఈశ్వర్ సార్ కి నేను వడ్డీస్తాను అని అంటుంది ఉజ్వల. ఉజ్వల పెళ్లి అయ్యాక మీ ఆయనకు వడ్డీదువు ప్రస్తుతానికి మా ఆయనకు నన్ను వడ్డించనివ్వు అని అంటుంది. చూడు ఉజ్వల ఉద్యోగం చేయడం చాలా అవసరం అని చెప్పావ్ గా నువ్వు ఉద్యోగం చేస్కో నేను మా ఆయనను చూసుకుంటాను అని అంటుంది గౌరీ. ఏవండీ మీరు తినండి అని అంటుంది గౌరీ. తింటుంటే ఈశ్వర్ కి పోరా పోతుంది. ఏవండీ తినేటప్పుడు కూడా ఎందుకు అండి ఆఫీస్ విషయాల గురించి ఆలోచించకండి, మీరు చేసిన డిజైన్ లు ఆ కంపెనీ వాళ్లకు కచ్చితంగా నచ్చుతాయి అని అంటుంది గౌరీ. వాళ్ళ ఇద్దరిని చూసిన ఒక ఎంప్లాయ్,మీ ఇద్దరి జంటను చూస్తుంటే ముచ్చట వేస్తుంది, మీ భార్య చాలా మంచిది మీరంటే చాలా ప్రేమ కనిపిస్తుంది, ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అని అంటాడు.

మీరు చూస్తున్న గౌరీ వేరు నాకు మనసుకు తెలిసిన గౌరీ వేరు అని అనుకుంటాడు ఈశ్వర్. కట్ చేస్తే,నువ్వు రేపు కూడా ఈ పనులు అన్ని చేయాలి, లేదంటే మీ అత్తయ్య ని నెత్తి మీద అమ్మోరు లా కూర్చుంటుంది అని సౌదామిని అఖిల తో అంటుంది. నేను చేయను నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను అని అఖిల అంటుంది. ఇదంతా ఉజ్వల చూసి, నువ్వు ఏదో తెలివైందానివి అని అనుకున్నాను కాని ఇప్పుడు అఖిల ని కూడా ఆఫీస్ రమ్మంటావ్ ఏంటి, ఆ గౌరీతోనే వేగలేక పోతున్నాను అంటే ఇంక ఇది వస్తే గౌరీ ఆపగలమా అని అంటుంది ఉజ్వల. అఖిల కి తినడం పడుకోవడం తప్పా ఇంకేం రాదు, రేపు అఖిల వస్తా అంటుంది కాని ఈశ్వర్ ఇద్దర్ని వద్దు అంటాడు అని సౌదామిని చెప్తుంది.రేపు ఇంట్లో అది రచ్చ చేస్తుంది అని అంటుంది సౌదామిని.అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి మీ బావను దగ్గర చేస్కోవచ్చు అని అంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.