OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ గురువారం అనగా మే తొమ్మిదవ తారీఖున అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై క్లారిటీ లేకపోయినా సడన్గా వచ్చేసి సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఫఫా ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ ఆవేశం. ఈ ఏడాది 100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన నాలుగో మలయాళం మూవీ గా ఈ సినిమా నిలిచింది. ప్రముఖ నటుడు ఫహిద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
కేరళలోని థియేటర్లలో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయినా మూవీ ఓటిటి లోకి వచ్చేసింది. గురువారం అనగా మే 9 నుంచి ఆవేశం మూవీ ప్రాయం వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం మలియాల్ వెర్షన్ మాత్రం అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ జోనర్ మూవీని థియేటర్లలో ప్రేక్షకులు బాగా ఆదరించారు. గ్యాంగ్ స్టార్ రాంగా అనే పాత్రలో ఈ స్టార్ హీరో నటనకు ఫిదా అయ్యారు. క్లైమాక్స్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఈ ఫన్నీ గ్యాంగ్ స్టార్ ను చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఆవేశం చిత్రం ఓటిటిలోకి వచ్చేయడంతో పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఫహిద్ రంగా పాత్రలో జీవించాడని ఒకరు ఈ సినిమాలో అసలు ఏముంది.. ఎందుకింత హైట్ ఇచ్చారని మరొకరు... ఈ గ్యాంగ్ స్టార్ ఇలా కామెడీ చేయడం చూడలేనని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. రూ. 30 కోట్లతో ఈ ఆవేశం మూవీ రూపొందింది. కానీ ఇప్పటికే థియేటర్లలో దాదాపు 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇదే కాకుండా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 35 కోట్లు చెల్లించింది. దీంతో మేకర్స్ పై లాభాల వర్షం కురిచింది. ఆవేశం మూవీ ఈ స్టార్ హీరో కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ సృష్టించింది కూడా.
అంతేకాకుండా మంజుమ్మల్ బాయ్స్, 2018, పులి మురుగన్, ది గోట్ లైఫ్ తరువాత రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన ఐదో మలయాళ సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమాలో ఫహిద్ నటనే ప్రాధాన బలంగా కనిపిస్తుంది. అయితే ఈమధ్య కాలంలో ఇతర భాషల ప్రేక్షకులు కూడా మాలయ సినిమాలను ఆదరించడం మొదలుపెట్టారు. మలియాల్ సినిమాలను ఆదరిస్తూ ప్రైమ్ వీడియోలో సబ్ టైటిల్స్ తోను ఈ సినిమాలను వీక్షిస్తున్నారు. ఏప్రిల్ 11న రిలీజ్ అయి సంచలనం సృష్టించి విజయం సాధించిన ఆవేశం మూవీ నెలలోపే ఓటీటీలోకి రావడం ఆశ్చర్యం. ఇక ఈ మూవీ ఓ టి టి లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.