కోహ్లీ సెంచరీ

పెర్త్ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కడపటి వార్తలందేసరికి 5వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 96 పరుగులు వెనుకబడి ఉంది. 172/3 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ హాఫ్ సెంచరీ చేసిన రహానే వికెట్ కోల్పోయింది.  ఆ తరువాత హనుమ విహారీ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా…ఏకాగ్రత కోల్పోకుండా బ్యాట్ చేసిన కోహ్లీ సెంచరీ సాధించాడు. 113 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకూ అయితే టెస్ట్ పై ఆస్ట్రేలియా పట్టు సాధించినట్లే.