Bheemla Naayak: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ రాబట్టడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలే వేరు అని అందరికీ తెలుసు. పవన్ కి తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో దాదాపు సినిమాకి పెట్టే పెట్టుబడి ఫస్ట్ డే నాడు వచ్చే పరిస్థితులు ఉంటాయి. తెలుగు చలన చిత్ర రంగంలో ఏ హీరోకి లేని రీతిలో ఓపెనింగ్స్ పవన్ కళ్యాణ్ కి ఉంటాయి. దీంతో నిర్మాతలు చాలావరకూ.. పవన్ సినిమాల రిజల్ట్ తో పనిలేకుండా సేఫ్ జోన్ లో ఉంటారు.
ఇక ఇదే తరుణంలో ఏ మాత్రం బ్లాక్బస్టర్ టాక్ పడింది అంటే.. సదరు నిర్మాతకు లాభాలు మామూలుగా ఉండవు. అటువంటిది ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత పవన్ నటించిన “బీమ్లా నాయక్” సినిమా నేడు విడుదల అవుతుండటంతో హైదరాబాదులో ఫ్రీ బుకింగ్స్ లో… సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. గతంలో ఏ సినిమాకి లేని విధంగా “బీమ్లా నాయక్” కి సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. “బీమ్లా నాయక్” హైదరాబాద్ సిటీ ప్రీ బుకింగ్ గ్రాస్ 6.17 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు.. ఇప్పటి దాకా ఇదే హైయెస్ట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో హైదరాబాద్ గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఒక ఏపీ మినహా తెలంగాణలో నాలుగు గంటలకి బెనిఫిట్ షో ప్రారంభం కానుందని సమాచారం. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 180 కోట్లకు పైగా జరిగినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ ఫస్ట్ డే వస్తే మాత్రం..బీమ్లా నాయక్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టించడం గ్యారెంటీ అని జనాలు అంటున్నారు. సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో పాటు మరో పక్క రానా కూడా ఎక్కడ తగ్గేదేలా అన్నట్టు ట్రైలర్లో కనిపిస్తూ ఉండటంతో… సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏపీలో బెనిఫిట్ షోలు.. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండటంతో.. అభిమానులు అదే విధంగా కొన్ని రాజకీయ పార్టీల నేతలు నిరుత్సాహం చెందుతున్నారు.