Malli Nindu Jabili: నీ చేతిలో మ్యాజిక్ ఉంది మల్లి అంటాడు గౌతం. అమ్మ వంటలని ఏరోజైనా ఇలా పొగిడావా బ్రో అంటుంది నీలిమ. అంటే అది అమ్మ కూడా బాగానే చేస్తుంది అంటాడు గౌతం.రేయ్ కవరింగ్ వద్దు రా నేనేమీ అనుకోనులే క్రెడిట్ అంతా నీ భార్యకే ఇవ్వు అంటుంది కౌసల్య. అయితే ఓపెన్ గా చెప్పేస్తా అమ్మకంటే నువ్వే బాగా చేసావు మల్లి అని అంటాడు గౌతమ్. మల్లి థాంక్స్ చెప్తుంది.రోజు కిచెన్ లోకి వెళ్లొద్దు మళ్ళీ కానీ అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండు అని అంటాడు గౌతమ్. అలాగే అండి అంటుంది మల్లి. ఇక నువ్వు కూడా కూర్చో అమ్మ అని కౌసల్య అంటుంది. మీరు తిన్న తర్వాత తింటానులేండి అంటుంది మల్లి. అలాంటి ఫార్మాలిటీస్ నా దగ్గర పెట్టుకోవద్దు కూర్చో అంటాడు గౌతమ్. మల్లి కూర్చొని తింటుంది. కౌసల్య నీలిమ తిని వెళ్లిపోతారు. నువ్వేం అనుకోకపోతే నేను లేవచ్చా అని అడుగుతాడు గౌతమ్,మల్లి ఇంత రుచిగా చేసిన నీ చేతికి ఒక చిన్న బహుమతి అని చెయ్ మీద ముద్దు పెడతాడు.

మల్లి సిగ్గు పడుతుంది. కట్ చేస్తే సుదర్శన్ వస్తాడు. మీ అబ్బాయి పెళ్ళికి రాలేకపోయాను ఏమీ అనుకోకండి అని సుదర్శన్ చెప్తాడు. కుదరనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు లెండి ఏదైనా విశేషమా అని అడుగుతుంది కౌసల్య. గౌతం పెళ్లయిన వెంటనే నీలిమ పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని అన్నారు అంట కదా ఆ పని మీద వచ్చాను అని సుదర్శన్ చెప్తాడు. ఒక నిమిషం ఉండండి గౌతమ్ ఒకసారి ఇలా రా అని కౌసల్య పిలుస్తుంది. గౌతమ్ కిందికి వచ్చి కూర్చుంటాడు. నీలిమా కి సంబంధాలు చూడమని గతంలో చెప్పాను అని కౌసల్య గౌతమ్ కి చెప్తుంది. నీలిమ చదువు కంప్లీట్ అయిన తర్వాత చూద్దాంలే అమ్మ ఎందుకు అంత తొందర అని గౌతమ్ అంటాడు. అన్ని అనుకోగానే జరిగిపోవు కదా గౌతమ్ ఇంతలో మల్లి వస్తుంది మల్లి నువ్వు కూడా కూర్చో అంటుంది కౌసల్య. మీకు రత్నాకర్ గారు గుర్తున్నారా, వాళ్ళ అబ్బాయి సీఈఓ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆ అబ్బాయి అయితే మీ అమ్మాయికి చాలా బాగుంటుంది అని సుదర్శన్ చెప్తాడు.ఫోటో మిగిలిన వివరాలు నేను మీకు పంపిస్తాను అంటాడు సుదర్శన్. అబ్బాయి బాగుండి అన్ని రకాలుగా మాకు సెట్ అయితే శుభకార్యము జరిపించేస్తాము.కాకపోతే అబ్బాయికి ఇదివరకే పెళ్లయింది అని చెప్తాడు సుదర్శన్. కొంతకాల క్రితం డైవర్స్ తీసుకున్నారు.

కానీ అబ్బాయి చాలా మంచివాడు ఈ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఏమంటారమ్మా అని అడుగుతాడు. అవసరం లేదు మాకు అలాంటి సంబంధం అవసరం లేదు అని గౌతమ్ అంటాడు. ఈరోజుల్లో విడిపోడాలు విడాకులు తీసుకోవడానికి మళ్లీ మరొకరిని చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది బాబు అని సుదర్శన్ అంటాడు. ఆల్రెడీ పెళ్లయినవాడు నా చెల్లికి భర్తగా రావడం నేను ఒప్పుకోను సెకండ్ హ్యాండ్ వాడిని చేసుకోవడం నా చెల్లికి ఏంటి అని గౌతమ్ అంటాడు. అవును సుదర్శన్ గారు రెండో పెళ్లి అయిన వాడిని నీలిమకు ఇచ్చి చేయలేము అని కౌసల్య అంటుంది. ఒక్కసారి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టిన వాడు నా చెల్లెలి మేడలు తాళి కట్టడానికి అనర్హుడు, పొద్దుందా లేదా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పో అని గౌతమ్ అంటాడు. ఇంకోసారి అలాంటి దరిద్రపు సంబంధాలు తీసుకొచ్చారంటే బాగోదు వెళ్ళండి అంటాడు. సుదర్శన్ వెళ్ళిపోతాడు. బ్రో కూల్ అని నీలిమ చెప్తుంది. మల్లి గౌతం బాబు గారు అంటుంది. నువ్వేం మాట్లాడకు మల్లి మనం సాయంత్రం డిన్నర్ కి వెళ్దాం రెడీగా ఉండు అంటాడు.

అరవింద్ బాబు గారితో నాకు పెళ్లయింది అని తెలిసి ఎలా ఒప్పుకున్నారు అంటే నన్ను ఇష్టపడ్డారు కాబట్టి మా పరిచయం ఆయనకు నచ్చింది కాబట్టి నేను గౌతమ్ సర్ ప్రాణం కాపాడాను కాబట్టి నేను నిజం చెప్పిన నన్ను చేసుకున్నారనుకుంటా అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి డిన్నర్ కి వెళ్తారు. ఎంతసేపు అలా చూస్తూ ఉంటారు అని మల్లి గౌతమ్ అడుగుతుంది.నువ్వు ఓపికగా కూర్చుంటే జీవితాంతం ఇలాగే చూస్తూ ఉండిపోతాను, ఎందుకంటే నీ కళ్ళు నా కళ్ళను అంతలా ఆకట్టుకున్నాయి, నీ కళ్ళలో మన ఫ్యూచర్ అంతా కనపడుతుంది, మనం ఎంత సంతోషంగా ఆనందంగా బ్రతుకుతాము కనపడుతుంది, జీవితంలో చాలా మంది పరిచయమవుతారు కానీ జీవితాంతం ఉండేది ఒకరే నాకు నువ్వు నీకు నేను, ఎందుకు నవ్వావు అని గౌతమ్ అడుగుతాడు. మీలో ఇప్పుడు నాకు ఒక కవి కనపడుతున్నాడు అని మల్లి అంటుంది. ఈ క్షణం నేనొక విషయం చెప్తాను బాగా గుర్తుంచుకో, ఇంతకుముందు నువ్వు నా ఇంట్లో గెస్ట్ ల షెల్టర్ తీసుకున్నప్పుడు, నేను ఏదైనా అంటే పడే దానివి మీరు అనేవాళ్ళు మేం పడే వాళ్ళం అనే దానివి ఇప్పుడు నువ్వు అలాంటి ఫీల్ తో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు గౌతమ్ నంద భార్యవి సరేనా అని గౌతమ్ అంటాడు.

నిన్ను ఎవరితో ఒక్క మాట కూడా పడనివ్వను అని అంటాడు. వెయిటర్ ఆర్డర్ తెచ్చి ఇస్తాడు. మల్లి గౌతమ్ తింటారు. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ఉంది అని గౌతమ్ అడుగుతాడు. కొత్తగా ఉంది అని మల్లి చెప్తుంది. గౌతమ్ వాళ్లు కార్ ఎక్కుతుంటే, గౌతమ్ మమ్మల్ని గుర్తుపట్టావా అని అడుగుతారు ఇద్దరు. మర్చిపోయావా అంతేలే స్వప్న చనిపోయిన తర్వాత స్వప్న ని స్వప్న జ్ఞాపకాల్లో ఉన్న మమ్మల్ని కూడా మర్చిపోయావు అని అంటారు. మేము చూసిన వాళ్ళలో నువ్వే చాలా సెల్ఫిష్ అని అంటాడు. స్వప్న చనిపోయిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉన్నావు. దాంతో గౌతమ్ కి కోపం వచ్చి కాలర్ పట్టుకుంటాడు.