NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

ఫ్యాక్ట్‌చెక్‌: వోడ్కా సేవిస్తే కోవిడ్ 19 రాకుండా అడ్డుకోవ‌చ్చా ?

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఫేక్ వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. ఫ‌లానా ప‌నిచేస్తే క‌రోనా రాద‌నో.. ఫ‌లానా పానీయం తీసుకుంటే కోవిడ్‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌నో.. ఫేక్ వార్త‌ల్లో చెబుతున్నారు. వాటిని జ‌నాలు కూడా నిజ‌మేన‌ని న‌మ్ముతున్నారు. ఇక తాజాగా ఇలాంటిదే మ‌రొక ఫేక్ వార్త ప్ర‌చార‌మ‌వుతోంది. కోవిడ్ 19 రాకుండా ఉండాలంటే వోడ్కా తాగాల‌ని అందులో ఉంది.

fact check does drinking vodka prevents covid 19

వోడ్కా అనేది నిజానికి మ‌ద్యంలో ఒక వెరైటీ. బ్రాందీ, విస్కీ, బీర్‌లాగే ఇది కూడా మ‌ద్యంలో ఒక ర‌కం. ఇందులోనూ ఆల్క‌హాల్ ఉంటుంది. కాక‌పోతే రుచి భిన్నంగా ఉంటుంది. అయితే ఆల్క‌హాల్ ఉంటుంద‌ని చెప్పి కోవిడ్ 19ను వోడ్కా అడ్డుకుంటుంద‌ని కొంద‌రు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. ఇక అమెరికాలోని సెయింట్ లూక్స్ అనే హాస్పిట‌ల్ ఇదే విష‌యాన్ని చెబుతుంద‌ని, అంద‌రూ వోడ్కా తాగాల‌ని సూచిస్తుంద‌ని.. ఆ హాస్పిట‌ల్ పేరిట ఓ లేఖ‌ను కూడా కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని వెల్ల‌డైంది. స‌ద‌రు హాస్పిట‌ల్ యాజ‌మాన్యం తామేమీ అలాంటి లేఖ‌ను విడుద‌ల చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ వార్త‌ల‌న్నీ ఫేక్ అని నిర్దారించింది. పైగా అందులో ఉన్న‌ట్లు వోడ్కా సేవిస్తే కోవిడ్ 19 రాద‌ని ఎవ‌రూ అనుకోకూడ‌ద‌ని, ఆల్క‌హాల్ కోవిడ్‌ను చంపే మాట వాస్త‌వ‌మే అయినా.. దాన్ని హ్యాండ్ శానిటైజ‌ర్ లేదా సోప్ రూపంలో వాడాల‌ని.. అంతేకానీ మ‌ద్యం రూపంలో లోపలికి తీసుకుంటే కోవిడ్ రాకుండా అడ్డుకోలేద‌ని.. తేల్చారు. క‌నుక ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మి ఎవ‌రూ ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని ఆ హాస్పిట‌ల్ హెచ్చ‌రించింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju