NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బొత్స బుక్‌ ఎన్నిక‌ల‌కు ముందు ఇదేం షాక్‌రా బాబు…!

అదేంటి? అనుకుంటున్నారా? అదేనండి.. క‌శ్మీర్ ఫైల్స్‌, గుజ‌రాత్(గోద్రా) ఫైల్స్‌, ఇప్పుడు రాజ‌ధాని ఫైల్స్ త‌ర‌హాలో త్వ‌ర‌లోనే బొత్స బుక్‌ కూడా తెర‌మీదికి రానుంది. అయితే. అది ఎన్నిక‌ల‌కు ముందా.. మ‌ధ్య‌లోనా.. త‌ర్వాతా? అన్న‌ది స‌స్పెన్స్‌లో ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. వైసీపీ సీనియ‌ర్ నాయ కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒక‌ప్పుడు.. ఇప్పుడు కూడా.. తిరుగులేని ఆధిప‌త్యంతో ముందుకు సాగుతున్నారు.

అయితే.. ఆయ‌న గ‌త అనుభ‌వ‌సారాన్ని పిండి.. పుస్త‌కం రాస్తున్నార‌ట‌. అది కూడా ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగిన కీల‌క ప‌రిణామాల‌ను అందులో వండి వార్చుతార‌ట‌. తాజాగా ఆయ‌నే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. త్వ‌ర లోనే ఈ పుస్త‌కాన్ని తీసుకువ‌స్తాన‌న్నారు. దీనిలో త‌న‌కు సీఎంకాకుండా.. అడ్డుప‌డింది ఎవ‌రు? వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు ఏంటి? అనే విష‌యాల‌ను కూడా పూస గుచ్చిన‌ట్టు వివ‌రిస్తాన‌ని చెప్పారు. అయితే. ఇదంతా కూడా ఎన్నిక‌ల వ్యూహ‌మేన‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

కాపుల్లో చిచ్చు…
బొత్స తాజాగా చేసిన కామెంట్లు వింటే.. కాపుల‌ను మెగా కుటుంబానికి దూరం చేయాల‌న్న‌ వ్యూహం స్ప ష్టంగా క‌నిపిస్తోంది. `ఉమ్మ‌డి రాస్ట్రంలో నాకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రావాల్సి ఉంది. అయితే.. దీనిని రాకుండా. అడ్డు ప‌డింది చిరంజీవే. ఆయ‌న‌కు త‌న కుటుంబానికే ప‌ద‌వులు ద‌క్కాల‌న్న ఆలోచ‌న ఉంది. అందుకే.. కాపునైన నాకు అన్యాయం చేశారు` అని బొత్స‌వ్యాఖ్యానించారు. త‌ద్వారా.. బొత్స సామాజిక వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపేలా వ్యాఖ్యానించార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. అప్ప‌ట్లో ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని పుస్త‌కం రూపంలో తీసుకువ‌స్తామ‌న్నారు.

ప్ర‌స్తుతం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇలాంటి స‌మ‌యంలో బొత్స చేసిన వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే కాపుల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యే అవ‌కాశం ఉంది. ఆయ‌న ద్వారా.. వైసీపీ పెద్ద‌లు ఇలా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు. ఇక‌, బొత్స చెప్పిన‌ట్టు పుస్త‌కం వ‌స్తే.. అది ఎన్నికల స‌మ‌యంలోనే కావొచ్చున‌నే అంచ‌నా కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో. ఏమేర‌కు బొత్స బుక్‌ ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?