NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఈ 20 మందికి నో టిక్కెట్‌…. క్లారిటీ ఇచ్చేసిన చంద్ర‌బాబు..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికి 15 సార్లు చంద్ర‌బాబు అనేక మందితో స‌మీక్ష‌లు నిర్వ‌హించా రు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఆయ‌న ప్ర‌తిసారీ.. స‌మీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో స్టీరింగ్ క‌మిటీని అంత‌ర్గ‌తంగా నియ‌మించిన చంద్ర‌బాబు.. పార్టీ అభ్య‌ర్థుల విష‌యాన్ని తేల్చాల‌ని గ‌త రెండేళ్ల కింద‌టే సూచించారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాల వారీగా కూడా.. కీల‌క నేత‌ల‌ను పిలిచి.. నాయ‌కులు చ‌ర్చించారు.

కొంద‌రిని స‌ర్దు బాటు చేస్తున్నారు. మ‌రికొంద‌రికి స‌ర్దిచెబుతున్నారు. అయితే.. ఎటొచ్చీ. కొన్ని కొన్ని జిల్లా ల్లో ఒకే కుటుంబం నుంచి రెండేసి టికెట్లు ఆశిస్తున్న‌వారే ఎక్కువ‌గా ఉండడం.. ఆయా స్థానాల్లో ఎక్కువ మంది పోటీ లో ఉండ‌డం పైగా.. పొత్తు పార్టీలు కూడా అవే సీట్ల‌ను కోరుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ విష‌యాన్ని కొన్నాళ్లు పెండింగులో పెట్టినా.. ఎన్నిక‌లకు స‌మ‌యం చేరువ అవుతుండ‌డంతో ఏదో ఒక‌టి తేల్చాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే టికెట్లు ఆశించిన 15 నుంచి 20 మంది నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టారు. వారి గ్రాఫ్ స‌రిగా లేక‌పోవ‌డంతోపాటు.. ఆర్థికంగా కూడా వెనుక‌బ‌డి ఉండ‌డం కారణాలుగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల రాజాన‌గ‌రం.. పార్టీ కీల‌క నేత‌.. పెందుర్తి వెంక‌టేష్ చంద్ర‌బాబును క‌లిసి.. త‌న గోడు వినిపించారు. తాను పార్టీ కోసం ఎంతో శ్ర‌మిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. కానీ, చంద్ర‌బాబు ఆయ‌న గ్రాఫ్‌ను ముందు పెట్టి.. ప‌రిస్థితిని వివ‌రించ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు.

ఇక‌, ప‌రిటాల కుటుంబం రెండు టికెట్లు ఆశిస్తున్న నేప‌థ్యంలో ఈ కుటుంబానికి ఒకే టికెట్ అని తేల్చి చెప్పేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వారి కోర్టులోనే నిర్ణ‌యాన్ని వ‌దిలేసినా. త‌ర్వాత‌.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు చొర‌వ తీసుకుని రాప్తాడు ఒక్క‌టి ఖరారు చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, జేసీ ప్ర‌భాక‌ర్‌, దివాక‌ర్ కుటుంబాల‌కు కూడా ఒకే టికెట్ ఖ‌రారు చేశారు.

అయితే.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుటుంబానికి మాత్రం ఈ ద‌ఫా రెండు టికెట్లు ఖ‌రారు చేసినా.. ఆయ‌న అవ‌స‌రం.. విజ‌యంపై న‌మ్మ‌కంతోనే ఇస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెబుతున్నారు. మొత్తంగా.. కొన్ని కొన్ని విష‌యాల‌పై చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!