NTR: సాధారణంగా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకరి సినిమాకి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మన టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం తమకి ఏవో గొడవలు చేత అసూయ పెట్టుకుంటారు. ఇక ఈ కోవా కి చెందిన వారే బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న వీరు ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారారు. బాబాయ్ మరియు కొడుకు కలిసి నటిస్తే థియేటర్ దద్దరిల్లాల్సిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కానీ బాలయ్య మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ఓ సినిమాలో నటించి సందడి చేశారట. కానీ ఆ సినిమా ఓ కారణం చేత ఆగిపోయిందట. బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానులకి రెండు కళ్ళు లాగా ఉంటారు . ఎందుకంటే ఒకరేమో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు మరొకరేమో తన తాత పేరును అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మనవడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.
ఇక ఇద్దరికీ కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఇక మంచి గుర్తింపు ఉన్నప్పటికీ వీరిద్దరూ మాత్రం అరుదుగా స్టేజ్ ని పంచుకుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కనీసం గెస్ట్ రోల్స్ లో కూడా ఒకరి సినిమాలోకి మరొకరు వెళ్లలేదు. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తే చూడముచ్చటిగా ఉంటుందని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయినప్పటికీ వీరిద్దరూ వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు.
ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా వీరిద్దరిలో ఒకరు నటిస్తేనే ఆ సినిమాపై భారీ హైప్స్ నెలకుంటాయి. అదే ఇద్దరూ కలిపి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే బొమ్మ దద్దరిల్లాల్సిందే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ఉన్న గొడవలకి సైతం తాడోపేడో తేలాల్సిందిగా అనుకుంటున్నారట. ఇక రాజకీయ పరంగా తన కొడుకుని దూరం పెడతాడో లేదా ఫ్యామిలీ పరంగా చూసుకుని కలిసిపోతాడో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో టాప్ సెలబ్రిటీస్ నటించనున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.