Kajal Aggarwal: దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్.. ఈ శుక్రవారం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సుమన్ చిక్కాల డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఆరం ఆర్ట్స్ బ్యానర్ పై శశి కిరణ్ తిక్కా, బాబీ తిక్కా, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకుర్చారు.
ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించనుంది. జూన్ 7వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీస్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు గత మూడు, నాలుగు వారాల నుంచి సత్యభామ సినిమాను కాజల్ అగర్వాల్ గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్.. సత్యభామ విశేషాలతో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే తన భర్త గౌతమ్ కిచ్లూ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ను బయటపెట్టింది.
కాజల్ మాట్లాడుతూ.. `ప్రస్తుతం నా లైఫ్ ఎంతో సాఫీగా సాగుతుంది. అందుకు నా భర్త గౌతమ్ కిచ్లూనే కారణం. అతను సపోర్ట్ చేయడం వల్లే బిడ్డ పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తున్నాను. సినిమాల ఎంపికలో గౌతమ్ ఎప్పుడు జోక్యం చేసుకోడు. అప్పుడప్పుడు సలహాలు మాత్రం ఇస్తుంటాడు. ఇక ఖాళీ సమయం దొరికితే తెలుగు మరియు ఇతర భాషల సినిమాలు చూస్తాడు. టాలీవుడ్ లో నాకన్నా సమంత, రష్మిక మందన్నా, రాశి కన్నా అంటేనే గౌతమ్ కు ఎక్కువ ఇష్టం` అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే సత్యభామ మూవీ గురించి కూడా కాజల్ మాట్లాడింది. ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ లాంటి ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ చేయడం ఇదే తొలిసారని.. తన కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని కాజల్ తెలిపింది. డైరెక్టర్ సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అయినప్పటికీ ఆయన వర్క్ చాలా క్లారిటీగా ఉందని ఆమె పేర్కొంది. మేజర్, గూఢచారి వంటి అద్భుత సినిమాలు తీసిన శశికిరణ్ సత్యభామకు స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉన్నారని చెప్పుకొచ్చింది. సత్యభామ కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది. మరి రేపు విడుదలన కాబోయే ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం కాజల్ అగర్వాల్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.