ShriLeela: శ్రీ లీల ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” పెళ్లి సందడి” సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ” ధమాకా ” సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఇక అనంతరం ప్రతి స్టార్ హీరో సరసన నటిస్తూ దూసుకుపోతుంది. 2023లో ప్రతి సినిమాలో శ్రీ లీలనే హీరోయిన్గా నటించింది. అంటే ఈమెకి ఎంత పాపులారిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు హీరోల డేట్లు దొరకడానికి చాలా కష్టపడేవారు డైరెక్టర్లు.. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం శ్రీ లీల డేట్లు దొరకడం కోసం కష్టపడుతున్నారు డైరెక్టర్లు. ఇక 2023లో ఎన్నో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మూడు డిజాస్టర్లు పడ్డాయి. ఆది కేశవ, స్కంద, గుంటూరు కారం సినిమాలు ఈమెకి పెద్ద దెబ్బే వేసాయి. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్గా శ్రీ లీలాని ఎంపిక చేసుకున్నారు.
కానీ ఈమె ఖాతాలో వరుసగా మూడు హ్యాట్రిక్ డిజాస్టర్లు పడడంతో ఈ సినిమా నుంచి పక్కకి పంపేశారట. ఇక దీనిపై తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఐఎండిబి సైట్ లో విడి 12 మూవీలో హీరోయిన్ గా ఇన్నాళ్లు శ్రీ లీల పేరు కనిపించేది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్థానంలో హీరోయిన్ రష్మిక మందన పేరు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. శ్రీ లీల ప్లేస్ ను రష్మిక మందన కొట్టేసినట్లు తెలుస్తుంది. ఇక ఈమె ఖాతాలో మూడు డిజాస్టర్లే కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి.
గతంలో కృతి శెట్టి సైతం ఇలానే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. ఇక ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ కి ఒక్క సినిమా అవకాశం కూడా రావడం లేదు. ఇక శ్రీలీల పరిస్థితి కూడా అంతేనేమో. ఇక ఈ వార్త చూసిన ఈమె అభిమానులు కృంగిపోతున్నారు. అందుకే ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. మంచి సినిమాలకి మాత్రమే డేట్లు ఇవ్వాలి. లేదంటే మిగతా హీరోయిన్ల గతి కూడా ఇంతే. మరి ఈ ముద్దుగుమ్మ కి రానున్న రోజుల్లో ఏమైనా అడపాదడపా సినిమాలు వస్తాయో రావో చూడాలి మరి.