Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం మరియు అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమా ఇండస్ట్రీకి ఓ ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ ఏడాది గ్యాప్ పూర్తయినప్పటికీ ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు. నాగచైతన్యాను ఆరేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్ ఒక సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోయింది. విడాకులు తీసుకుని విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.
ఇక ఈ తరుణంలోనే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలపై సమంత స్పందించకపోవడంతో వీటికి ఆద్యం పోసినట్లు అయ్యింది. ఇక మొదటి పెళ్లి విడాకులకి దారి తీయడంతో సమంత జీవితంలో పెళ్లి చేసుకోదు అని అనుకున్నా అభిమానులు సైతం ఈ వార్త విని షాక్ అయ్యారు.
అందుకు కారణం సమంత తల్లిదండ్రులు ఆమెని రెండో పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడమే. ఇక సమంత వాళ్ళ తల్లిదండ్రులకి.. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. కెరీర్ లో ఇంకా ముందుకు ఎదగాలి. ఆ తరువాత మీ ఇష్టం వచ్చినట్లు చేస్తా. ప్రస్తుతం నన్ను ఇబ్బంది పెట్టకండి.. అంటూ సద్ది చెప్పిందట. ఇక సమంత తన తల్లిదండ్రుల మాటకి కట్టుబడి రెండో పెళ్లికి తలవంచుతుందా లేదా నాగచైతన్యాను మరిచిపోలేక తన జ్ఞాపకాలతో అలానే ఉండిపోతుందో చూడాలి మరి.