NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medaram Jathara: 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి

Medaram Jathara: మేడారం మహా జాతర ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ నుండి పెద్ద ఎత్తున జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అతి పెద్ద జాతరైన మేడారానికి ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోనున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన వస్తారని మంత్రి సీతక్క మీడియాకు తెలిపారు. అదే రోజు గవర్నర్ తమిళి సై సౌందరాజన్ కూడా మేడారంకు వస్తారని చెప్పారు.

ఈ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలకు తగిన విధంగా మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అలాగే లక్షలాది మంది కోసం అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. గవర్నర్, సీఎం ఈ నెల 23న వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఆరువేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతర 21వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నా వేలాది మంది భక్తులు ముందుగానే వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.

ఈ ఏడాది మొదటి సారిగా మేడారం భక్తులకు ప్రభుత్వం ఆన్ లైన్ సేవలను కూడా ప్రారంభించింది. నేరుగా వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవడానికి అవకాశం లేని వారు ఇళ్ల వద్ద నుండే అమ్మవారికి బంగారం (బెల్లం) సమర్పించి మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

AP DSC: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స.. పరీక్షలు ఎప్పుడంటే..?

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

sharma somaraju

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

sharma somaraju

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

The Kerala story: OTT ని షేక్ చేస్తున్న ది కేరళ స్టోరీ..!

Saranya Koduri

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella