సీనియర్ దర్శకుడు మహేంద్రన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, దర్శకుడు జాన్ తెలియజేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేంద్రన్ సినిమాలకు ఓ మార్క్ ఉంది. ఎందరో ఆదర్శవంతంగా తీసుకునే మణిరత్నం, శంకర్ కూడా మహేంద్రన్ను అమితంగా ప్రేమిస్తారు. ఆయన శైలిని ఇష్టపడతారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరాధించే దర్శకుల్లో మహేంద్రన్ ఒకరు. రజనీకాంత్ స్టైల్స్ కు ఇండస్ట్రీలో ఎంత పేరు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ స్టైల్స్ లో చాలా వాటిని సృష్టించింది మహేంద్రనే. స్క్రీన్ రైటర్‌గా పరిశ్రమకు పరిచయమైన ఆయన దాదాపు 26 సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా అవతారమెత్తారు. ఇటీవల విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా తెరిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మహేంద్రన్లాంటి దర్శకులతో పనిచేయడం ఆనందంగా ఉందని ఆ మధ్య నటి సమంత కూడా పేర్కొన్నారు. 2017లో బోఫ్టా చెన్నై బ్రాంచ్‌కు దర్శకత్వశాఖకు ఈయన హెడ్ గా వ్యవహరించారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.
ReplyForward |