Nindu Noorella Saavasam October 21 ఎపిసోడ్ 60: ఎంతైనా మను నా ఫ్రెండ్ కదా గుప్తా గారు అయినా అంతా నాదే తప్పు ఆయన నన్ను ఇష్టపడి చేసుకుంటానని అని గానే నేను ఒప్పుకోవడం నాదే తప్పు అప్పటికి మనుని నేను చాలా సార్లు అడిగాను నువ్వు ఒప్పుకుంటేనే పెళ్లి అవుతుంది నీకు ఓకేనా అని తను కూడా అప్పుడు ఒప్పుకుంది కానీ ఇప్పుడు ఆయన అంటే ఇష్టపడుతుంది మొదటి నుంచి అలానే ఉందా మధ్యలో ఇలా తయారయిందా అర తనకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఇప్పటికిప్పుడు వెళ్లిపోమంటే తను కూడా అనాదే కదా గుప్తా గారు అని అరుంధతి అంటుంది.అలాగని నీ స్నేహితురాలని ని కుటుంబానికి దగ్గరగా ఉంచుతావా అని గుప్తా అంటాడు.

మరి ఏం చేయను గుప్తా గారు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే అది ఎక్కడికి వెళ్తుంది తనకు మాత్రo ఎవరున్నారు చెప్పు అయినా మను నా ఫ్రెండే కదా వెళ్లేలా చేయలేను నా మనసు దానికి ఒప్పుకోవట్లేదు మనుకి నేనంటే చాలా ఇష్టం ప్రపంచంలో కోట్లాదిమంది ఉండొచ్చు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండడం అదృష్టం అది నేను చిన్నప్పటినుంచి ఒకే దగ్గర పెరిగి పెద్దయ్యాము తను మారుతుంది గుప్తా గారు నాకు ఆ నమ్మకం ఉంది అని అరుంధతి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.బాలిక నేను చెప్పేది వినుము అనే గుప్త అంటాడు అయినా సరే పట్టించుకోకుండా అరుంధతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఉన్నపలంగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావ్ ఏంటి అని భాగమతి వల నాన్న అంటాడు. మీ కూతురే తీసుకురమ్మని దండి అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది.

నా కూతురు ఇక్కడికి తీసుకురమ్మందా తనకి ఉద్యోగం మంచి దొరికిందా అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. ఒరేయ్ తమ్ముడు బాగమతికి ఫోన్ చేయరా అని వాళ్ల పిన్ని అంటుంది. వాళ్ళ మామయ్య ఫోన్ చేసి హలో బాగి మేము సిటీకి వచ్చేసాంఒకసారి వచ్చి పొమ్మని మీ నాన్న అంటున్నాడు అని అంటాడు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోవడానికి ఇదేమైనా మీ అత్తారిల్లు అనుకున్నావా నేను పని చేస్తున్న ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు నేను వీలు చూసుకుని వస్తాను అయినా నీకు చెప్పిన అర్థం కాదులే అని భాగమతి అంటుంది.

సరేలే మీ నాన్నకి ఇస్తాను మాట్లాడు అనే వాళ్ళ నాన్నకి ఫోన్ ఇస్తాడు. హలో నాన్న ఎలా ఉన్నావు అని భాగమతి అంటుంది. నేను బాగానే ఉన్నాను అమ్మ నువ్వు ఎలా ఉన్నావ్ నీకు కొత్త ఉద్యోగం దొరికిందా నువ్వే నన్ను ఇక్కడికి తీసుకు రమ్మన్నావంట కదా అని అంటాడు వాళ్ళ నాన్న. అవును నాన్న అక్కడ హాస్పిటల్ లో ఏవి సరింగా లేవు అందుకే ఇక్కడికి తీసుకొచ్చి చూపిద్దామని తీసుకురమ్మన్నాను అని భాగమతి అంటుంది. సరే బాగి ఉంటాను వీలున్నప్పుడు వచ్చి వెళ్ళు అని వాళ్ళ మామయ్య అంటాడు. అక్క ఒకసారి ఇలా రా ఉన్న ఫలంక మన ఊర్ని వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సిన పని ఏంటి అని వాళ్ళ తమ్ముడు అంటాడు.ఒరేయ్ భాగమతి మన చేయి జారిపోతుంది అని ఇక్కడికి వచ్చాము రా ఆ మిలిటరీ ఆయన చూసావా ఎంత ఎర్రగా అందంగా ఉన్నాడో ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకునే లోపు నీకు ముడి పెట్టాలి లేదంటే అది మనల్ని చూసుకోదు రా అని వాళ్ళ పిన్ని అంటుంది.

సరే అక్క నేను బయటికి వెళ్లి వస్తాను అని వాళ్ళ తమ్ముడు వెళ్లిపోతాడు. కట్ చేస్తే పిల్లలు ఆంటీ అంకుల్ అందరూ కిందికి రండి కమాన్ కమాన్ మీకు ఇష్టమైనవి అని వండించాను అని మనోహరీ అంటుంది. ఏంటమ్మా ఏమైనా స్పెషలా ఇవ్వాలా ఎందుకు అందరికీ ఇష్టమైన అని వండించావు అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. ఊరికే మీకు ఇష్టమైన వని ఈరోజు వండి పెడదామనిపించింది అని మనోహరి అందరూ కూర్చోండి నేను వెళ్లి అమరేంద్ర అని పిలుచుకు వస్తాను అని అంటుంది. అమరేంద్ర భాగమతి మెట్లు దిగుతూ ఉంటారు. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది అని నీలు తన మనసులో అనుకుంటుంది. అమరేంద్ర వచ్చి కూర్చుంటాడు భాగమతి నువ్వు కూడా కూర్చో అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. పర్వాలేదండి మీరు తినండి నేను తర్వాత తింటాను అని భాగమతి అంటుంది. ఏం పర్వాలేదు వచ్చి ఇలా కూర్చో అని తనని కూర్చోబెడుతుంది వాళ్ళ అమ్మ. ఇంకా ఎవరి కోసం రా ఎదురు చూస్తున్నావు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు.

రాథోడ్ రా భోజనం చేద్దాం అని అమరేంద్ర అంటాడు. మీరు తినండి సార్ నేను తర్వాత తింటాను అని రాథోడ్ అంటాడు. పర్లేదు వచ్చి కూర్చోవయ్యా అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. తనని ఇబ్బంది పెట్టకండి అంకుల్ నీళ్లు తో కలిసి తింటాడు అని మనోహరి అంటుంది. మనోహరి రాథోడు ఇoటి పనిమనిషి కాదు తను ఈ ఇంటి మనిషి అరుంధతి ఎప్పుడు తనని సొంత అన్నయ్యలా చూసుకునేది అని అమరేంద్ర అంటాడు.పర్వాలేదు వచ్చి కూర్చోవయ్యా రాథోడ్ అని వాళ్ళ నాన్న తనని కూర్చోబెడతాడు. ఇదే మంచి సమయం చెప్పు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. అమ్మో నేను మనిద్దరం కలిసి చెబుదామనుకున్నాము కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అమరేంద్ర ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు చెప్పండి అని అంటాడు.

వాళ్లు ఏం చెప్పాలో ఏమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకటి చెప్పాలి సార్ ఇన్ని రోజులు బాధలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు కొత్త స్కూల్ కి మారిపిస్తున్నాం రేపు ఎలాగూ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కదా ఏదైనా పిక్నిక్ తీసుకెళ్తే రిలీఫ్ అవుతారు ఆ తర్వాత కొత్త స్కూల్ కి వెళ్లి బాగా చదువుకుంటారు అని అరుంధతి అంటుంది. ఏం అక్కర్లేదు ఇంట్లోనే ఆడుకుంటారు ఎల్లుండి స్కూల్ కి వెళ్తారు అని మనోహరి అంటుంది. అచ్చం నువ్వు మా మేడం గారు లాగే మాట్లాడుతున్నావు అమ్మాయి తను కూడా పిల్లలుమూడిగా ఉంటే రిలీఫ్ అవుతారని ఎక్కడికైనా తీసుకెళ్లమనేది అచ్చం మేడంగారు లాగే మాట్లాడుతున్నావ్ అని రాథోడ్ మళ్ళీ మళ్ళీ అంటాడు. మంచి ఆలోచన అమ్మాయి నువ్వేమంటావు అమర్ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఈవిడ ఒక్కతి ప్రతిదానికి దాన్ని పొగిడేస్తుంది అని మనోహరి అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది