Horoscope దైవం

Today Horoscope: మే 13 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope may 23ed
Share

Today Horoscope: మే 13 – వైశాఖ మాసం – శుక్రవారం

మేషం

ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ  విషయాల్లో చర్చలు సఫలమౌతాయి  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Today Horoscope May 13th
Today Horoscope May 13th

వృషభం

అకారణంగా ఇతరులతో విరోధాలు  కలుగుతాయి  కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు.  సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున  విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక నష్ట సూచనలున్నవి.

మిధునం

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల   నుండి ఒత్తిడి  పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది   ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి.కుటుంబ విషయంలో    ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

సింహం

ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా  బయట  దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలలో   ఆలోచనలు కలసి రావు ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

కన్య

ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు  నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి ఉద్యోగమున  అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి  స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

తుల

కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర  దేశ  సంచారం చేయవలసి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు.

వృశ్చికం

ధనాదాయం బాగుంటుంది  ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.శారీరక మానసిక ప్రశాంతత  లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.

ధనస్సు

దాయాదులతో స్ధిరాస్తి  వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు   కొన్ని  వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. నిరుద్యోగులు లభించిన ఉన్నత  అవకాశాలను జారవిడువకుండా  చూసుకోవాలి. ఇంటా బయట   గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభ  వార్తలు అందుతాయి.

కుంభం

అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి  ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

మీనం

జీవిత భాగస్వామి బంధువుల  నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా  వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

తిరుమల గర్భగుడిలో మూర్తుల విశేషాలు ఇవే !

Sree matha

కార్తీక పురాణం విశేషాలు ఇవే !

Sree matha

Today Horoscope: ఏప్రిల్ 1 – ఫాల్గుణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar