NewsOrbit
న్యూస్

కడప జిల్లోలో ఘోర రోడ్డు ప్రమాదం..! నలుగురు సజీవ దహనం..!!

 

(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్‌లు సజీవ దహనం కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కడప – తాడిపత్రి రహదారి మధ్యలో  కడప ఎయిర్ పోర్టు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగింది

ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్న సుమోను తొలుత టిప్పర్ ఢీకొట్టింది. ఆ వెంటనే మరో కారు టిప్పర్‌ను డీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. సుమోను ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. కారులో  ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శకటంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. పోలీసులు క్షతగాత్రులను  కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సజీవ దహనం అయిన నలుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్‌లదేనని సమాచారం. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారు అయ్యాయి. పోలీసులు.. క్షతగాత్రుల ద్వారా మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌లు రాత్రి సమయాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?