Paluke Bangaramayenaa: స్వర ఆఫీస్ కి వస్తుంది. ఝాన్సీ కేసు గురించి మాట్లాడుతుంది, స్వర కి ఒక అమ్మాయి ఫోటో ని చూపిస్తుంది. చాలా బాగుంది అని స్వర చెప్తుంది. తను విశ్వం బాబాయ్ వాళ్ళ కూతురు అని చెప్తుంది ఝాన్సీ. అయ్యో చాలా చిన్న అమ్మాయి లాగా ఉంది, వాడిని నమ్మి మోసపోయింది అని అంటుంది స్వర. ఇలాంటి వాళ్ళను వదలకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడు అమ్మాయిలను వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి అని ఝాన్సీ అంటుంది. సరే నేను వెళ్తాను అని విశ్వం అంటాడు. అతను వెళ్ళిపోయాక అభిషేక్ వస్తాడు, రండి ఎస్.ఐ. గారు కరెక్ట్ టైం కి వచ్చారు ఈ అమ్మాయి ఫోటో చూడు అని ఇస్తుంది, ఒక సైకో కేసు టేక్ అప్ చేశాను అని చెప్పను కదా అది ఈ అమ్మాయి గురించే అని ఝాన్సీ అంటుంది.

వాడి అడ్రస్ చెప్పు ఈడ్చుకుంటూ తీసుకొస్తాను అని అభి అంటాడు. మనకి సరైన ఆధారాలు లేవు, కూతురు చనిపోయిన బాధలో అంకుల్ అతనితో కలిసి ఉన్న ఫోటోలు కాల్చేశాడు అంట అని ఝాన్సీ చెప్తుంది. మనకు ఏమైనా చంటి అని పేరు మాత్రమే తెలుసు అని ఝాన్సీ అంటుంది. మిగితా వివరాలు సెర్చ్ చేస్తున్నం అంటుంది ఝాన్సీ. స్వర ఇందాక అమ్మ ఫోన్ చేసి, నువ్వు ఇంక నీకు కాబోయే వారి తో వచ్చావాట, చాలా మంచి అబ్బాయి లాగా ఉన్నాడని అమ్మ వాళ్ళు చెప్పారు అని అభి చెప్తాడు. అతను ఒక పెద్ద సైకో అని ఎలా చెప్పాలి, అతని గురించి అందరూ చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు, కానీ అతని గురించి నాకు మాత్రమే తెలుసు అని స్వర అనుకుంటుంది. ఝాన్సీ షాపింగ్ కి వెళ్దాం రావా అని అడుగుతాడు. నాకు చాలా వర్క్ ఉంది రాలేను అని ఝాన్సీ అంటుంది.

అభిషేక్ ఇంక స్వర షాపింగ్ కి వెళ్తారు.కట్ చేస్తే, ఏంటి అక్క ఈమధ్య చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావ్, ఎందుకు ఉండవు ఉంటావు కూతురికి పెళ్లి కుదిరింది, ఇంకేముంది మంచి రోజులు వచ్చేసినట్టే, బాగా మురిసిపోతూ ఆనందంగా ఉంటున్నావ్, కానీ నీ సంతోషం ఆవిరైపోయి నీకు చుట్టాలు అయినా కన్నీళ్లు త్వరగా వచ్చేస్తాయి అని నాయుడు వాళ్ళ బామ్మర్ది అంటాడు. ఈ విషయం మీ బావ కి చెప్పాను అనుకో నువ్వు జైల్లో ఉంటావు అని అంటుంది నాయుడు వాళ్ళ భార్య . నువ్వు చెప్పగానే మాట వినడానికి నువ్వేమన్నా వైజయంతి అక్క అనుకుంటునావ, ఒక దురదృష్టరాలుని కన్నా అమ్మవి, నీ కూతుర్ని కాపాడుకుంటావ్ అని చెప్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావ్, నీ కూతురు జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు ఇక నేనేం చేయలేను అని నాయుడు వాళ్ళ బామ్మర్ది అంటాడు. నాయుడు వాళ్ళ భార్య ఎక్కడినుండి వెళ్ళిపోతుంది.

కట్ చేస్తే,స్వర ఇంకాఅభిషేక్ కీర్తి షాపింగ్ కి వచ్చారు.నా డ్రెస్ సెలక్షన్ కు వచ్చినందుకు థాంక్యూ అని కీర్తి చెప్తుంది. సరే లోపలికి వెళ్లి షాపింగ్ చేద్దామా అని అంటాడు. అందరు లోపలికి వెళ్తారు.ఏంటి నువ్వు వాళ్ళని ఎలా భరిస్తున్నావో ఏమో నాకు తెలియదు కానీ ఆ నత్తి దాని ప్రేమ నేను భరించలేక పోతున్నాను అని నాయుడు అంటాడు. ఏం చేద్దాం బావ మనకు ఓట్లు పడాలంటే మనం భరించాల్సిందే అని సుగుణ అంటుంది. ఆ ఓట్ల కోసమే దాన్ని భరిస్తున్నాను లేకపోతే వాళ్ళను ఇంట్లో ఉంచుకునే వాడిని కాదు అని నాయుడు అంటాడు. ఇంతలో స్వర వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ మాటలు విని పూల కుండీ నీ కోపంతో ఎత్తేస్తాడు. ఏంట్రా అంత కోపంగా ఉన్నావు అని నాయుడు అంటాడు. ఈ ఇంట్లో ఉన్నది మనుషులా పశువుల ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని స్వర తమ్ముడు అంటాడు. నాన్నతో అలాగేన మాట్లాడేది అని సుగుణ అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే చేయి చేసుకోవాలని ఉంది కానీ మాటలతో సరిపెట్టాను అని స్వర తమ్ముడు అంటాడు. కట్ చేస్తే కీర్తి వాళ్ళ అన్నయ్య డ్రెస్ సెలెక్ట్ చేయమంటే ఏది బాగోలేదని అంటాడు.

ఆఫీసర్ రేట్లు చూసి నచ్చలేదని చెప్తున్నాడు మనం వెళ్లి కీర్తిని నచ్చ చెప్పాలి అని స్వర కీర్తి దగ్గరికి వెళుతుంది, కీర్తి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటావా డబ్బున్న వాళ్ళు చాలా సింపుల్ గా వేసుకుంటారు అని అంటుంది. అయితే అదే చూపించు అవే వేసుకుంటాను అని కీర్తి చెప్తుంది. ఇంతలో విశాల్ ఇంకా వాళ్ళ అమ్మ వస్తారు షాపింగ్ మాల్ కి, వాళ్ళమ్మ స్వరని చూసి స్వరలాగే ఉంది ఏంటి అని అంటుంది, స్వర లాగా కాదమ్మా స్వర అని విశాల్ అంటాడు. స్వర షాపింగ్ కి వచ్చిందా అని షాక్ అవుతాడు విశాల్.