NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 25 2023 Episode 1109: పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఛాయా జలంధరే అనే కనిపెట్టిన అను పిల్లల్ని కాపాడుకుంటుందా లేదా..

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

Prema Entha Madhuram November 25 2023 Episode 1109:  పిల్లల్ని ఎత్తుకెళ్లి రౌడీలు కార్లో కూర్చోబెడతారు. ఆర్య వాళ్ళ వెనకాల పరిగెత్తికెళ్ళి కొట్టి మరీ అభయ్ ని కాపాడుతాడు. అక్కి అంటూ అను పరిగెత్తుకొస్తుంది. రేయ్ ఎవర్రా మీరు పిల్లలు ఎందుకు ఎత్తుకెళ్తున్నారు అని ఆర్య వాళ్ళమ్మటి పడతాడు. అక్కిని కాపాడడానికి కారు వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు ఆర్య.  నా కూతుర్ని వదిలేయండి ఎవరికి ఏం పాపం చేశాం ఎవరు మీరు అని అను ఏడుస్తుంది. అను గారు మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య కాపాడుతాడు అక్కిని తీసుకొస్తాడండీ మీరేం భయపడకండి అని ఉష అంటుంది. అమ్మ ఎవరమ్మా వాళ్ళు చెల్లిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అభయ్ అంటాడు. ఆర్య పట్టు వదలని విక్రమార్కుడు లాగా వాళ్ళ కారు వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. చెల్లమ్మ అమ్మ నా ప్లాన్ సక్సెస్  అని జలంధర్ ఛాయా కి ఫోన్ చేసి చెప్తాడు.

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights
Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

అవునా అన్నయ్య ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశారా అని ఛాయా అంటుంది. అభయ్ని అయితే తీసుకు రాలేకపోయాను కానీ అమ్మాయి మాత్రం దొరికిపోయింది చెల్లెమ్మా అని జలంధర్ అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అను చేత సంతకం పెట్టించమని బెదిరియ్యనా అని ఛాయా అంటుంది. ఇప్పుడే వద్దమ్మా వాళ్ళ భయం బాగా పెరిగి పోయి వనికి పోతూ నా కూతుర్ని ఏమి చేయకు నీకేం కావాలి అని అడిగి అంతలా భయపెట్టాలి అప్పుడు ఆ పేపర్ మీద సంతకం పెట్టించుకోవాలి అని జలంధర్ అంటాడు. అను ఇన్ని రోజులు మమ్మల్ని బెదిరించావు కదా ఇప్పుడు నీ కూతురుని ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని ఛాయా అంటుంది. చూడండి సార్ ఆర్య గారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి అని మానస అంటుంది. పాప మన చేతిలో ఉండగా మనకేంటి అమ్మ భయం ఆర్య మనల్ని ఏమీ చేయలేడు అని జలంధర్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights
Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

కట్ చేస్తే, ఆర్య కారు వేసుకొని ఆ కారు వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు.జెoడి కి ఫోన్ చేసి స్కూల్లో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతూద్దేమోనని నేను పిల్లలకు వాచి గిఫ్ట్ గా ఇచ్చాను అందులో కెమెరాలు పెట్టాను వాటి సిగ్నల్ ప్రకారమే నేనిప్పుడు ఆ కారు ని ఫాలో అవుతున్నాను మనం పాపని ఎలాగైనా కాపాడాలి ఈలోపు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని ఎవరికి తెలియకుండా రమ్మని చెప్పు ఏమాత్రం  వాళ్ళకి డౌట్ వచ్చిన అక్కికి ప్రమాదం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అని ఆర్య అంటాడు. అలాగే సార్ నేను చూసుకుంటాను కానీ మీరు జాగ్రత్త  అని జెoడిఅంటాడు. కట్ చేస్తే, అక్కి అక్కి అని అను ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అను ఏడవకమ్మ పాపకి ఏమీ కాదు సూర్య కాపాడి తీసుకువస్తాడు నువ్వేం టెన్షన్ పడకు అమ్మ అని సుగుణ అంటుంది. ఆంటీ అక్కి లేకపోతే నేను ఉండలేను ఆంటీ నా పాప నాకు కావాలి అని అను ఏడుస్తుంది. ఈ పని ఎవరు చేసి ఉంటారు ఎందుకు చేసి ఉంటారు వాళ్లకి ఏం కావాలి అని సుగుణ అంటుంది. రాధ గారు ఇంతకుముందు ఒకసారి కిడ్నాప్ జరిగింది కదా అండి మీరు కొంచెం జాగ్రత్త పడితే బాగుండేది అని దివ్య అంటుంది. స్కూల్లో అంత మంది ఉండగా అలాంటివి జరుగుతాయని ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు అక్క ఒక్క నిమిషంలో అంతా గందరగోళం అయిపోయింది అక్కిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights
Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

గబగబా అను లోపలికి పరిగెత్తికెళ్ళి డోర్ పెట్టుకొని ఛాయా కి ఫోన్ చేసి నీకేం కావాలి నా కూతురుని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడుగుతుంది అను. ఏంటి మిస్సెస్ ఆర్య వర్ధన్ అను గారు మర్చిపోయి మాకు ఫోన్ చేశారా ఏంటి మీ పిల్లల్ని మేము ఎందుకు కిడ్నాప్ చేస్తాం నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఛాయా అంటుంది. మీరే కిడ్నాప్ చేశారని నాకు తెలుసు తను చిన్నపిల్ల తనకేం తెలియదు తనని తీసుకొచ్చి నాకు అప్పగించండి అని అను ఏడుస్తూ అంటుంది. ఏంటి అను నువ్వేనా ఏడ్చేది ఎంతో తల పొగరుగా మాట్లాడే నువ్వు బిడ్డ కోసం ఏడుస్తున్నావా అయినా మీ పాప మా దగ్గర ఎందుకు ఉంటుంది అను అని మానస అంటుంది. ఏంటి అను గారు పోలీస్ కంప్లైంట్  ఇస్తావా కంప్లైంట్ ఇచ్చి ఎవరో ఎత్తుకెళ్లారు అని చెప్తావా వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని ఛాయా అంటుంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో అను ఫోన్ కట్ చేస్తుంది. భార్యాభర్తలు ఒకే చోట చేరి మమ్మల్ని ఎంతలా ఏడిపించారు ఇప్పుడు మీరు ఏడవండి ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను అను నీ పిల్లని ఎలా కాపాడుకుంటావు అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, అను ఫోన్ కట్ చేసి వచ్చి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights
Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

అభయ్ అను దగ్గరికి వచ్చి అమ్మ ఎవరమ్మా వాళ్ళు చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశారా అమ్మ వాళ్లకి ఏం కావాలి నా దగ్గర ఉన్న డబ్బును అంత ఇచ్చేస్తాను చెల్లెలి విడిచి పెట్టమని చెప్పమ్మా అక్కి లేకపోతే నాకు ఏడుపొస్తుంది అమ్మ ఎలాగైనా ఆక్కీ నాకు కావాలమ్మా అని ఆభయ్ ఏడుస్తాడు. అభయ్ ఇటు రా నాన్న చెల్లెలికి ఏమీ కాదు మీ ఫ్రెండ్ వెళ్ళాడు కదా తీసుకువస్తాడు అని సుగుణ అంటుంది.ఉష బాబును తీసుకువెళ్లి పడుకోపెట్టు అని జ్యోతి అంటుంది. ఉష అభయ్ ని తీసుకొని పడుకోబెడుతుంది. అను పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అని సుగుణ అంటుంది. అమ్మ ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంట్లో శుభకార్యం జరగబోతుంది ఇప్పుడు పోలీసులు అంటే వాళ్ళు ఎంక్వయిరీ అని ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇదంతా అవసరమంటావా అని దివ్య అంటుంది. అది కాదు దివ్య అని సుగుణ చెప్పబోతుండగా ఇక నువ్వు ఆపమ్మ ఏమి చెప్పొద్దు నాకు అని దివ్య అంటుంది.ఇంతలో రౌడీ ఒక గిఫ్ట్ తెచ్చి అక్కడ పడేస్తాడు.

Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights
Prema Entha Madhuram Today Episode November 25 2023 Episode 1109 Highlights

అది చూసిన అను ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చేయి ఉంటుంది.ఆ చేయి ని చూసి అక్కిని చెయ్యి నరికేశారు అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది అను. కట్ చేస్తే,అంకుల్ నన్ను వదిలిపెట్టండి అంకుల్ నాకు భయమేస్తుంది అంకుల్ మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంకుల్ అని ఆకాంక్ష అంటుంది. నోరు ముయ్యి ఎక్కువగా మాట్లాడావు అనుకో చంపేస్తాను మా పని అయిపోగానే నిన్ను ఇంటి దగ్గర వదిలిపెడతామమ్మా నువ్వేం టెన్షన్ పడకు అని జలంధర్ అంటాడు. అంకుల్ నాకు చాలా భయం వేస్తుంది నేను ఇంటికి వెళ్తాను వదిలేయండి అంకుల్ అని ఆకాంక్ష అంటుంది. ఏడవద్దు అని చెప్పాను కదా మా పని పూర్తి అయిపోగానే ఇంటిదగ్గర వదిలిపెడతానని చెప్పాను కదా నువ్వు ఏడ్చావ్ అనుకో ఇప్పుడే సూట్ చేసి పాస్తాను అని జలంధర్ అంటాడు.కట్ చేస్తే అను అంతలా ఏడ్చేసరికి ఉషా లోపల నుంచి పరిగెత్తుకొచ్చి ఆ చేయి ని చూస్తుంది. అను గారు మీరు ఏడవకండి ఇది లబ్బర్ చెయ్యి చూడండి అని ఉష అంటుంది. అప్పుడు వాళ్ళకి కొద్దిగా ఊపిరి పీల్చుకున్న అంత పని అవుతుంది. ఇంతలో రౌడి వచ్చి అది శాంపిల్ మాత్రమే ఈ పేపర్ల మీద సంతకం పెట్టకపోతే ఆ ప్లేస్ లో నీ కూతురు చేయి నిజంగానే ఉంటుంది అని అంటాడు. బాగా ఆలోచించినా సుగుణ ఉష నువ్వు వెళ్లి పెను తీసుకురా అని అంటుంది సుగుణ.

సరే అని ఉషా పెన్ను తీసుకురావడానికి లోపలికి వెళుతుంది. అమ్మ కడుపు కట్టుకొని కాయకష్టం చేసి సంపాదించిన ఆస్తి అది ఎవరికో దానం చేస్తానంటే నేనొప్పుకోను అని దివ్య అంటుంది. దివ్య ఏం మాట్లాడుతున్నావ్ ఇప్పుడు పాప కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన వల్లే అనుకి వచ్చాయి అని సుగుణ అంటుంది. నువ్వేమైనా అను అమ్మ నాకు మాత్రం ఇష్టం లేదు అని దివ్య అంటుంది. అది అలాగే మొత్తుకుంటుంది అని సుగుణ పేపర్ల మీద సంతకం పెట్టబోతోంది. ఆంటీ వద్ద ఆంటీ సంతకం పెట్టక ఆంటీ అని అను అంటుంది ఇప్పుడు పాప కన్న నాకు ఏ ఆస్తి అక్కర్లేదమ్మా నువ్వు ఉండు అని సుగుణ అంటుంది. ఆంటీ సంతకం పెట్టొద్ద ఆంటీ అని ఆ పేపర్ ని తీసుకొని చింపి పాస్తుంది అను. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella