NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

Varalaxmi Sarathkumar: ప్రముఖ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో విశాల్ తో బ్రేకప్ ఆనంతరం ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లకుండా కెరీర్ పైనే ఫోకస్ పెట్టిన వరలక్ష్మి.. హీరోయిన్ గా ఎదగలేకపోయినా నెగిటివ్ క్యారెక్టర్స్‌ మరియు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో నటిగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు మరి కొద్ది రోజుల్లో తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేయబోతోంది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధం అవుతోంది.

రీసెంట్ గా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరిద్ద‌రూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల నుంచి వరలక్ష్మి, నికోలాయ్ మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది. ఇటీవ‌ల ఈ ప‌రిచ‌యం కాస్త చిగురించి ప్రేమ‌గా మారింది. ఇప్పుడు వరలక్ష్మి, నికోలాయ్ మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. అయితే నికోలాయ్ స‌చ్‌దేవ్ కు ఇది రెండో వివాహం. గ‌తంలో అత‌ను కవిత అనే ఓ మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ల కూతురు ఉంది. ఆమె పేరు కష సచ్‌దేవ్. నికోలయ్ సచ్‌దేవ్ మాదిరిగానే ఆయ‌న కూతురు కూడా పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు సాధించింది.

మ‌న‌స్ప‌ర్థ‌లు కార‌ణంగా నికోలాయ్, క‌విత విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నికోలాయ్ వ‌ర‌ల‌క్ష్మితో మ‌ళ్లీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నాడు. అయితే పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహానికి రెడీ అవ్వ‌డంతో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. డ‌బ్బు కోస‌మే వ‌ర‌ల‌క్ష్మి నికోలాయ్‌ను పెళ్లి చేసుకుంటుంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలాగే మ‌రికొంద‌రు నికోలాయ్ లుక్స్ ను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా వారంద‌రికీ వ‌ర‌ల‌క్ష్మి స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

`డబ్బు కోసమే నికోలాయ్ ను పెళ్లి చేసుకుంటున్నానని కొందరు విమర్శిస్తున్నారు. కానీ నేను కష్టపడి పని చేస్తున్నా. నా సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు నా వద్ద కూడా ఉంది. డబ్బు కోసం మరొకరిని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు` అంటూ వరలక్ష్మి ట్రోల‌ర్స్ కు గ‌ట్టిగా క్లాస్ పీకింది. అలాగే `నికోలాయ్ త‌న‌ను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.. అందులో త‌ప్పేంటి..? అతను సంతోషంగా ఉన్నంత వరకు ఏదీ త‌ప్పు కాదు. మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకున్నార‌`ని వ‌ర‌ల‌క్ష్మి పేర్కొంది.

నికోలాయ్ మాజీ భార్యతో తాను స్నేహపూర్వకంగా ఉన్నాన‌ని, ఆమెది అద్భుతమైన వ్యక్తిత్వం, మేమంతా బాగానే ఉన్నామ‌ని వ‌రల‌క్ష్మి పేర్కొంది. ఇక నిక్ లుక్స్ గురించి చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. ఈ విష‌యంపై వ‌ర‌ల‌క్ష్మి స్పందిస్తూ.. త‌న క‌ళ్ల‌కు నిక్ ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు, అది చాలు అంటూ స‌మాధానం ఇచ్చింది. దీంతో వ‌ర‌ల‌క్ష్మి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, వ‌ర‌ల‌క్ష్మి ప్ర‌స్తుతం శ‌బ‌రి మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాతో అనిల్ కాట్జ్దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ మే 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N