NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Lal Salaam OTT Release: లాల్ సలాం ఓటీటీ రిలీజ్ పై మార్పులు.. చేర్పులు.. ప్లాట్ ఫారం చేంజ్..!

Lal Salaam OTT Release: సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలామ్ భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను అందుకోలేకపోయినా సంగతి తెలిసిందే. దీంతో పెద్దగా వసూళ్లను సైతం రాబట్ట లేకపోయింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీని థియేటర్లో చూడని వారు ఇప్పుడు ఓటీటీలోకి వస్తుందని తెలిసి ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. అయితే అది మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. వారు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు థియేటర్లో పెద్దగా అందుకోలేకపోయారు. కనీసం ఓటిటి ప్రేక్షకులైన ఈ మూవీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి అంచనాలు చాలాసార్లు వచ్చాయి.

Lal Salaam OTT Release updates
Lal Salaam OTT Release updates

తొలుత ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. మార్చ్ 9న నెట్ఫ్లిక్స్ ఓటిటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ రోజున ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాలేదు. మార్చ్ 21న ఈ మూవీ ఓటిటికి వస్తుందని మరోసారి బజ్ వినిపించింది. ఇక అప్పుడు కూడా ప్రేక్షకులకి నిరాసే మిగిలింది. అయితే తాజాగా ఈ మూవీస్ స్ట్రీమింగ్ పై ఓ సమాచారం బయటికి వచ్చింది. లాల్ సలాం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ ప్లాట్ఫారం కు మారినట్లు సమాచారం వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 12వ తేదీన సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ఏదైనా ఫిక్స్ అవుతుందో లేదా మళ్లీ ఏదైనా కొత్త ట్విస్ట్ ఇస్తారు చూడాలి. ఈ మూవీ లో విష్ణు విశాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఇక చాలాకాలం విరార్మం అనంతరం మళ్లీ ఈ సినిమాతో దర్శకరాలిగా రీ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. అయితే ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కొంత ఫుటేజ్ మిస్ అవ్వడం మరియు కథలో మార్పులు చేయడం వల్ల మూవీపై ప్రభావం పడిందని కొన్ని ఇంటర్వ్యూలలో ఐశ్వర్య ఇప్పటికే తెలియజేసింది.

Lal Salaam OTT Release updates
Lal Salaam OTT Release updates

మొత్తంగా అయితే జైలర్ లాంటి బ్లాక్బస్టర్ తో ఉన్న రజినీకాంత్ ఖాతాలో ఒక ఫ్లాప్ ని వేసింది ఐశ్వర్య. లాల్ సలాం మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లివింగ్ స్టన్, సెంథిల్, విగ్నేష్, జీవిత రాజశేఖర్ వంటి వారు ఈ సినిమాలో కీలకపాత్రను వహించారు. ఇక ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. ఇక ఓవరాల్ గా కలెక్షన్స్ను చూసుకుంటే ఈ మూవీ 40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో సైతం రిలీజ్ అయింది. తెలుగులో కూడా డిజాస్టర్ గానే మిగిలింది. మరి ఓటిటిలో ఏమైనా మంచి టాక్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella