NewsOrbit
Entertainment News Telugu TV Serials

 Paluke Bangaramayenaa January 12 2024 Episode 124: విశాల్ నుంచి తప్పించుకున్న స్వర, స్వరనీ కిడ్నాప్ చేయలేక అవమానపడ్డ విశాల్..

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

Paluke Bangaramayenaa January 12 2024 Episode 124: విశాల్ ఏం చేస్తావో ఏమో తెలియదు కానీ పగడ్బందీగా ప్లాన్ చెయ్ అని వైజయంతి అంటుంది.ఈ మాత్రం చాలా అత్తయ్య స్వరని తీసుకొచ్చేస్తాను అని విశాల్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే, అభిషేక్ ఝాన్సీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ధైర్యవంతుడు ఎప్పుడూ ఓటమి ఒప్పుకోడు తాడోపేడో తేల్చుకుంటాడు అని ఝాన్సీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కూరగాయలకు బయలుదేరుతూ అభిషేక్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్న సంగతి చూసి అభి సరేంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అనుకుంటుంది. స్వరను చూసిన అభిషేక్ కోపంగా బైక్ వేసుకుని బయటికి వెళ్లబోతుండగా సార్ బయటికి వెళ్తున్నారా నేను కూరగాయలకు వెళుతున్నాను డ్రాప్ చేయరా అని బైక్ ఎక్కికూర్చుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నువ్వు బండి దిగుతావా ఇలాగే సతాయిస్తావా అని అభిషేక్ కోపంగా అంటాడు. స్వర బండి దిగి మీరు జగ మొండిలా ఉన్నారు సార్ ఇలా అయితే కష్టం అని స్వర అంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకు నేను ఎప్పుడు ఎలా ఉంటానో అని అభిషేక్ బండి స్టార్ట్ చేస్తాడు కానీ బండి స్టార్ట్ అవ్వదు. సార్ బండి తోలడం వస్తే సరిపోదు లాక్ తీసి అప్పుడు స్టార్ట్ చేయాలి అని స్వర అంటుంది. నా బండి నా ఇష్టం లాక్ తీసి స్టార్ట్ చేస్తాను తీయకుండానే స్టార్ట్ చేస్తాను నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని అభిషేక్ అంటాడు. దింపుతాను ఉండు అంటారేమో అనుకున్నాను సార్ ఇదే గుర్తుపెట్టుకోండి ఒక ఆడపిల్లను దింపడానికి ఆలోచిస్తున్నారు కదా ఏదో ఒక రోజు మీ బైక్ మీద నన్ను కూర్చోబెట్టుకొని  సిటీ అంత తిప్పుతారు అని స్వర అంటుంది. నా జీవితంలో ఎప్పుడూ నా బండిమీద నిన్ను కూర్చోబెట్టుకోను అని అభిషేక్ వెళ్లిపోతాడు. మిమ్మల్ని గమనిస్తున్నాను సార్ మీలో కొంచెం కొంచెం మార్పు మొదలైంది అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే విశాల్ స్వరని పట్టుకున్నావా అని వైజయంతి అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

లేదు అత్తయ్య వెళ్తున్నాను అని విశాల్ అంటాడు. చూడు విశాల్ చందన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తనను బయటకు పంపించాకే మనకు ఫోన్ చేసి చెప్పింది ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని వైజయంతి అంటుంది. అలాగే అత్తయ్య అని విశాల్ అంటాడు. స్వర కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటుంది. విశాల్ ట్రాఫిక్ దగ్గర ఆగిపోతాడు.ఎన్ని రకాలుగా ఆలోచించిన ఆయన ఇప్పటి అంతలో మారేలా లేడు ఎప్పుడు మారతాడో ఏమో అని స్వర అనుకుంటూ వెళ్తుంది. అలా వస్తున్న స్వరనీ సిగ్నల్ దగ్గర ఆగిన విశాల్ చూస్తాడు. అలా వెళ్తున్న స్వర కూడా విశాల్ ని చూస్తుంది. విశాల్ స్వర అని పిలుస్తాడు. తను చూసి స్వర భయపడి పోయి పరుగెత్తుతుంది. విశాల్ కార్ దిగి స్వర వెనకాల పరిగెత్తుతాడు. స్వర అలా పరిగెత్తికెళ్ళి ఒక గేటు దగ్గర దాక్కుంటుంది. విశాల్ స్వర కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళిపోతాడు. విశాల్ ని తప్పించుకుని స్వర వెళ్ళిపోతుంది. స్వరా మిస్ అయిపోయింది అని విశాల్ టెన్షన్ పడతాడు.

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

కట్ చేస్తే,ఒక అమ్మాయిని పట్టుకోలేకపోయావ్ జనాలు అడ్డుపడ్డారు అని సాకులు చెప్తావా ఒక్క అవకాశం ఇవ్వండి పొడిచేస్తాను నరికేస్తాను అన్నావు ఏమైంది అని ఒట్టిమాటలేనా అని వైజయంతి అంటుంది. స్వరని పట్టుకోడానికి ట్రై చేశానని చెప్తున్నాడు కదా అమ్మ అవకాశం ఉంటే తను మాత్రం ఎందుకు వదిలేస్తాడు అని రంగరాజు అంటాడు. ఇప్పుడు చేసింది ఏంటి రంగరాజు గారు చూడండి నా ముందు ఎలా తల దించుకొని నిలబడ్డాడు అని వైజయంతి అంటుంది. పాపం ఫీల్ అవుతాడు అని రంగరాజు అంటాడు. ఒకటి కాదు రెండు కాదు రంగరాజు గారు చాలా అవకాశాలు ఇచ్చాను అంత రోషం ఉన్నవాడు పని చేసి చూపించాలి అని వైజయంతి అంటుంది. ఈరోజు కాపోతే రేపు పట్టుకుంటాడు అని రంగరాజు అంటాడు. అభి స్వరలు కలిసిపోయారంటే ఏం జరుగుతుందో మీకు ఇద్దరికీ తెలుసా అని వైజయంతి అంటుంది. కూల్ గా ఉండమ అన్ని అవే సర్దుకుంటాయి అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

లేదు రంగరాజు గారు కుక్కకు బిస్కెట్ వేస్తే చాలా విశ్వాసంగా ఉంటుంది కానీ కొంతమంది ఎందుకు ఉంటారు తెలియదు ఎంత చెప్పి చేయమన్న అర్థం కాక పని చేయలేక వెనక్కు వస్తారు ఇక నిన్ను నమ్ముకోవడం వేస్ట్ విశాల్ నిన్ను నమ్ముకునే బదులు ఏ చిల్లర రౌడీ ని నమ్ముకున్న దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చికొచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడు అని వైజయంతి అంటుంది. ఆ మాటతో కోపం వచ్చిన విశాల్  రంగరాజు గొంతు పట్టి నువ్వే కావాలని ఆవిడని ఇంకా రెచ్చగొడుతున్నావ్ అని అంటాడు. నేను ఆవిడను ఎందుకు రెచ్చగొడతాను బాబు అని రంగరాజు భయంతో అంటాడు. మిస్ అయిందని చాలా కోపం లో ఉన్నాను ఏం చేస్తానో నాకే తెలియదు మాటలు తూటాల బాధ పెడతాయి మాట జారదు కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని విశాల్ కోపంతో అంటాడు. నన్నంటే ఏమొస్తుందయ్యా అని రంగరాజు ఉంటాడు. మర్యాదగా మాట్లాడుకుంటే మంచిది వస్తాను అంటూ విశాల్ వెళ్ళిపోతాడు.రంగరాజు గారు ఇప్పుడు వాడు నీకు వార్నింగ్ ఇచ్చాడా నాకు వార్నింగ్ ఇచ్చాడా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 12 2024 Episode 124 Highlights

నీకు వార్నింగ్ ఇచ్చే అంత దమ్ము వాడికి ఎక్కడ దమ్మ నిన్ను ఏమీ అనలేక వాడి ప్రెస్ స్టేషన్ అంత నా మీద తీర్చుకున్నాడు అని రంగరాజు అంటాడు. అందుకే ఎవడికి పడితే వాడికి అల్లుసు ఇవ్వకూడదు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే కూరగాయలు తీసుకుని స్వర ఇంటికి వస్తుంది. విశాల్ నాకోసం ఇంకా వెతుకుతున్నాడా వాడితో జాగ్రత్తగా ఉండాలి అని స్వర అనుకుంటుంది. స్వరనీ ఈపాటికి విశాల్ ఎతుకొని వెళ్లి ఉంటాడు అని చందన అనుకుంటుంది. స్వరని పట్టించినందుకు ఆవిడ ఎంత డబ్బు ఇస్తుందో వేరే అడగాలా ఏంటి అని చందనం మురిసిపోతుంది. ఇంతలో స్వర ఇంట్లోకి రాగానే షాక్ అయిపోయిన చందన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అదేంటండి అలా అడిగారు అని స్వర అంటుంది. అదే కూరగాయలకు వెళ్లావు కదా ఇంత తొందరగా వచ్చావు ఏంటి అని చందన అంటుంది. మీరు చెప్పినవన్నీ తెచ్చానండి అని స్వర అంటుంది. అవన్నీ నేను అడిగానా అని చందనా కోపంగా అంటుంది. ఏమైంది చందన అలా అరుస్తున్నావ్ అని యశోద అంటుంది. చందన గారు కూరగాయలు తెమ్మన్నారు తెస్తే కోప్పడుతున్నారు అని స్వర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri