Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ పద్మావతి, అను లను చూసి ఆనందపడిన పార్వతి. తన అత్తవారింట్లో భర్తల దగ్గర ఎలా ఉండాలో చెప్పిన పార్వతి. విక్కీ పద్మావతి ఇద్దరు అందరి ముందు నటిస్తూ ఉంటారు. ఆర్య అరవింద కు ఫోన్ చేసి తను మర్చిపోయిన గిఫ్ట్ ని పంపించమని చెప్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి అను ఆర్యాలచేత చిలకమ్మా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కలిసి బిందెలలో వేసే ఉంగరపు ఆటని ఆడిస్తూ ఉంటారు. ముందుగా ఆర్య అను ఆడుతారు. ఈ ఆటలో గెలిచేది మా అక్కయ్య అని అంటుంది పద్మావతి. లేదు ఖచ్చితంగా ఆర్యా గెలుస్తాడు అంటాడు విక్కీ. కమాన్ అక్క నువ్వే గెలవాలి అని అంటుంది పద్మావతి. ఆర్య మనమే గెలవాలి రా అని అంటాడు విక్కీ. ఆర్య కావాలని అను చేతిలో ఓడిపోయి ఉంగరాన్ని అణువు చేతిలో పెట్టేస్తాడు అను ఉంగరాన్ని బిందెలో నుంచి తీసి తనే గెలిచినట్టుగా చెప్తుంది. చూశారుగా మా అక్కయ్య గెలిచింది అని అంటుంది పద్మావతి. ఏంట్రా ఆర్య ఇలా చేసావని అంటాడు విక్కీ మా ఇద్దరిలో ఎవరు గెలిచినా మేమిద్దరం గెలిచినట్టే అని అంటాడు ఆర్య. ఆండాలు బాగా చెప్పావు బాబు ఎప్పటికీ మీరిద్దరిలోనే కలిసి ఉండాలి అని అంటుంది.

Nuvvu Nenu Prema: కూతుర్లను చూసి ఆనంద పడిన పార్వతి..పద్మావతికి మంచి మాటలు చెప్పిన పార్వతి..
Nuvvu Nenu Prema పద్మావతి విక్కీల ఆట..
పద్మావతి విక్కిలను ఆడ మంటుంది చిలకమ్మా. పద్మావతి రా ఇప్పుడు నీ సంగతి చెప్తాను ఎలా గెలుస్తావో చూస్తాను అని అంటుంది. గెలిచేది నేనే పద్మావతి అని మనసులో అనుకుంటారు ఇద్దరు. అది చూద్దాం ఎలా గెలుస్తావు టెంపర్ వడ అని అంటుంది పద్మావతి మనసులో, పద్మావతి వికీ ఇద్దరు బిందెలో నుంచి ఉంగరాన్ని తీయడానికి ఒకరికొకరు కొట్టుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు కానీ చివరికి విక్కీ నే ఉంగరాన్ని తీస్తాడు. గెలిచింది నేనే అని అంటాడు విక్కీ. నువ్వు ఎప్పటికీ నా చేతిలో ఓడిపోవాల్సిందే అని అంటాడు. ఒకసారి గెలిస్తే గెలిచినట్టు కాదు సారు ఇంకా టూ టైమ్స్ ఉంది ఈ రెండు సార్లు నేనే గెలిచి మీకు గెలుపు అంటే ఏంటో చూపిస్తాను అని అంటుంది. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటేనే నాకు ఇష్టం ఉండదు అని అంటాడు విక్కీ. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్ ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటుంది పద్మావతి. చిలకమ్మా నువ్వు మళ్ళీ రెడీ చెయ్యి అని అంటుంది చిలకమ్మ మళ్ళీ ఉంగరాన్ని బిందెలో వేసి, విక్కీ పద్మావతి ఏమంటుంది రెండోసారి ఇద్దరు పోటీపడి బిందెలో నుంచి ఉంగరాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు.
Ennenno Janmala Bandam: వేద కోసం వంట చేసిన యశ్.. చిత్రకి డ్రైవింగ్ నేర్పిన వసంత్..

పద్మావతి గెలుపు..
రెండోసారి ఉంగరాన్ని పద్మావతి తీసి నేనే గెలిచాను అని అంటుంది. మొదటిసారి నేను గెలిచాను అని అంటాడు విక్కీ రెండోసారి నేనే గెలిచాను అని అంటుంది పద్మావతి. ఇంతలో ముచ్చటగా మూడోసారి తీయండి బాబు ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు అని అంటుంది. ముచ్చటగా మూడోసారి ఉంగరం తీయడానికి రెడీ అవుతారు పద్మావతి. చిలకమ్మా ఇప్పుడు ఎవరు తీస్తారో వాళ్ళే గెలిచినట్టు అని ఉంగరాన్ని అందులో వేస్తుంది. విక్కీ పద్మావతి ఇద్దరు చాలా పోటీపడి మూడోసారి ఉంగరాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు పక్కనుంచి ఆర్య కమాన్ విక్కి ఇప్పుడు మాత్రం నువ్వే తీయాలి మనమే గెలవాలి అని అంటాడు పద్మావతిని కూడా అను అట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. పద్మావతి వికీతో ఉంగరం నాకు దొరికింది మీరు చేయి వదిలిపెట్టండి అని అంటుంది ముందు లేదు ఉంగరం నాకే దొరికింది నువ్వే చేయ వదిలిపెట్టు అని అంటాడు చిలుకమ్మ ఆటలోనే సరసాలు మొదలు పెట్టారా బాబు అని అంటుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంగరం తీస్తేనే కదా గెలిచింది ఎవరో చెప్పడానికి తొందరగా తీయండి బాబు అని అంటుంది చిలకమ్మా. పద్మావతి వికీ ఉంగరాన్ని నువ్వు వదులు అంటే నువ్వు వదిలి అని గొడవ పడుతూ ఉంటారు. విక్కీ గెలిచేది నేనే నువ్వు వదిలేసే ఉంగరాన్ని అని అంటాడు చూద్దాం ఎవరు గెలుస్తారో అని విక్కీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కన్ను కొడుతుంది పద్మావతి వెంటనే విక్కీ ఒకసారిగా ఉంగరాన్ని వదిలేస్తాడు పద్మావతి ఉంగరాన్ని తీసుకొని బిందెలో నుంచి బయటికి తీసి నేనే గెలిచాను అని అంటుంది. ఒకసారి గా అందరూ కేరింతలు కొడతారు వికీ షాక్ అవుతాడు. ఆర్య నాకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి రా అని అంటాడు. నువ్వు కూడా కావాలని పద్మావతిని గెలిపించావు కదా అని అంటాడు. పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేదేలే గెలిచింది నేనే అని అంటుంది పద్మావతి. నువ్వు చీటింగ్ చేసి గెలిచావు అని అంటాడు చీటింగ్ చేయలేదు సారూ తెలివి ఉపయోగించి గెలిచాను ఇప్పటికైనా ఒప్పుకోండి గెలిచింది నేనే అని అంటుంది పద్మావతి. వికీ కోపడబోవుగా అందరూ ఉన్నారు ఇప్పుడు మీరు కోప్పడకూడదు అని అంటుంది పద్మావతి. మనమందరం ముందు నవ్వుతూ ఉండాలి మర్చిపోయారా అని అంటుంది.
Bhrahmamudi: వ్రతాన్ని పూర్తి చేసిన రాజ్, కావ్య.. రుద్రాని ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న జంట..
ఆర్య మీద కుచల కోపం..
ఆర్య అరవింద్ అనే గిఫ్ట్ పంపించమని చెప్తాడు అరవింద గిఫ్ట్ లాప్టాప్ తీసుకొని కిందకు వచ్చి పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా వస్తుంది. ఏంటి గిఫ్ట్ అని అడుగుతుంది. గిఫ్టు ఆర్య పంపించమన్నాడు అను కోసం ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు పిన్ని అందుకనే పంపిస్తున్నాను అని అంటుంది అరవింద. ఏం గిఫ్ట్ ఇది అని అంటుంది అమ్మకి మాత్రం గిఫ్ట్ కాదు కదా చిన్న చీర కూడా కనిపెట్టడు కానీ పెళ్ళానికి మాత్రం మంచి మంచి గిఫ్ట్ ఎ కొనిస్తున్నాడు వీడు అని అంటుంది. ఇంతకీ ఈ గిఫ్ట్ లో ఏముందో అని అంటుంది ఫోన్ అనుకుంటా పిన్ని అని అంటుంది అరవింద మరి ఇంకేం ఒక లక్ష రూపాయలు అయినా ఉంటుంది చీఫ్ ఫోన్లు వాడే వాళ్ళకి లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తున్నాడా అని అంటుంది. ఎందుకు పిన్ని అలా మాట్లాడుతారు మన అను నీ కదా అని అంటుంది. సరేలే పిన్ని ఇప్పుడుగొడవ ఎందుకు అని అంటుంది.వాడు పూర్తిగా మారిపోయాడు అయినా వాడిని అనుకోని ప్రయోజనం లేదు మార్చింది వాళ్ళ పెళ్ళాం అనునే కదా, ప్రతిదీ నాకు చెప్పి చేసేవాడు ఇప్పుడు నాకు చెప్పకుండా భార్యకి గిఫ్ట్లు ఇస్తున్నాడు అని అంటుంది కుచల. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరవింద చిన్న దానికే ఎందుకింత కోప్పడతారు పిన్ని అనుకుంటూ, పని వాళ్ళ కోసం అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు. ఏంటి అరవింద, దేనికోసం పిలుస్తున్నావు అని అంటాడు కృష్ణ ఏం లేదండి, ఆర్య తన ఫస్ట్ నైట్ లో అనూకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు దాన్ని ఇక్కడ మర్చిపోయాడు ఆ గిఫ్ట్ పంపించమన్నాడు విక్కీ కూడా లాప్టాప్ పంపించమన్నాడు అందుకని తీసుకెళ్తారేమోనని, రంగయ్య అని పిలుస్తున్నాను అని అంటుంది. పర్వాలేదు రానమ్మ నాకు ఇవ్వు నేను తీసుకెళ్తాను అని అంటాడు. మీరు ఎలా తీసుకెళ్తారండి వద్దులే దీనికి పని వాళ్ళని పంపిస్తాను అని అంటుంది పర్వాలేదు నేను తీసుకెళ్తాను కదా, ఇది చాలా కాస్ట్లీ కదా రానమ్మ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ పని వాళ్ళకి ఇస్తే ఎట్లాగూ అందుకని నేనే తీసుకుంటాను వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ నా బావమరిది కదా అని అవి గిఫ్టు లాప్టాప్ తీసుకుంటాడు కృష్ణ. ఫస్ట్ నైట్ ఎలా జరుపుకుంటారు నేను చూస్తానువస్తున్నాను మీ దగ్గరికే అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

పూల బంతి ఆట మొదలు..
పద్మావతి విక్కీ అను ఆర్యాల చేత పూల బంతు లాట ఆడిస్తూ ఉంటారు.ఈ ఆటలో కూడా గెలిచేది నేనే అని అంటుంది పద్మావతి. ఒకసారి చీటింగ్ చేసి గెలిచావు ఈసారి ఆ ఛాన్స్ నీకు ఇవ్వను. అని అనుకుంటాడు మనసులోకి విక్కీ. భార్యాభర్తలు దేనినైనా కూడా, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి అని తెలిపేదే ఈ పబంతులాట అని ఆండాలు చెబుతుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ ఒకరికొకరు కావాలని గట్టిగా తగిలేలా వేసుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు తప్పించుకుంటూ ఉంటారు విక్కీ మనసులో నువ్వు ఎన్ని ఆశలు వేసినా కానీ గెలిచేది నేనే, అని కావాలనే విక్కీ పద్మావతిని గట్టిగా, పద్మావతి తగిలేలాగా బంతి ని విసురుతాడు.పద్మావతికి దెబ్బ తగులుతుంది. పద్మావతి చెక్క నీ సంగతి అని కావాలని విక్కీ కంటికి వేస్తుంది బంతిని. నీకే ఒకసారి గా కన్ను, ఏదో పడినట్టు అనిపించింది అని అంటాడు. చిలకమ్మా మీరు వెళ్లి చూడండి అమ్మ అబ్బాయి గారి కంట్లో ఏదో పడినట్టు ఉన్నది అని అంటుంది. అండాలు కాస్త బంతిని చూసుకొని వేయాలి కదా పద్మావతి అని అంటుంది.పద్మావతి విక్కి కన్ను ఊదడానికి వెళుతుంది.విక్కీ కావాలని నాకు కంటికి వేసి కొడతావు కదా చెప్తా నీ సంగతి అని అంటాడు.కావాలని కొట్టానని తెలిసింది కదా అందరూ చూస్తున్నారు కొంచెం నవ్వండి అని అంటుంది. మీరు మరీ ఇంత సుకుమార్లు అయితే ఎలాగండి అని అందరి ముందు నటిస్తూ ఉంటుంది పద్మావతి. విక్కీ కూడా ఇంకా,చాలు వెళ్ళు అని అంటాడు చిలకమ్మా మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాంటిది అమ్మ అని అంటుంది.కృష్ణ ఎలాగైనా పద్మావతి విక్కి లా ఫస్ట్ నైట్ ఆపాలని పద్మావతి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. నేను నీ దగ్గరికి వస్తున్నాను విక్కీ ఎలా నువ్వు సంతోషంగా ఉంటావో నేను చూస్తాను మీరిద్దరి మధ్య అగాధం ఏర్పడితే కదా నాకు ఆనందం అని అనుకుంటాడు కృష్ణ.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతికి పార్వతి భర్తతో ఎలా ఉండాలో చెప్పి పంపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏ అగాధాలు ఉన్నా కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టాలి. తనకు నచ్చని పని ఏది ఈరోజు చేయవాకు, మీ దాంపత్య జీవితం ఈరోజు తోనే మొదలవుతుంది. మీ ఇద్దరి ఇష్టాలతో పాటు తనువులు కూడా కలవాలి. పార్వతి చెప్పిన మాటలన్నీ పద్మావతి తలుచుకుంటూ విక్కీ ఉన్న గదిలోనికి వస్తుంది.