Nindu Noorella Saavasam October 23 Episode 61: అమరేంద్ర తన దగ్గర ఉండే ఇంకో మిలిటరీ అతని పిలిచి రేపు పిక్నిక్ కి ఏర్పాట్లు చేయమన్నాను చేసావా అని అడుగుతాడు. ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి సార్ ఎన్ని గంటలకు బయలుదేరుతారో చెప్తే రెడీగా ఉంటాను అని ఆ వ్యక్తి అంటాడు. సార్ మీరెప్పుడు ఈ ట్రిప్ కి ప్లాన్ వేశారు అని రాథోడ్ అంటాడు. నేను నిన్ననే ఆలోచించి అతనికి చెప్పాను అని అమరేంద్ర అంటాడు. ఈ అమ్మాయి మీరు ఒకేలా ఆలోచించారేంటి సార్ అని రాథోడ్ అంటాడు. హమ్మయ్య డాడీ పిక్నిక్ కి తీసుకపోవడానికి ఒప్పుకున్నాడు అని పిల్లలు సంతోషిస్తారు. ఇదేంటి అమరేంద్ర ఇలా ఒప్పేసుకున్నాడు అని మనోహరి తనలో తను అనుకుంటుంది. కట్ చేస్తే భాగమతి బయటికి వచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది.

అక్కడే ఉన్న అరుంధతి భాగమతిని చూసి తను చూడాలని అటు ఇటు పూలు తెంపుతున్నట్టు నటిస్తుంది. కానీ భాగమతి చూసుకోకుండా వెళ్ళిపోతుంటే చెల్లి ఏంటి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని పిలుస్తుంది అరుంధతి. అయ్యో అక్క ఎప్పుడు వచ్చావ్ అని భాగమతి అంటుంది. మా ఇంట్లో పూజకు పూలు లేవని ఇక్కడికి వచ్చి పూలు తెపుతున్నాను చెల్లి ఏంటి పిక్నిక్ ట్రిప్ కి వెళ్తున్నారా అని అరుంధతి అంటుంది. అరుంధతినే గమనిస్తున్న గుప్తా గారు ఈ బాలిక మహానటి భలే యాక్టింగ్ చేస్తుంది అని గుప్తా అనుకుంటాడు. అవు నక్కా పిల్లలు బయటికి తీసుకు వెళ్తే కాస్త రిలీఫ్ అవుతారని నేను అనుకున్నాను కానీ సార్ కూడా నాకంటే ముందే ఆలోచించారట మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం ఏంటి అని అనుకుంటున్నాను అనే భాగమతి అంటుంది.

అవును చెల్లి మీకు ఇద్దరికీ ఒకే ఆలోచన ఎలా వచ్చింది వస్తే వచ్చిందిలే పిల్లలైతే బయటికి తీసుకెళ్తున్నారు కదా మరి మీ సార్ కూడా వస్తాడ అని అరుంధతి అంటుంది. పిల్లలు వెళ్తున్నప్పుడు ఆయన కూడా వస్తారు కదా అక్క అని భాగమతి అంటుంది. ఆయన వస్తే ఈవిడను చూసేస్తాడు కదా అని గుప్తా అంటాడు. ఏంటి అనే భాగమతి గుప్తా అని అడుగుతుంది. ఏమీ లేదు చెల్లి మీ సార్ వస్తే మరి డ్యూటీకి ఎలా అని అరుంధతి కవర్ చేస్తుంది. సరేలే అక్క మా ఇంట్లో వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తాను రా అని భాగమతి అంటుంది. అమ్మో ఇప్పుడు పరిచయాలు ఎందుకు చెల్లి అసలే మీ సార్ కోపిష్టి అని విన్నాను ఇంకెప్పుడైనా పరిచయం చేదువులే అని అరుంధతి తప్పించుకుంటుంది. సరే అక్క నాకు పని ఉంది వెళ్లి వస్తాను అని భాగమతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అక్క నువ్వన్నట్టే మిస్సమ్మ మనకి చాలా హెల్ప్ చేస్తుంది తనకి థాంక్స్ చెప్పాల్సిందే అని అమృత వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు. అవునా అక్క మిస్సమ్మ చాలా మంచిదిలా అనిపిస్తుంది తనతో మాట్లాడాలి తనకు సారీ చెప్పాలి అని ఆకాష్ అంటాడు. అవును తమ్ముడు నేను చెప్పాను కదా మిస్సమ్మ చాలా మంచిది లా ఉంది మనకి హెల్ప్ చేస్తుందని చూడండి ఈరోజు డాడీ ని బలేగా ఒప్పించి మనల్ని పిక్నిక్ తీసుకెళ్లేలా చేసింది అని అమృతం ఉంటుంది. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కన ఉన్న అంజు సరే అయితే నేను డాడీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాను డాడీ నాకు వేరే రూమ్ కావాలని అడుగుతాను అని అంజు అంటుంది.

ఎందుకు వెళ్తున్నావ్ అంజు డాడీ ని ఇప్పుడు వేరే రూము అడగాల్సిన అవసరమేముంది నీకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదా అయితే నేను కింద పడుకుంటానులే అని ఆకాష్ అంటాడు. అందుకే దేవుడిచ్చిన బుర్రని వాడమనేది నేను వేరే రూమ్ కావాలంటున్నది సరిపోక కాదు మీరు ఆ మిస్సమ్మ కి థాంక్స్ చెప్పాలి చాలా మంచిది మెచ్చుకోవాలి అని అంటున్నారు కదా అందుకు ఆ మిస్సమ్మ మనల్ని మంచిగా చేసుకొని ఈ ఇంట్లో ఉండి పోవాలని తను ఆలోచించి ఇలా చేస్తుంది మీరు మాత్రం ఈ విషయం అర్థం చేసుకోవట్లేదు తనకు అవసరం కాబట్టి మనకు అనుగుణంగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది అంతేకానీ అoత మంచిది కాదు అని అంజు అంటుంది. మా ముగ్గురికి మిస్సమద ని అనిపిస్తుంటే నీకెందుకే చెడ్డదిలా అనిపిస్తుంది అని అమృత అంటుంది. అయినా మీతో నాకెందుకు నేను వెళ్లి డాడీని వేరే రూమ్ అడుగుతాను అని అంజు వెళ్ళిపోతూ ఉండగా ఆగవే పొట్టి దాన సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు అని అమృతం ఉంటుంది.మీరు నాకన్నా పెద్దవాళ్లే పుట్టిన బుర్రలు మాత్రమే ఎదగలేదు ఏం చేస్తాం నా మీదే ఆధారపడుతున్నారు అని అంజు అంటుంది. ఏంటి అని ముగ్గురు ఒకసారి తన వంక గట్టిగా చూస్తారు. ఓ సారీ సారీ మన గోడలు పక్కన పెట్టి ఆ మిస్సమ్మ సంగతి చూసుకుందాం అని అజు అంటుంది.
సరే నువ్వేమీ డాడి దగ్గరికి వెళ్లక్కర్లేదు నువ్వు చెప్పినట్టే వింటాం అని అమృత ఆకాష్ అంటాడు. కట్ చేస్తే నీళ్లు కాళ్లు ఒత్తుతూ ఉండగా యాపిల్ పట్టుకుని పిండిలా నలిపేస్తుంది మనోహరి. అమ్మగారు అదే మన పిండి అనుకుంటున్నారా ఆపిల్ ముక్కలమ్మ అలా నలిపేస్తున్నారు ఏంటి అని నీళ్లు అంటుంది. నాకు తెలిసే నీలు కానీ అమరేంద్ర ఆ మిస్సమ్మ ఒకేలా ఎలా ఆలోచిస్తున్నారే నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న అమరేంద్రని మచిక చేసుకోలేకపోతున్నాను ప్రాణాలకు తెగించి వాళ్ళందరిని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటే ఈ మిస్సమ్మ ఒకే ఒక మాటతో తన వైపు అందరినీ తిప్పుకుంటుంది దాని మాటల్లో ఏం మాయ ఉందే అలా ఆకర్షించేస్తుంది అని మనోహరి అంటుంది.

ఏమోనమ్మా ఆ అమ్మాయి మాట అందరికీ నచ్చుతుంది తను ఏం చేసినా అలా ఎందుకు చేసావు అని ఎవరు అడగట్లేదు తను చేసిందే కరెక్టు అనే అంటున్నారు ఏదో ఒకటి చేయాలి అమ్మ మీరే అని నీళ్ళు అంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్ష ఫలిస్తుంది అనుకుంటే ఈ మిస్సమ్మ నాకు అడ్డం వస్తుంది పిల్లల్ని పిక్నిక్ పంపించి అమరేంద్ర తో టైం స్పెండ్ చేసి తనతో ప్రేమగా ఉండి అతని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది ఎలాగైనా సరే పూజారి చెప్పిన ఆ పెళ్లి ఘడియలు అమరేంద్ర తో నాకే పెళ్లి జరగాలి తను నాకు అడ్డం వస్తే ఏం చేస్తానో చూడు అని మనోహరి అంటుంది. ఏం చేసినా ఇంకా మూడు రోజులోనే చేయాలి ఎలాగో ఒకరోజు గడిచిపోయింది రేపు పిక్నిక్ లోనే టైం అంతా గడిచిపోతుంది ఇంకా మిగిలింది అంతా ఒకటే రోజు కదా అప్పుడు ఏం చేస్తారు అని నిళ్ళు అంటుంది.

ఆ పిక్నిక్ లోనే తనకు భయమంటే ఏంటో చూపెడతానే భయపడి తనంతట తానే పారిపోయేలా చేస్తాను దానికి బ్రతుకు మీద భయం వేసేలా చేస్తాను క్షణక్షణం నరకం అంటే ఏంటో చూపెడతాను అది రేపు పిక్ నీకు అయిపోయేలోపు పారిపోవాలి లేదని మళ్ళీ ఇంటికి వస్తే తనను నిజంగా చంపెయినాపైన సరే అమరేంద్ర ని నేను పెళ్లి చేసుకుంటాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే భాగమతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న ఎలా ఉన్నావు అని అంటుంది.భాగమతి ఎప్పుడొచ్చావ్ అమ్మ ఎలా ఉన్నావ్ నీకు కొత్త ఉద్యోగం దొరికిందట కదా కొత్త జాబు బాగుందమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. పర్వాలేదు నాన్న బాగానే ఉంది కానీ మీరు టాబ్లెట్ వేసుకున్నారా అని భాగమతి అంటుంది. తింటే కాదమ్మా ఏసుకునేది టాబ్లెట్ అలా టైం కు తినకనే కదా నాకు ఈ రోగం లేదంటే బాగానే ఉండే వాడిని కదా అని వాళ్ల నాన్న అంటాడు. ఏంటి నాన్న ఇంకా మీరేమీ తినలేదా అయితే ఏం వoడను ఏం కావాలో చెప్పండి చేసి పెడతాను అని భాగమతి అంటుంది. ఏమయ్యో రోజూ నేనేదో నిను ఆకలికి చంపుతున్నట్టు నీ కూతురితో చెప్తున్నా ఈరోజు ఏదో కొత్త ఇంట్లోకి మారాం కాబట్టి సామాన్ సర్దుకుంటూ లేట్ అయిపోయింది అయినా నేనంటూ ఒకదాన్ని ఉంటే కదూ నువ్వు ఇంకా ప్రాణాలతో ఉంది లేకపోతే నువ్వు ఎప్పుడో పైకి వెళ్లే వాడివి అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది.

పిన్ని ఏం మాట్లాడుతున్నావ్ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు టైం కు పెట్టాలని మీకు తెలియదా అని భాగమతి అంటుంది.తెలుసమ్మ టైం కు అన్నం పెట్టాలని నాకు తెలుసు కానీ మీ నాన్నకి ఎదిగిన కూతురు ఉంది తనకు పెళ్లి చేయాలి బయటికి వెళితే అందరూ ఏమనుకుంటారో ఏమో అనే బిడియo మీ నాన్నకు ఉందా అని వాళ్ళ పిన్ని అంటుంది. నువ్వు అనగానే సరిపోదే నాకు మాత్రం ఉండదా నా కూతురికి పెళ్లి చేయాలనే కానీ నా ఆరోగ్యం బాగోలేదు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని వాళ్ళ నాన్న అంటాడు. నాన్న ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు ముందు మీ ఆరోగ్యం బాగుపడాలి అని భాగమతి అంటుంది. లేదమ్మా మీ పిన్ని సరిగ్గా నే చెప్పింది ఎదిగిన కూతురు ఇంట్లో పెట్టుకొని నా ఆరోగ్యం గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనే వాళ్ళ నాన్న అంటాడు.అయితే పంతులు గారిని పిలిపియమంటారా మంచి ముహూర్తం చూసి వీళ్లకు ముడి పెట్టేద్దాం ఒరేయ్ తమ్ముడు నువ్వు లోపలికి వెళ్లి చక్కెర తీసుకురారా మీ బావ నోట్లో పోద్దo అని భాగమతి వాళ్ల పిన్ని అంటుంది. ఆ చెక్కర ఏదో నీ నోట్లో నువ్వే పోసుకో మర్చిపోయిన బాధ్యతని గుర్తుకు తెచ్చావు కదా అనే వాళ్ళ నాన్న అంటాడు. సరేనండి ఎప్పుడు ముహూర్తం పెట్టిద్దాం అని వాళ్ళ పిన్ని అంటుంది. ఏంటే అంత తొందర ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు మంచి సంబంధం దొరకాలి వాళ్లను చూడాలి అప్పుడు కదా ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించేది ఇప్పుడే అంటావేంటి అని వాళ్ళ నాన్న అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది