Malli Nindu Jabili సెప్టెంబర్ 19 ఎపిసోడ్ 448: అరవింద్ నీ మీద రౌడీలతో ఎటాక్ చేయిస్తాడా ఆ అరవింద్ ని వదలకూడదు అని కౌసల్య అంటుంది. మల్లిని నేను పెళ్లి చేసుకున్న కానించి అరవింద్ సైకోలా ప్రవర్తిస్తున్నాడు కానీ మల్లి కి అరవింద్ మీద గౌరవం ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్పొద్దని అనుకున్నాను అని గౌతమ్ అంటాడు. అరవింద్ మీద గౌరవం ఉన్నంత మాత్రాన నా భర్త మీద అటాక్ చేస్తే నేను ఊరుకుంటానా రండి నేను చెప్తాను అని గౌతమ్ ని తీసుకొని మల్లి అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. ఎందుకు వచ్చారు అని అనుపమ అంటుంది. ముందు నీ కొడుకుని పిలువు అని మల్లి అంటుంది.

అరవింద్ బాబు గారు అని పిలుపు నుండి నీ ఆ కొడుకుని పిలువు అనే కాడికి వచ్చిందా అని అనుపమ అంటుంది. అయినా మిమ్మల్ని పిలువమని అనడం ఏంటి నేనే పిలుస్తాను అరవింద్ బాబు గారు ఒకసారి బయటికి రండి అని మల్లి పిలుస్తుంది. ఏమైంది ఏం మాట్లాడాలి అని అరవింద్ అంటాడు. నా భర్త మీద రౌడీలును పెట్టి ఎందుకు అటాక్ చేయించావు అని అరవింద్ ను మల్లి అడుగుతుంది. నువ్వు అరవింద్ ని అపార్థం చేసుకుంటున్నావు మల్లి నీ భర్త ఏది చెబితే అది నమ్మడమేనా అని అరవింద్ వాళ్ళ నాన్న అంటాడు. అంటే స్వప్న విషయంలో నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా అని అరవింద్ అంటాడు. పరిస్థితులను బట్టి నమ్మాల్సి ఉంటుంది అని మల్లి అంటుంది. కోటీశ్వరుల కోడలి కాగానే కళ్ళు నెత్తికెక్కాయ్ అనమాట అని సుమిత్ర అంటుంది.

మీరు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అరవింద్ వాళ్ళ నాన్న అంటాడు. అంతదాకా వస్తే నా భర్త మీద ఎటాక్ చేయించాడని నేనే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని మల్లి అంటుంది. ఏంటి కంప్లైంట్ ఇస్తావా ఇవ్వు అప్పుడు అస్సలు రూపం ఎవరిదో బయటపడుతుంది అప్పటికైనా నీ కళ్ళు తెరుచుకుంటా ఏమో చూద్దాం అని అరవింద్ అంటాడు. అరవింద్ గురించి నీకు బాగా తెలుసు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు చాలా మారిపోయావు మల్లి అని మాలిని అంటుంది. ఈ మధ్య ఆఫీసులో మా ఇద్దరి మధ్య గొడవలకు కూడా కారణం అవుతున్నాడు ఇది మీకు మంచిది కాదు ఇది నా వార్నింగ్ అనుకోండి అని మల్లి గౌతమ్ తీసుకొని వెళ్ళిపోతుంది.

ఇది మనకి వార్నింగ్ ఇస్తుందా దీని బతుకెంత ఇదంతా నీవల్లే అరవింద్ అని సుమిత్ర అరవింద్ ని అంటుంది.నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను పెద్దమ్మ అని అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వీళ్ళు ఇంతవరకు రాలేదు అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని కౌసల్య కంగారు పడుతూ ఉంటుంది. అదిగో అమ్మ వాళ్ళు వచ్చేసారు అని నీలిమా అంటుంది. నీ మీద ఎటాక్ చేసింది అరవిందే నని ఒప్పుకున్నాడా గౌతమ్ అని కౌసల్య అంటుంది.దొంగతనం చేసిన వాడు ఎక్కడైనా ఒప్పుకుంటాడా అమ్మ కానీ మల్లి ఒక రేంజ్ లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది అని గౌతమ్ అంటాడు. పిల్లల జోలికి వస్తే తల్లి భర్త జోలికి వస్తే భార్య ఊరుకోదని నువ్వు నిరూపించవు మల్లి అని కౌసల్య అంటుంది.

ఎందుకైనా మంచిది అరవింద్ తో జాగ్రత్తగా ఉండు బ్రో అయినా అరవింద్ జాబు తీసేయ్ ఇంకా ఎందుకు ఆఫీసులోనే ఉంచుకుంటున్నావు అని నీలిమ అంటుంది. అలా చేస్తే ఇంకా రెచ్చిపోతాడు సమయం చూసి దెబ్బ కొట్టాలి అప్పటిదాకా వెయిట్ చేయాలి అమ్మ అని గౌతమ్ వెళ్ళిపోతాడు. మల్లి ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దాం రా అని కౌసల్య అంటుంది. ఆయనకి దెబ్బ తగిలింది కదా ఆయనకి అన్నం నేనే తినిపిస్తాను అని మల్లి అన్నం ప్లేట్లో వేసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్లి తినండి అని తినిపిస్తుంది. నవ్వుతూ గౌతమ్ కట్టు విప్పేస్తాడు ఇదేంటండి మీ చేయికి ఏం దెబ్బ తగలలేదు కదా అని మల్లి అంటుంది. చిన్న టెస్ట్ పెట్టాను మల్లి నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని కానీ నాకోసం అరవింద్ వాళ్లతో బలే గొడవ పెట్టుకున్నావు మల్లి నాకైతే చాలా ఆనందంగా ఉంది కానీ అనవసరంగా తిట్టానని ఫీల్ అవుతున్నావా అని గౌతమ్ అంటాడు. అంటే అది కాదండి నీకేదన్న అయితే నేను తట్టుకోలేను ఇంకోసారి ఇలా చేయకండి అని మల్లి అంటుంది.

అరవింద్ ను పెళ్లి చేసుకొని ఆ తరువాత అతనికి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుని నామీద ఎంత ప్రేమ వల్లకపోయిస్తున్నావు మల్లి నిన్ను అడ్డం పెట్టుకొని ఆ అరవింద్ కు మనశ్శాంతి లేకుండా చేస్తాను అని గౌతమ్ అనుకుంటాడు. కట్ చేస్తే వసుంధర నా కొడుకు పెళ్లి చేశాను నా కొడుకు కోడలు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో చూద్దువు గాని రా అంటే నువ్వు అది చూద్దాంలే అని వెళ్ళిపోయావు ఇప్పటికీ నేను చెబుతున్నాను నా కొడుకు కోడలు చిలకా గోరింకల కలిసి ఉంటున్నారు అని కౌసల్య అంటుంది. వసుంధర అనుకున్నవి జరగడానికి కాస్త సమయం పడుతుందేమో కానీ జరగడం అయితే పక్కా జరుగుతాయి అందులో అనుమానమేమీ లేదు అని వసుంధర అంటుంది. ఎప్పుడు నువ్వు అనుకున్నదే జరుగుతుందని అనుకోకు వసుంధర అని కౌసల్య అంటుంది. నాకు రాహుకాలం నడుస్తుంది అందుకే ఊరుకుంటున్నాను లేదంటే నేను దెబ్బ కొడితే కుటుంబాలే కాదు సముద్రాలు కూడా అల్లకల్లోలం అయిపోతాయి అని వసుంధర అంటుంది.ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి ఏమిటి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు మా అమ్మకి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని గౌతమ్ అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది