Paluke Bangaramayenaa: కీర్తి వెన్నపూస తెచ్చి చేతికి రాస్తూ ఉంటుంది. ఈ బాధ కన్నా వీళ్లు చూపించే ప్రేమే తట్టుకోలేకపోతున్నాను అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే, వైజయంతి సుగుణలాగా మారిపోయి కట్టుబొట్టు మార్చేస్తుంది. ఈ అవతారం చూసి స్వర నన్ను నమ్ముతుందంటావా ఆర్యా ఎలాగూ నమ్మట్లేదు నాయుడు బావని ఎలాగూ నమ్మించే అవసరం లేదు ఎలా దాని నమ్మించగలనని అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నీలకంఠం వస్తాడు. ఈ పోలీసు కుక్కని నమ్మించగలిగితే వీడు తీసుకువెళ్లిస్ స్వర కు చెప్తాడు అప్పుడు నేను వెళ్ళిన స్వర నమ్మేస్తుంది అని ఆలోచించి ఏడవడం మొదలు పెడుతుంది.
ఏంటి మేడం మీరు ఏడుస్తున్నారా అసలు మీరేనా అని నీలకంఠం అంటాడు. అవును నీలకంఠం నేనే, నేను మారిపోయానని చెప్పిన ఎవరు నమ్మట్లేదు నాయుడు బావ మారిపోయినట్టు నేను కూడా మారిపోయాను అది చెప్తే ఎవరూ నమ్మట్లేదు ఎలా నీలకంఠం అందరినీ నమ్మించేది స్వరని తలుచుకుంటే గుండె చెరువైపోతుంది పాపం అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో చిన్నప్పటినుంచి నేను నాయుడు బావ దరిద్రపు దానివి నువ్వు నష్ట జాతకురాలు అని తిట్టే వాళ్ళం ఇప్పుడు నేను మారిపోయే సొంత కూతుర్ల చూసుకుంటానన్నా నన్ను నమ్మదు స్వర ఏం చేయాలి నీలకంఠం అని ముసలి కన్నీళ్లు పెట్టుకుంటుంది వైజయంతి.
ఎవరి దాకా ఎందుకు అమ్మ నేనే నమ్మలేకపోతున్నాను అసలు ఈవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాదు నమ్మినట్టు నటించాలి అని నీలకంఠం అనుకుంటాడు. మేడం మీరు స్వరమ్మ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేడం పాపం స్వరమ్మా తండ్రి ప్రేమకు నోచుకోలేదు కనీసం మీరేనా తల్లిలా చూసుకోండమ్మా అని నీలకంఠం అంటాడు. అప్పుడంటే ఏదో తల పొగరుగా అలా చేశాను నీలకంఠం కానీ ఇప్పుడు మారిపోయాను స్వరం వస్తే బంగారంగా చూసుకుంటాను కానీ తను రాదు అని వైజయంతి అంటుంది. మీరు అంతలా మారిపోయి ప్రేమగా పిలిస్తే ఎందుకురా దమ్మ తప్పకుండా వస్తుంది అని నీలకంఠం కన్నీళ్లు పెట్టుకొని వెళ్లిపోతాడు.
ఈ నీలకంఠం నమ్మేశాడు అంటే ఎప్పుడూ ఒకప్పుడు స్వర నమ్మేస్తుంది అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, అభి సార్ కాఫీ తాగండి ఉఫ్ ఉఫ్ అనుకోడానికి శ్వాస కూడా తెచ్చాను అని స్వర అంటుంది. అసలు నీకు సిగ్గు అనేది లేదా ఒక మనిషి మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మనల్ని చూడడానికి ఇష్టపడడం లేదు అసహ్యించుకుంటున్నాడు ఎందుకు వాళ్లతో మాట్లాడడం అని నీకు అసలు అనిపించదా ఎందుకు నన్ను ఇంతలా వేదిస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు. అభి సార్ బాధ అనిపిస్తుంది కానీ చిరాకు పడుతున్న కోపం తెచ్చుకొని తిడుతున్న సరే పదేపదే ఆ మనిషి తన ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటుంది అంటే ఆ వ్యక్తి మీద గౌరవం ఉందని అర్థం కాదా సార్ అని స్వర అంటుంది. నీ గౌరవం నీ అభిమానం నాకు అక్కర్లేదు నువ్వు ఉప్ ఊదు కోడానికి సాస్ తెచ్చిన కాపీ కూడా నాకు అక్కర్లేదు సపోజ్ మన గురించి అనుకుందాం నువ్వు నేను లవర్స్ కాదు భార్యాభర్తలమంతకంటే కాదు బంధం తెంచుకుంటే తెగిపోతుంది అని అభిషేక్ అంటాడు.
సార్ మీరు అన్నట్టు మనం లవర్స్ కాదు భార్యాభర్తలు అంతకంటే కాదు కాబట్టి కదా నేను మిమ్మల్ని ఇలా చూడకూడదని ఫ్రెండులా చూస్తున్నాను మీరు మళ్లీ మామూలు మనిషిలా కావాలి సార్ అందుకే మిమ్మల్ని కష్టపెట్టిన సరే పదే పదే బ్రతిమలాడుతున్నాను అని స్వర అంటుంది. అభిషేకం ఒక బొమ్మ తెచ్చి పగలగొట్టి ఆ బొమ్మను అతికించగలవా నా మనసు కూడా అంతే అని అంటాడు.ఆ బొమ్మని ఇంతకు ముందు ఉన్న లాగా అతికించలేను కానీ చాలా బాగా అతికించగలను సార్ అలాగే మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను అని స్వర ఆ బొమ్మ ముక్కలని ఏరుకుంటుంది. కట్ చేస్తే, ఏంటి కీర్తి అంత ఉత్సాహంగా కనబడుతున్నావ్ అని వాళ్ల బామ్మ అంటుంది. ఉత్సాహంగా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలా బామ్మ అని కీర్తి అంటుంది. ఏమీ లేదు ఈమధ్య పాటలు కూడా ఎక్కువ పడుతున్నావు అని వాళ్ళ బామ్మ అంటుంది.
అవును బామ్మ చాలా బాగా పాడుతున్నాను అని కీర్తి అంటుంది. మాటలు నేర్చిన చిలకా రామ అంటే రాను అన్నదంట అలా ఉంది నీ సామెత కానీ స్వర ఇక్కడే అని అడుగుతుంది బామ్మ. ఏమో బామ్మ నాకు తెలియదు ఇల్లంతా వెతికాను కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇందాకే అన్నయ్య స్వర మీద కోప్పడడం చూశాను అని కీర్తి అంటుంది. అవునా ఎక్కడికి వెళ్లిందో పాపం బిడ్డ అని యశోద వెతుకుదాం పద అని అంటుంది వాళ్ళ అత్తయ్య. అత్తయ్య మీరు పెరట్లో వెతకండి నేను బయట వెతుకుతాను అని యశోద అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది