Balakrishna: కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ తిరుగులేని హీరోయిన్గా పేరు సైతం పొందింది. ఇక ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బాలయ్య పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.
బాలయ్య గురించి చెప్పాలంటే ఓ జీవితమే సరిపోదు. ప్రతి హీరో, హీరోయిన్ కి బాలయ్య అంటే ఒక రెస్పెక్ట్. ఎన్నో దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తూ ప్రస్తుతం కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు బాలయ్య. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా మాట్లాడుతూ..” ఈరోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే ఇందుకు కారణం బాలయ్యే.
ఆయన చెప్పిన కొన్ని మెలకువలే కారణం. అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు బాలయ్య దగ్గరుండి మరి డాన్స్ ఎలా చేయాలో నేర్పించారు. డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకే. నా డాన్స్ విషయంలో మాత్రం ఎప్పటికీ నా గురువు బాలయ్యనే. బాలయ్య బాబు అందరితో ఎంతో సరదాగా ఉంటారు. అయనది చిన్నపిల్లల మనస్తత్వం.
అందరితో కలిసి పోతారు. ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇస్తారు ” అంటూ బాలయ్య బాబుని తెగ పొగిడేసింది కత్రినా. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలు చూసిన బాలయ్య అభిమానులు..” మా బాలయ్య బాబు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే మనస్తత్వం మా బాలయ్యది. అందుకే అందరూ జై బాలయ్య అని అంటారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.