Prema Entha Madhuram October 23 Episode 1080: దివ్య అన్న అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా వెటకారం చేస్తూ మాట్లాడుతావేంటి అని వాళ్ళ అమ్మ అంటుంది. లేకపోతే ఏంటమ్మా నానా చాకిరి చేసి నన్ను 10 వరకు చదివించావు ఇక నువ్వు చదివించలేనని నేను చదువు మానేసి ఏదో ఒక బట్టల షాపులో సేల్స్ గర్ల్స్ గా పని చేస్తుంటే ఆఫీస్ కి వెళ్తున్నావా దివ్య అని వెటకారంగా నీ కొడుకు అడుగుతున్నాడు అని దివ్య అంటుంది. అమ్మ దివ్యని ఏమి అనకు అని సూర్య ప్లేస్ లో ఉన్న ఆర్య అంటాడు.

అయినా నువ్వే… వచ్చిన కానుంచి చూస్తున్నాను నువ్వు జ్యోతి ఇద్దరు కలిసి అన్నయ్యను అనరాని మాటలు అంటున్నారు వాడేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు వాడు సంపాదించక పోయినా పర్వాలేదు వాడు వచ్చాడు కదా అంతే చాలు ఇక మీదట అన్ని వాడే చూసుకుంటాడు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏమి అక్కర్లేదులే మేము ఇన్ని రోజులు ఎవరి తోడు లేకుండానే పెరిగాము పెద్దవాళ్లమయ్యాము ఇప్పుడు బస్సు దగ్గర తీసుకువచ్చి డ్రాప్ చేస్తావ్ తర్వాత ఖర్చులకోసం డబ్బులు అడుగుతావు దానికి బదులు నేను వెళ్లడమే మంచిది అనే దివ్య అంటుంది.

వాడు ఇంటికి వచ్చిన దగ్గరనుంచి చూస్తున్నాను నువ్వు జ్యోతక్క తిక్క తిక్కగా మాట్లాడుతున్నారంటే తలగాని తిరుగుతుందా అనయ్యా నిన్ను బస్సు దగ్గర దించుతానంటే వాడేదో డబ్బులు అడుగుతాడని అంటున్నావా వాడికి నీ డబ్బులు ఏం అవసరం లేదు నేనుండగా నిన్ను ఎందుకు చేయి చాచుతాడే వెళ్ళు నువ్వు ముందు ఇక్కడి నుంచి అని సుగుణ అంటుంది. నేను ఇంతకుముందు ఒంటరిగానే వెళ్లాను ఇప్పుడు ఒంటరిగానే వెళ్తాను తోడుగా అండగా మాకు నిలబడాల్సిన వాడివి చిన్నప్పుడే పారిపోయావు అప్పుడు ఒంటరిగానే పెరిగి పెద్దయ్యాం ఇప్పుడు ఒంటరిగానే వెళ్తాం నీ తోడేమి మాకు అక్కర్లేదు ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటావో ఎవరికి తెలుసు ఎప్పుడు పారిపోతావో ఎవడికి తెలుసు అందుకే మా కాళ్ళ మీద మేము నిలబడి ఒంటరిగా వెళ్లి పోవడమే మంచిది అని దివ్య అంటుంది. దివ్య నోరు ముయ్యవే అని వాళ్ళ అమ్మ కోపంగా అరుస్తుంది.

దివ్య నువ్వు వెల్లమ్మ అమ్మ అలాగే అంటుంది అమ్మ అన్నదని నువ్వేమీ బాధపడకు అమ్మకి నేను నచ్చ చెప్తాను నువ్వు వెళ్ళు అని ఆర్య అంటాడు. దివ్య వెళ్ళిపోగానే సూర్య దివ్య అన్నదని నువ్వు బాధపడకు నాన్న ఏదో తెలిసి తెలియని తనంతో అలా మాట్లాడింది ఇన్నాళ్లు అన్నయ్య అనే తోడు లేక వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు నాన్న అందుకే అలా మాట్లాడి ఉంటుంది నువ్వేం బాధపడకులే తనే మారుతుంది అనే వాళ్ళమ్మ అంటుంది. అమ్మ దివ్య అన్నదని నేను బాధపడట్లేదు అమ్మ వాళ్ల మనసు ఎంత గాయపడితే అన్నయ్యనయినా సరే అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళ బాధ వాళ్ళ కోపం నాకు అర్థం అవుతుందా అమ్మ తోడుగా ఉండాల్సినప్పుడు వదిలేసి పారిపోయాను ఇప్పుడు పెద్దయ్యాక తిరిగి వస్తే వాళ్లకు కోపం కాక ఇంకేముంటుంది అని ఆర్య అంటాడు. అన్నయ్య నువ్వు ఎంత మంచి వాడివి అన్నయ్య దివ్య అక్క అన్ని మాటలు అన్నా సరే తన గురించి మంచిగానే ఆలోచిస్తున్నావు నీలో నాకు అన్నయ్య కనపడట్లేదు నాన్న కనపడుతున్నాడు అన్నయ్య అనే ఉషా అంటుంది.

వాళ్లు ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా జెండి ఆర్య కి ఫోన్ చేస్తాడు. అమ్మ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను వెళ్లి వస్తాను అని ఆర్య అంటాడు. సూర్య నువ్వు బయటికి వెళ్తుంటే నాకు భయం వేస్తుంది నాన్న చిన్నప్పుడు పారిపోయింది గుర్తుకు వచ్చి గుండె తల్లడిల్లుతుంది నువ్వు మాకు ఎక్కడ దూరం అవుతావో ఏమో అని అనిపిస్తుంది రా ఆఫీస్ కి వెళ్లి త్వరగా వచ్చేయ్ నాన్న ఎవరు పిలిచినా వెళ్ళకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోకు ఒకరి దగ్గర చేయి చాచకూడదు మన కష్టార్జితం మిదనే మనం బ్రతకాలి అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నీకెందుకు భయం వేస్తుంది అని ఆర్య అంటాడు.

అన్నయ్య అమ్మ ఎందుకు భయపడుతుంది అంటే మనకు ఊరు చివరన 5 ఎకరాల పొలం ఉంది దాని పక్కనే 3 ఎకరాల స్థలం వేరే వాళ్ళు కబ్జా చేశారు దానితోపాటు ఈ 5 ఎకరాలు కూడా ఇవ్వమని అమ్మతో గొడవ చేస్తున్నారు కానీ అమ్మ నీకు మాత్రమే చెందాలని పట్టుబట్టి కూర్చుంది అందుకే వాళ్ళు ఏమైనా నిన్ను చేస్తారేమోనని అమ్మా భయపడుతుంది అని ఉష అంటుంది. అమ్మ అలాంటిదేమీ జరగదు నువ్వేమీ భయపడకు నేను వెళ్లి డ్యూటీ చేసుకుని తప్పకుండా తిరిగి వస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే ఆర్య కోసం జెండి కారు పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ఛాయా మానస జెండిని చూసి కార్ ఆపుతారు కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అసలు జెండా ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అని ఛాయా అంటుంది. ఇంతలో ఆటోలో నుంచి ఆర్య దిగుతాడు. ఆర్య ఏసుకున్న బట్టలను చూసి ఓ మై గాడ్ ఇతను ఆర్యాన ఏంటి ఆ బట్టలు ఈ అవతారం ఏం జరుగుతుంది ఇక్కడ జస్ట్ వెయిట్ అని పక్కనే ఉండి చూద్దాం అనే ఛాయా అంటుంది. ఆర్య ఆటోలో నుంచి దిగి కారులోకి వెళ్లి సూర్య వేసుకునే బట్టలు విప్పేసి తను వేసుకునే డ్రెస్సు వేసుకొని కారు దిగుతాడు. పక్కనే ఉండి చూసిన చాయా షాక్ అవుతుంది. ఆర్య సూర్య ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్లకి ఏం డౌట్ రాలేదు కదా అని జెండి అంటాడు. వాళ్లు బాగానే ఉన్నారు జెండి కానీ నాకే ఏదో గ్రీటి గా ఉంది ఆ అమ్మ ప్రేమ చెల్లెళ్ల ప్రేమ కోపం భయం ద్వేషం అన్ని సూర్యకి దక్కాల్సినవి అని ఆర్య అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..