పార్లమెంటులో నేడు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండో రోజు మరికొద్ది సేపటిలో ప్రారంభమౌతాయి. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ రూల్ 267 కింద రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందంటూ ఈ విషయంలో తక్షణమే చర్య చేపట్టాలని ఇచ్చిన నోటీసుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. తరువాత ఇటీవల మరణించిన సభ్యులు మన్సూర్ అలీఖాన్, పూరణ్ చంద్ర, మాణిక్ రెడ్డి, గురుదాస్ కామత్, మోహన్ జైన్, శాంతారామ్, కమలకుమారి, తివారి, ఖురానా, నారాయణ్ స్వరూప్ శర్మ, సీకే జాఫర్ షరీఫ్లకు నివాళులర్పిస్తారు.  అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత కేంద్ర మంత్రులు హర్షవర్దన్, జితేంత్ర సింగ్, విజయ్ గోయెల్, అర్జున్ రామ్ మెఘ్వాల్ తదితరులు తమతమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభకు సమర్పిస్తారు. అలాగే పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లులను లోక్ సభ కార్యదర్శి సభకు సమర్పిస్తారు.

 

SHARE