Divi : దివి Divi గురించి తెలుసు కదా. బిగ్ బాస్ కంటే ముందు దివి పలు సినిమాల్లో నటించినా.. మోడల్ గా యాక్ట్ చేసినా.. వెబ్ సిరీస్ లలో నటించినా.. పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో అప్పుడే దివి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.
దివికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన కోసమే బిగ్ బాస్ ను చూసిన వాళ్లు చాలామంది ఉన్నారు. అది దివికి ఉన్న పాపులారిటి.

బిగ్ బాస్ తర్వాత కూడా దివికి సినిమాల్లో చాలా ఆఫర్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది దివి.
Divi : Start Music షోలో పార్టిసిపేట్ చేసిన దివి
అయితే.. దివి స్టార్ట్ మ్యూజిక్ అనే షోలో తాజాగా పార్టిసిపేట్ చేసింది. ఈ షోకు దివితోపాటు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అవినాష్, అరియానా, సుజాత, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి గెస్టులుగా వచ్చారు.
ఇక చూసుకోండి.. దివి సందడి మామూలుగా ఉండదు. ఓవైపు అవినాష్ కు పంచ్ లు వేసింది. అవినాష్ ఏదో అంటే మనోడిని చితకబాదింది. అలాగే… అరియానా కూడా ఏదో అనబోయే సరికి.. అరియానాకు తొందరెక్కువ.. అంటూ నోరు జారేసింది దివి. అమ్మో.. దివి మామూలుది కాదు. ఎంత స్ట్రయిట్ ఫార్వార్డ్. ఏమీ దాచుకోదు. వెంటనే అనేస్తుంది. తన ముక్కుసూటితత్వమే తనకు అందం. అదే తనకు మంచి ఆఫర్లను తెచ్చిపెడుతోంది.
మొత్తానికి ఈ సండే ఫుల్ టు ఫన్ డే కానుంది. స్టార్ట్ మ్యూజిక్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి.