Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతిని అను అపార్థం చేసుకుంటుంది. కావాలనే తనకి ఆస్తి ఇస్తుంటే పద్మావతి ఇవ్వకుండా అడ్డుపడుతుంది అని అనుకుంటుంది.పద్మావతి విక్కీ తన ని మోసం చేసినందుకు బాధపడుతుంది. విక్కీ పద్మావతి ని ఆరునెల్లి మాత్రమే తన భార్యగా ఉంటావని ఈలోపు ఇలాంటివి చేయొద్దని హెచ్చరించి వెళ్లిపోతాడు.

ఈరోజు ఎపిసోడ్ 420 లో,పద్మావతి అనుతో వికీ తనని కావాలని ఏడిపించడానికి అబద్ధం చెప్పి మీ అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాడని, నిజంగా నీకు ఆస్తిస్తే నా కన్నా సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరు అని అనుతో చెప్పి అనువుని కన్విన్స్ చేస్తుంది. దానికి అను చాలా సంతోషించి పద్మావతిని అర్థం చేసుకుంటుంది.అదే టైం కి కుర్చీలో వచ్చి పకోడీ చేయమని చెప్పగా, పద్మావతి అను కలిసి పకోడీ చేస్తారు.
Nara Brahmani: అట్టర్ ఫ్లాప్ అయిన నారా బ్రాహ్మణి ప్లాన్ – నువ్ ఇంకా ఆపేయ్ అన్న బాలయ్య ?

అరవింద మీద పద్మావతి ప్రేమ.
పకోడీ ప్లేటు 2000 రూపాయలు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ పద్మావతి అడుగుతుంది. కుచల నువ్వే ఇంట్లో ఫ్రీగా వచ్చావు మళ్లీ నీకు డబ్బులు ఎందుకు మీరే మాకు జీవితాంతం అక్క చెల్లెలు ఊడిగం చేయాల్సి ఉంటుంది అని అంటుంది. అయినా పద్మావతి తగ్గకుండా మీరు నాకు 2000 రూపాయలు ఇస్తేనే పకోడీ ఇస్తాను అని అంటుంది. దానికి అరవిందా ఎందుకు పద్మావతి గారు ఇంత పట్టుబట్టి 2000 అడుగుతున్నారు అని అంటుంది. వెంటనే పద్మావతి నేను మీకు మీ కడుపులో పెరిగే బిడ్డకు, మంచి జరగాలని అనాధాశ్రమంలో ఇవ్వడం కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను అని అంటుంది. ఆ మాటకి అరవిందా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా నేనంటే మీకు ఎంత ఇష్టం పద్మావతి అని అంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వెంటనే ఆర్య ప్లేట్ కి 2000 కాదు పద్మావతి 5000 తీసుకో అని అంటాడు. వద్దు బావ గారు నేను ఎంత కష్టపడ్డానో దానికి తగిన ఫలితం ఇస్తే చాలు నాకు అని అంటుంది పద్మావతి. నా కష్టార్జితాన్ని నేను అనాధాశ్రమంలో ఇద్దాం అనుకున్నాను లేదంటే మిమ్మల్ని అడిగితే మీరు ఎవరిని కాదు కదా అని అంటుంది. ఆర్య అందరికీ డబ్బులు నేనే పే చేస్తాను అని అంటాడు దానికి విక్కీ వద్దు నేను పే చేస్తాను అని అందరి డబ్బులు వికైన ఇచ్చి పద్మావతి దగ్గర పకోడీ ప్లేట్స్ తీసుకుంటారు. కృష్ణాష్టమి వేడుకలను చేయాలి కదా రేపు ఉదయం,ఈసారి పోటీలో ఎవరు ఉంటున్నారు అని అడుగుతుంది దానికి ఆర్య ఈసారి పద్మావతి విక్కి ఇద్దరు పోటీకి ఉంటారు అని చెప్తాడు. విక్కీకి కరుబోతే పద్మావతి దగ్గరుండి మంచినీళ్లు పడుతుంది వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఎంత ప్రేమ పద్మావతికి విక్కీ మీద అని అనుకుంటారు.

పద్మావతి అల్లరి..
విక్కీ తెల్లవారి చూసేసరికి పద్మావతి విక్కీ పక్కన పడుకొని ఉంటుంది. ఇదేంటి పద్మావతి నా పక్కన పడుకుంది అని పద్మావతిని లేపుతాడు. ఎంత ప్రయత్నించినా పద్మావతి లేవదు దానికి విక్కీ పద్మావతిని గట్టిగా పక్కకి తోసేస్తాడు. వెంటనే పద్మావతి మంచం మీద నుంచి కింద పడుతుంది. ఏంటి సారు మీ సొమ్మేమైనా పోయిందా మంచం మీదే కదా నేను పడుకుంది కాసేపు నిద్రపోనివ్వరా అని అంటుంది పద్మావతి. ఏంటి నిద్రపోయేది అసలు నీకు కింద పడుకోమని చెప్తే మంచం మీదకి ఎందుకు వచ్చావు అయినా నా పక్కన పడుకోవడానికి నువ్వు ఎవరు అని అడుగుతాడు. పద్మావతి నాకు బల్లంటే చాలా భయం రాత్రి ఏం జరిగిందో తెలుసా అని విక్కీకి జరిగింది చెప్తుంది రాత్రి నేను రోజు లాగానే కింద పడుకుంటూ ఉంటే బల్లి వచ్చింది నాకు బల్లన్న బొద్దింకన్నా చాలా భయం. అందుకనే ఏం చేయాలో తెలీక మీ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా అని పడుకున్నాను నిద్రలో తెలియక మీ పక్కకు వచ్చి ఉంటాను దానికి ఎందుకు ఇంతలా అరుస్తారు అని అంటుంది. సెటప్ పద్మావతి నీకు ఎన్ని సార్లు చెప్పాను నా దగ్గరలోకి నువ్వు రావద్దు అని అంటాడు విక్కీ వెంటనే పద్మావతి అయితే ఇక్కడ ఇంకో మంచం వేయించమని చెప్పండి నేను కింద పడుకుంటే బల్లితో ఇబ్బంది లేకుండా ఉంటుంది మిమ్మల్ని ఎవరు డిస్ట్రబ్ చేయకుండా ఉంటారు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు రెండు మంచాలు ఏస్తే ఇంట్లో అందరికీ మన మధ్య గొడవ జరుగుతుందని తెలిసిపోతుంది అందుకని బయట మనం భార్యాభర్తలా నటించాల్సిందే లోపల గదిలో ఏదైనా నువ్వు వేరు నేను వేరు అది మాత్రం గుర్తు పెట్టుకొని మసులుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పద్మావతి శ్రీనివాసా ఈ టెంపరోడు ఎప్పటికీ మారతాడు అని అనుకుంటుంది.
Krishna Mukunda Murari: కృష్ణ కి నిజం చెప్పిన మధు.. బోల్తా పడ్డ ముకుంద..

అను ఆర్యాల ప్రేమ..
ఎప్పట్లాగానే మన ఆర్య బాబు అనుని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు. అను తెల్లవారింది ఇంక లేవండి ఈరోజు కృష్ణాష్టమి అని అంటుంది. అయితే ఏం పర్వాలేదు లేను కాసేపు నన్ను పడుకోనివ్వు అని అంటాడు లేదు మీరు లేవాల్సిందే అంటుంది అను. దానికి ఆర్య సరే నేను లేస్తాను ముందు నా మామూలు ఇచ్చేసేయ్ అని అంటాడు. ఆ చిన్ని కృష్ణుడు ఎలా అల్లరి చేస్తారో మీరు కూడా అల్లరి అలానే చేస్తారండి అని ఆర్య కి ముద్దు పెడుతుంది. ఎప్పటికీ మన మధ్య ప్రేమ ఇలానే ఉండాలని అంటుంది నేనెప్పటికీ నిన్ను ఇలానే ప్రేమిస్తాను అని అంటాడు ఆర్య. సరే మీరు లేచి రెడీ అయ్యి కిందకి రమ్మని చెప్పి అను కిందకి వెళ్తుంది.

కృష్ణాష్టమి ఏర్పాట్లు..
పద్మావతి కృష్ణాష్టమి కోసం కృష్ణుడి పాదాలని ముగ్గుగా వేస్తూ ఉంటుంది. అప్పుడే అట్నుంచి విక్కీ ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వస్తూ ఆ పాదాల్ని పద్మావతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పద్మావతి చూడ్డానికి చాలా అందంగా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు రెడీ అయ్యి రాధాకృష్ణుల వేషాలతో అక్కడికి పిల్లలు వస్తారు. వారు పద్మావతిని చూసి విక్కీని పిలిచి పద్మావతి వికీ చేతులని కలిపి మీరు ఎప్పుడూ రాధాకృష్ణుల్లాగా కలిసే ఉండాలి అని అంటాడు. ఆ చిన్న పిల్లవాడు చెప్పిన మాటలకి పద్మావతి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మీ ప్రేమ కూడా మా ప్రేమ లాగే ఎప్పుడూ ఇట్లానే ఉండాలి అని అంటుంది రాదా, విక్కీ పద్మావతి లను కూర్చోమని చెప్పి,కృష్ణుడి వేషం లో ఉన్న బాబు నా పుట్టినరోజు కదా ఈరోజు నువ్వు నాకు గిఫ్ట్ గా ఏదైనా ఇవ్వాలి విక్కీ అని అంటాడు. చెప్పు నీకేం కావాలన్నా ఇస్తాను అంటాడు విక్కి అయితే నాకు ఒక ముద్దు పెట్టు అని అంటాడు. విక్కీ ఆ బాబు కి ముద్దు పెడుతూ ఉంటే బాబు తప్పించుకొని పద్మావతికి ముద్దు పెట్టేలా చేస్తాడు. దానికి పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్కీ మాత్రం ఆశ్చర్యపోతాడు. వెంటనే ఇద్దరు పైకి లేస్తారు పద్మావతి సిగ్గుపడుతుంటే విక్కీ సిగ్గు పడింది చాలు ఆపు చూడలేకపోతున్నా నేను అని అంటాడు. కింద ఉన్న పిల్లలకి కెరింతలు కొడుతూ బలే బలే అని పద్మావతి విక్కి ల చుట్టూ తిరుగుతూ ఉంటారు విక్కీ ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు.
రేపటి ఎపిసోడ్ లో పద్మావతిని పూజలో అపాయం తలపెట్టాలని కృష్ణాపన్నాగం పన్నుతాడు. పద్మావతి పూజ చేసే పూలల్లో తేలు తీసుకొచ్చి ఉంచుతాడు. పద్మావతి చూసుకోకుండా పూలు వేస్తూ ఉంటుంది అప్పుడే అది గమనించిన నారాయణ తేలు పద్మావతి అని అరుస్తాడు. వెంటనే విక్కీకి తేలు కుడుతుందేమోనని పద్మావతి చేయటం పెడుతుంది పద్మావతికి తెలు కుడుతుంది. వెంటనే పద్మావతి నొప్పి అని కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి ఇంట్లో అందరూ కంగారు పడతాడు కృష్ణ మాత్రం నేను అనుకున్నది జరిగింది అన్నట్లుగా నవ్వుతాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో..