NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తంబీ జై … రాజకీయ సై ; కాక రేపుతున్న రాజకీయం

 

తమిళనాడు రాజకీయాలు కాకా రేపుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ సరి కనివిని ఎరుగని రీతిలో జరగబోతున్నాయి. ఎత్తులు పై ఎత్తులు మాట అటుంచితే …. ఈ సారి సినిమా నటుల రాజకీయ రక కాక పెంచుతోంది. రజని పార్టీ పేరు , గుర్తు మీద ప్రచారం జోరు అందుకుంటే, కమల్ సైతం రాజకీయ పొత్తుల వైపు సాగుతున్నారని జరుగుతున్నా ప్రచారం ఇప్పుడు తమిళనాట ఎన్నికల వేడిని అమాంతం పెంచేసింది. జాతీయ చానళ్ళు, వాటి ప్రతినిధులు ఎన్నికల కవరేజి నిమిత్తం అప్పుడే తమిళనాడు చేరుకుంటున్నారు అంటే అక్కడ పరిస్థితిని అర్ధం చేస్కోవచ్చు. ఈ సారి మొత్తం దేశం చూపు తమిళనాడు వైపు పడనుంది…..

 

** తమిళనాట రాజకీయాలు ఇప్పుడు ప్రత్యేకమే. మాకు ప్రత్యేక ద్రావిడ దేశం కావాలని జస్టిస్ పార్టీ నుంచి రామస్వామి, అన్నాదొరై నాయకత్వంలో గతంలో పెద్ద ఎత్తున సాగింది. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడి ప్రజల ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. వెంటనే మార్పు కోరుకునే మనస్తత్వం ఎక్కువ. వ్యక్తిపూజ అధికం. అందుకే ప్రతి ఐదేళ్లకు అధికారం మార్పు చెందుతుంది.
** తమిళనాట రాజకీయాలు చాల విచిత్రంగా అనిపిస్తాయి. ఎక్కడున్నన్నీ రాజకీయపార్టీలు దేశంలో మారె ఇతర రాష్ట్రంలో లేవు. ప్రతి అంశానికి రాజకీయ కోణం లో పార్టీ పుట్టడం తమిళనాట రాజకీయాలకే చెల్లింది. ముఖ్యంగా ఎక్కడ జాతీయ పార్టీల హవా సాగదు. బీజేపీ, కాంగ్రెస్ కేవలం నామమాత్రంగానే ప్రభావం చూపగలవు.
** ప్రస్తుత అధికార పార్టీ అయినా అణా డీఎంకేకు , స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కు ప్రధాన పోటీ ఉంటుంది. ఈ రెండు పార్టీల నడుమ మాత్రమే అధికారం చేతులు మారుతూ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఈ కీలక రెండు పార్టీల ప్రధాన నేతలు జయలలిత, కరుణనిధి ఇద్దరు మృతి చెందిన తర్వాత జరగనున్న ఎన్నికలు కావడం మరింత ప్రచారాన్ని తెస్తున్నాయి.


** అధికార అణా డీఎంకే కూటమిలో బీజేపీ, రాందాస్ నేతృత్వంలోని పీఎంకే , విజయకాంత్ ఆద్వర్యంలోని డిఎమ్డీకే, జి.కె.వాసన్ అధ్యక్షతన కొనసాగుతున్న తమిళ మనీలా కాంగ్రెస్ ఉన్నాయి. 2016 ఎన్నికల్లో పీఎంకే డీఎంకే కూటమిలో ఉంది ఒక సీటు గెలవలేదు. ఈ సారి కూటమి మార్పు చెందింది. విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె సైతం 2016 ఎన్నికల్లో 104 స్థానాల్లో పోటీ చేసి , ఒక స్థానం సాధించలేదు. తమిళ మనీలా కాంగ్రెస్ సైతం 24 చోట్ల పోటీచేసి ఒక స్థానాన్ని నిలబెట్టుకోలేదు.
** ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలైన సిపిఎం , సిపిఐ తో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వైగో ఆద్వర్యంలోని ఎండిఎంకె , తిరుమలావన్ ఒక్కడిగా సాగిస్తున్న విసికె, పరివెంతర్ లాక్కుస్తున్న ఐజెకె, ఈశ్వరన్ పార్టీ కెఎంకె తో పాటు జవాహరుల్లా ఎంఎంకె లు ఉన్నాయి.
** ఈ రెండు కుతూములకు దూరంగా కమలహాసన్ మక్కల్ నీది మాయం ఉంది. ఇప్పుడు రజని కొత్త పార్టీ సైతం ఏవైనా కుతూముల్లో కలుస్తుందా లేక ఒంటరిగా ఉంటుందా? ఉంటె కమల్ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారా? లేక రజని ఒక్కడిగా వెళ్తారా అనేది స్పష్టత లేదు. మొదట్లో రజని బీజేపీ వైపు వెళ్తారని ఎక్కువ మంది భావించారు. అయితే ఆయన బీజేపీ వైపు ఎలాంటి అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. బీజేపీ ఎప్పటికి రజని మీద ఆశలు పెట్టుకున్నా ఆయన మాత్రం ఏమి చెప్పడం లేదు.

** రజని పార్టీ పెట్టి వేగంగా ప్రజల్లోకి వస్తే అది ఎవరికీ నష్టం అనేది ఇప్పుడే అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న, ఎక్కువ నష్టం డీఎంకే కూటమికే ఉండే అవకాశం ఉంది. 10 ఏళ్ల అణా డీఎంకే పాలనలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అది డీఎంకే కు దెబ్బె. బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేసినా లేక బీజేపీతో జత కట్టడానికి రజని ఆసక్తి చూపిన తమిళనాట పెను మార్పులు తప్పవు. రజని కనుక బీజేపీ తో జత కడితే బీజేపీ వెంటనే అణా డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తుంది.
** రజనికి తమిళనాట చిన్న పెద్ద అంత ఫాన్స్ ఉన్నారు. అయితే సినిమా వ్యక్తిగా ఉన్న రజనికి ఎన్నికల విషయంలో ప్రజలు బ్రహ్మరధం పడతారా అంటే… తమిళనాడు ప్రజలు ఎంజిఆర్, జయలలిత వంటి సినిమా స్టార్ల ను అత్యున్నత స్థాయిలో కూర్చుబెట్టిన ఘనత ఉంది. దింతో ఎలాంటి సిద్దాంతం, ఫార్ములాలతో రజని ఓటర్లను కలుసుకుని వోట్ అడుగుతారు అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఏ పార్టీ వైపుగా తమిళ ఓటర్ ఉంటారు అనేది ఇప్పుడు దేశ వ్యాప్త వార్తగా మారింది.

 

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?