NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇది బైరెడ్డి ఇలాకా … వైసీపీ రాజ‌కీయం మామూలుగా హీటెక్క‌లేదుగా…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో ర‌గ‌డ చోటు చేసుకుంది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ను త‌ప్పించి.. నాన్‌లోక‌ల్ నాయ‌కుడు సుధీర్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. అయితే.. దీనిని పార్టీ సీనియ‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే ల‌బ్బి వెంక‌ట‌స్వామి.. జ‌నంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. నందికొట్కూరు వైసీపీ నియో జకవర్గ బాధ్యతలను లోకల్ నాయ‌కుల‌కే ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం నుంచి జనంలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి సంసిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈయ‌న వైసీపీ నాయ‌కుడిగానే జ‌నం లోకి వెళ్తారా? లేక‌.. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. స్థానికంగా బ‌లం ఉన్న వెంక‌ట స్వామి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆర్థ‌ర్‌కు ఇవ్వ‌క‌పోతే.. త‌నకు టికెట్ ఇవ్వాల‌ని బ‌లంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పార్టీ యువ నాయుడు బైరెడ్డి చెప్పిన వారికే పార్టీ టికెట్ ఇస్తామ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే నందికొట్కూరు నుంచి అనూహ్యంగా సుధీర్ దారా పేరు వెలుగు చూసింది. దీంతో స్థానికంగా నాయ‌కులు మండి ప‌డుతున్నారు. ఇక‌, ఆర్థ‌ర్ ఇప్ప‌టికే మౌనంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను బ‌లిప‌శువును చేశార‌ని.. ఆయ‌న చెబుతున్నారు. టీడీపీవైపు చూస్తున్నా.. ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా వెంక‌ట‌స్వామి రాజ‌కీయం పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారంతా రావాలని.. అధిష్టానం ఎందుకు వెన‌క్కి త‌గ్గదో చూస్తాన‌ని కూడా ఆయ‌న కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు.. నందికొట్కూరు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్టు లబ్బి వెంకటస్వామి చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివాదాల‌కు దూరంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తాన‌ని చెబుతున్నారు. తన కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు వెంకటస్వామి తెలిపారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న వైసీపీ అధిష్టానం.. బైరెడ్డిని అలెర్ట్ చేసిన‌ట్టు తెలిసింది. ఆయ‌న ద్వారా వెంక‌ట‌స్వామిని లైన్‌లో పెట్టే వ్యూహానికి తెర‌దీసిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju