Today Horoscope: మే 26 – వైశాఖ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 26 – బుధవారం – వైశాఖ మాసం

మేషం

కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. గొంతు సంబంధిత రుగ్మతలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారాలలో ఆటుపోట్లు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సామాన్యంగా ఉంటుంది. కళాకారులు ఒత్తిడులకు లోనవుతారు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కొంత ఆందోళన. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….తెలుపు, లేత ఎరుపు..

రెమిడి .. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయత్నకార్యసిద్ధి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. విలువైన సమాచారం అందుకుంటారు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే సూచనలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు పర్యటనలు. కళాకారులకు విజయాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభ వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, తెలుపు.

రెమిడి ..  గణపతిని పూజించండి.

మిథునం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. రాజకీయ, సాంకేతిక వర్గాలకు ఊహించని అవకాశాలు. కళాకారులు ఆదరణ, గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ, లేతనీలం.

రెమిడి .. నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. చర్చల్లో ముందుకు సాగవు. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, గులాబీ.

రెమిడి .. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం

వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు కొంతవరకూ అనుకూలం. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు. జలుబు , నేత్ర సంబంధిత రుగ్మతలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు పర్యటనలు రద్దు. కళాకారులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు సోదరులతో విభేదాలు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు….లేత పసుపు, గులాబీ.

రెమిడి ..రామరక్షా స్తోత్రం పఠించండి.

కన్య

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో సఖ్యత. ఆభరణాలు, స్థలాలు కొంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాల విస్తరణ యత్నాలు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం.

అదృష్ట రంగులు….నీలం, ఆకుపచ్చ.

రెమిడి .. గణపతిని పూజించండి.

తుల

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. పనుల్లో కొంత జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు.  ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడులు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి పర్యటనలు వాయిదా. కళాకారులు నిరాశ చెందుతారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు…. ఎరుపు, గోధుమ.

రెమిడి .. వేంకటేశ్వరస్వామిని పూజించండి

వృశ్చికం

కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొంటారు. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరమైన కాలం. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….తెలుపు, పసుపు.

రెమిడి .. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు

కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విరోధాలు. పనులలో ఆటంకాలు. సోదరుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలలో అవాంతరాలు. కళాకారులకు గందరగోళం. విద్యార్థులకు అవకాశాలు కొన్ని దూరమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…. గులాబీ, బంగారు.

రెమిడి .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. అందరిలోనూ గుర్తింపు. ప్రముఖులతో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం పెరిగి రుణాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. గులాబీ, గోధుమ,

రెమిడి .. రామరక్షా స్తోత్రం పఠించండి.

కుంభం

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. వాహనాలు సమకూరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. కళాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులు టెక్నాలజీ విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. గోధుమ, తెలుపు.

రెమిడి .. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

మీనం

పనుల్లో ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు. చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి అంతగా కనిపించదు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో కలహాలు.  వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులు మరింత శ్రమ పడాలి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నిరుత్సాహం. మహిళలు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు….ఎరుపు, పసుపు,

రెమిడి .. హనుమాన్ ఛాలీసా పఠించండి.


Share

Related posts

Daily Horoscope ఆగష్టు 20th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే !!

Sree matha

శివాభిషేక విశేషాలు మీకు తెలుసా ?

Sree matha