NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : నిమ్మ‌గ‌డ్డ వార్నింగ్ … ఫ్యాక్ష‌నిస్ట్ బుద్దులు అంటూ..

CM Jagan VS Nimmagadda ; What Will happen?

Nimmagadda ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు.

Poll On Ys jagan vs nimmagadda local body election In ap

ఓ వైపు ప్ర‌భుత్వం మ‌రోవైపు ఉద్యోగ సంఘాలు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నప్ప‌టికీ ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. అంత‌కుముందు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సమావేశంలో నిమ్మగడ్డ అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. మ‌రోవైపు అధికార పార్టీ సైతం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

Nimmagadda నిమ్మ‌గ‌డ్డ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పంచాయతీరాజ్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశానికి హాజర‌య్యారు. ప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. కేంద్ర బలగాలపై ఇప్పటికే కేంద్ర హోంసెక్రటరీకి లేఖ రాశానని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఆగకూడదన్నారు. ఏకగ్రీవాలను స్వాగతించండి.. కానీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వండని నిమ్మగడ్డ సూచించారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

నిమ్మ‌గ‌డ్డ లో ఫ్యాక్ష‌నిస్ట్ బుద్ధి

మ‌రోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మలా మారారని… కీలుబొమ్మలా వ్యవహరించడం దురదృష్టకరమని సజ్జల రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ చవకబారు ధోరణిలోనే నిమ్మగడ్డ వ్యవహరించారని మండిపడ్డారు. నిమ్మగడ్డలో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందని… రిటైర్డ్ అధికారి అయ్యి ఉండి ఇతర అధికారులపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని సజ్జల పేర్కొన్నారు. ఎన్నిక విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారని.. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ అధికారులపై చర్యలకు నిమ్మగడ్డ లేఖ రాశారని ఆయన ఆరోపణలు చేశారు.

ఎన్నిక‌లు ఎలా…

కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N