Premalu Telugu OTT Release: 2024లో మలయాళ మూవీస్ భారీ విజయాలను సాధించాయి. అలా మలయాళం లో ఈ ఏడాది రిలీజ్ అయ్యి రూ. 135 కోట్లు వసూళ్లు చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు. ఈ మూవీ ఓటిటి రాక కోసం ఎందరో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మార్చ్ 29న ఈ మూవీ ఓటిటిలోకి వస్తుందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడేమో ఏప్రిల్ 12 న రానుంది అంటూ సమాచారం అందుతుంది. ఇక తాజాగా తెలుగు వర్షన్ ఓటీటీ రిలీజ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రేమలు మూవీ హక్కులను డిజిని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుందని అందులోనే మూడు భాషల్లోనూ మూవీ రాబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే థియేటర్లో మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్న ఈ మూవీ మార్చ్ 29న ఓటిటి రిలీజ్ నుంచి వాయిదా పడింది. ఏప్రియల్ 12వ తారీకున రిలీజ్ అవుతుందని అధికారికా ప్రకటన కూడా జరిగింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ మాత్రం హాట్ స్టార్ లో కాకుండా ఆహా ఓటీడీలో రాబోతుందని తాజా సమాచారం. ఈ మూవీ హక్కులను ఆహా సొంతం చేసుకుందంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి అన్ని భాషల హక్కులు హాట్స్టార్ చేతికే చిట్కాయని అనుకున్నా.. చివరి నిమిషంలో తెలుగు భాషను ఆహా వారు సొంతం చేసుకున్నారట. కేవలం నిమిషంలో సీన్లోకి ఎంటర్ అయ్యి నిర్మాత అల్లు అరవింద్ మూవీని తమ ఆహా వైపుకి మళ్లించుకున్నాడు. దీనికోసం భారీ మొత్తంలో డబ్బును సైతం పోసాడట.
ఫిబ్రవరి 9న మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. మూవీ సూపర్ హిట్ కావడంతో మార్చ్ 8న తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో సైతం మంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా మంచి వసూళ్లను సైతం రాబడుతుంది. ఈమధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ కోసం ఆహా ఓటిటి భారీగానే ఖర్చు పెట్టింది. ఇక ఇప్పుడు సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాని కొనుగోలు చేసి తమ ప్లాట్ఫారం మరింత ముందుకి కొనసాగించాలనే రీతిలో ఈ పని చేసినట్లు తెలుస్తుంది.
ఈ మూవీ తెలుగు వర్షన్ ఏప్రియల్ 12వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్లో రూ. 15 కోట్లు వసూలు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ మలియాల్ డబ్బింగ్ మూవీ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీ కి తెలుగులో 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య రాసిన డైలాగులు కడుపుబ్బ నవ్వించాయి. ఇక ఈ సినిమాపై నాగచైతన్య, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ తోనే కార్తికేయ ప్రొడక్షన్ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించాడు. మరి ఈ మూవీ ఏ ప్లాట్ ఫారం లో రిలీజ్ అవుతుందో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.