Pushpa-Sukumar: పుష్ప అనే పదం ఇపుడు యావత్ ప్రపంచమంతా తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. తెలుగునాట కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా, బాలీవుడ్లో దాదాపు 100 కోట్ల మేర ఈ సినిమా వసూళ్లను రాబట్టిందంటే ఇక మన తెలుగు సినిమా స్టామినాను అర్ధం చేసుకోవచ్చు. దాంతో సుమారు 300 కోట్ల రూపాయల వసూళ్లకు పైగా దక్కించుకోవడంతో పార్ట్ 2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ ను బీట్ చేసే స్థాయిలోనే పార్ట్ 2 ఉండబోతుందని టాక్.
Pushpa: బన్నీ క్రేజ్ మాములుగా లేదు ఏకంగా విగ్రహం..ఎక్కడో తెలిస్తే నోరెళ్లబెడతారు!!
Pushpa-Sukumar: పుష్ప పార్ట్ 1/పుష్ప పార్ట్ 2:
ఇకపోతే, పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప పార్ట్ 2 ఎలా వుండబోతోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దర్శకుడు సుకుమార్ మొదట అనుకున్న కథ ప్రకారం సెకండ్ పార్ట్ కి నెగటివ్ క్లైమాక్స్ ను రాసుకున్నాడట. కాని నెగటివ్ క్లైమాక్స్ అయితే సినిమా బాగోదనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. దాంతో సుకుమార్ కూడా ఆలోచనల్లో పడ్డట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో క్లైమాక్స్ విషయంలో గత కొన్ని నెలలుగా సుకుమార్ కిందా మీదా పడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pushpa: బన్నీ క్రేజ్ మాములుగా లేదు ఏకంగా విగ్రహం..ఎక్కడో తెలిస్తే నోరెళ్లబెడతారు!!
ఇంతకీ ముగింపు ఎలా వుండబోతోంది?
సుకుమార్ ఈ క్లైమాక్స్ కోసమే పలు వర్షన్లు రాసుకున్నాడట. అయితే అవేవి తనకు గాని, తన టీమ్ కు గాని సంతృప్తిని కలిగించడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండవ భాగం కథ మొత్తం అల్లు అర్జున్ మరియు ఫాహద్ ఫాసిల్ ల మధ్య వుంటుందనే విషయం తెలిసినదే. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్లే, రెండవ పార్ట్ పైన ప్రషర్ పడుతోంది. ఈ విషయం సుకుమార్ కి శాపంలాగ మారినప్పటికీ అదొక మంచి ఛాలెంజ్ అని తన సన్నిహితులతో చెబుతున్నట్టు భోగట్టా.