NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది. నీ కొడుకు నన్ను మేపడం కాదు నేనే నీ కొడుకుని కూర్చోబెట్టి పందెం కోడిని మేపినట్లు మేపుతున్నాను. ఇంకా ఈ విషయాలు మా అమ్మకి చెప్పలేదు. ఆవిడ మీలాంటిదే తెలిస్తే ఉతికి ఆరేస్తుంది. ఇంత చేసిన శోభని ఏలుకోవాలా? లేదంటే వేరే వాడితో తిరుగుతున్న దీపని ఏలుకోవాలా? అని అమాయకుడు లాగా అనసూయను అడుగుతాడు నరసింహ. ఇంకోసారి అలా మాట్లాడితే నాలుక చీరేస్తానని దీప తిడుతుంది. వాడు తప్పు ఒప్పుకున్నాడు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ పిల్లది ఏ తప్పు లేదని అర్థం అవుతుంది. నువ్వు వచ్చింది మొగుడి కోసమే కదా వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలియగానే ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఆడది ఏది వదులుకున్న సంసారం వదులుకోదు కదా. వాడు ఎన్ని మాటలు అన్నా కూడా కాపురం కావాలని అనుకుంటే విడి గుమ్మం వదిలేసి పోయేదానివి కాదు.

Karthika Deepam May 6th 2024 Episode
Karthika Deepam May 6th 2024 Episode

ఈరోజు చేసినట్టే ఆ రోజే నాకు విషయం చెప్పి ఉండే దానివి. కానీ చేయలేదేంటి ఏంటి అర్థం అంటుంది అనసూయ. నాకంటే గొప్పవాడు దొరికితే నాతో ఏం పని అంటే దీపం నరసింహ పై చెయ్యి ఎత్తుతుంది. వాడి మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది. నిజం లేకపోతే నీకు ఆ ఇంట్లో ఏం పని? వీడు నాకు అబద్దాలు చెప్పడం కాదు నువ్వు నాకు అబద్దాలు చెప్పావు. అన్ని తెలిసి నువ్వు ఇలా అడిగితే ఏం చెప్పాలని దీప ఏడుస్తూ అనసూయని అడుగుతుంది. తప్పంతా దీప చేసినట్టుగా తనమీద నిందలు వేస్తారు. మనం ఎన్ని చెప్పినా ఈ మనిషి మారడు.. అవసరానికి తగ్గినట్టుగా మారే ఈ మనిషితో నేను నా కూతురు బతకలేము పోదాం పద అత్తయ్య అని అనసూయ చెయ్యి పట్టుకుంటుంది దీప. అనసూయ దీప చేతిని విడిపించుకుంటుంది. నువ్వు వెళ్ళు నేను నా కొడుకు తోనే ఉంటానని అంటుంది.

Karthika Deepam May 6th 2024 Episode
Karthika Deepam May 6th 2024 Episode

కొడుకుని చూడకండి ఆరేళ్ల కష్టాన్ని, అప్పుల భారాన్ని, కోడలికి ఇచ్చిన మాటని మర్చిపోయారా అని దీప అడుగుతుంది. దీపని వెళ్ళిపోమని చెబుతుంది అనసూయ. ఎక్కడికి వెళ్ళమంటావు అంటే ఊరు వెళ్ళిపో అంటుంది. అప్పుల వాళ్లకి ఏం సమాధానం చెప్పమంటావు అంటుంది దీప. అప్పులు మనమే చేశాం మనమే తీర్చుకుందాం అని నరసింహ నాటకం ఆడుతాడు. అవును అత్తయ్య మా అమ్మని అడిగి డబ్బులు కూడా రెడీ చేస్తాను ఇప్పుడే వెళ్లి డబ్బులు తీసుకొచ్చి మొత్తం నీ చేతిలోనే పెడతానని శోభ అనేసరికి అనసూయ తెగ మురిసిపోతుంది. శోభ మా అమ్మ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయని అనేసరికి వెంటనే తనవైపు మాట్లాడుతుంది అనసూయ. దేపని అసహ్యించుకుంటుంది. అప్పులకు ఇంటికి ఏం సంబంధం లేదు. అంతేకాదు నీకు మాకు కూడా ఎటువంటి సంబంధం లేదు అని దీప ని పంపించేస్తుంది అనసూయ.

ఏ తోడు లేకుండా బ్రతకడానికి అలవాటు పడిన దానివి కానీ నర్సి గాడు శోభ లేకుండా బతకలేడు. నీ బ్రతుకు ఏంటో నువ్వు బ్రతుకు అంటుంది అనసూయ. నీ కొడుకు వదిలేసిన నేను నిన్ను వదలనందుకు బాగానే బుద్ధి చెప్పావు అని కంటతడి పెట్టుకుంటుంది దీప. నిన్ను నమ్మి ఎక్కడ దాకా వచ్చినందుకు నా బుద్ధి లేదని అనుకుంటుంది. నువ్వు నా తమ్ముడికి పుట్టిన దరిద్రానివి తల్లిని మింగేసావు.. వాడిని మింగేసావు. నువ్వు ఇప్పుడు మాకు పట్టావు. ఇన్నాళ్లకు మాకు పట్టిన దరిద్రం వదిలింది. నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని అనసూయ తగేసి చెబుతుంది. దీంతో దీప బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అతని బుట్టలో వేసుకునేందుకు షాపింగ్ అంటూ శోభా తెగ హడావిడి చేస్తుంది. ఇక ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండి పోవాలి. దీపతో ఇక తనకు సంబంధం లేదని అనసూయ మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంటే పారు వచ్చి పలకరిస్తుంది.

Karthika Deepam May 6th 2024 Episode
Karthika Deepam May 6th 2024 Episode

ఫ్రెండ్స్ తో అలా సరదాగా బయటకు వెళ్లి ఎక్కువ తాగకుండా కాస్త తాగి ఎంజాయ్ చేయమని అంటుంది. శివ నారాయణ వచ్చి ఏంటి చెప్తున్నావు అంటాడు. దశరథ మరియు సుమిత్ర ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నామని చెప్తారు. అందరి ఎంగేజ్మెంట్ కి వెళ్లడం కాదు మన ఇంట్లో ఎప్పుడు జరిపిస్తారని అంటుంది. అది తన అల్లుడు చెప్పాలని దశరథ అంటాడు. అప్పుడే కార్తీక్ శౌర్యని ఎత్తుకుని వస్తాడు. ఏంటే అమ్మమ్మ మా అల్లుడు చంక ఎక్కావని సుమిత్ర అంటే మీ అల్లుడు కాదు మా కార్తీక్ అంటుంది శౌర్య. పారు శౌర్యని తిడుతుంది. దీప ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా నువ్వే అయ్యి ఉంటావని శివ నారాయణ అంటాడు. శౌర్యని చూసి జ్యోత్స్న కోపంగా మొహం పెట్టుకుంటుంది. అమ్మని పిలవమని శివ నారాయణ అడుగుతాడు. చిన్న పని ఉండి బయటకు వెళ్లిందని సుమిత్ర చెబుతుంది. దీప కు ఏవో చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి మా తరఫున నువ్వు అడుగు అని శివ నారాయణ అంటాడు. కార్తీక్ శౌర్య ని తీసుకుని ఆడుకోవడానికి వెళ్లి పోతాడు. జ్యోత్స్న అది చూసి రగిలిపోతుంది. దీప అనసూయ మాటలు తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పటివరకు భర్త చేతిలో మోసపోయిన భార్యని అనసూయన్నాను ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడలిని చేశావు అత్తయ్య. లేని ఆశలు మొలకెత్తించి మొదలుకే నరికేశావు మళ్లీ జీవితంలో చిగురించకుండా చేశావని దీప బాధ పడుతూ ఉంటుంది. అలా అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella