Vericocel: వరిబీజం అంటే మగవారి వృషణాలకు సంక్రమించే వ్యాధి.. వృషణాల పక్కన పలుచటి పొరలో నీరు చేరటాన్నే వరిబీజం అంటారు.. సాధారణంగా వృషణాల పక్కన అందరికీ 4-5 మిల్లీ లీటర్ల నీరు ఉంటుంది. ఇది అప్పటికప్పుడు తయారవుతూ లింప్ వ్యవస్థ ద్వారా తిరిగి శరీరంలోకి ఇంకిపోతుంది. ఇలా తిరిగి వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి మీరు అక్కడే ఉండిపోయి ఉబ్బినట్లు అవుతుంది. వరిబీజం ఈ సమస్యకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు.. ఈ సమస్యకు ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కారం ఉంది..
Vericocel: వరిబీజం కి పైపూత, మందు తయారు చేసుకునే విధానం..!!
గచ్చకాయ పప్పు 250 గ్రాములు తీసుకొని పగలగొట్టి దాని లోపల పప్పు తీయాలి. ఈ పప్పు ని కడిగిన బియ్యం నీటిలో రెండు రోజులు నానబెట్టాలి. ఇలా నానిన తరువాత మరో రెండు రోజులు నిమ్మకాయ రసంలో నానబెట్టాలి ఇలా చేస్తే అవి శుద్ధి అవుతాయి. వీటిని బాగా దంచి చూర్ణం లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ చూర్ణం లో ఆవు వెన్న కలిపి వారి బీజాలకు రాసి పైన తమలపాకు వేసి దానిపైన కాటన్ బట్టలు వేసి ఆ తరువాత లో దుస్తులు వేసుకోవాలి. ఇలా చేస్తే వరిబీజం తగ్గుతుంది. దీనితోపాటు 3 చిటికెలు గచ్చకాయ పప్పు, ఒక చిటికెడు లవంగాలు, ఒక చిటికెడు యాలుకలు, ఒక చిటికెడు దాల్చిన చెక్క మొత్తం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఇలా కలిపిన పొడిని ఒక చిటికెడు ఉదయం, రాత్రి గచ్చకాయ పప్పు త్రిఫల కషాయంలో, లేదంటే త్రిఫల జ్యూస్ లో కలిపి తీసుకోవాలి. ఈ 3 నెలల పాటు రెండు చేస్తే వరిబీజం సమస్య పూర్తిగా తగ్గి పోవును.