NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Political Exams: లోకేష్ vs ప్రభుత్వం – మధ్యలో పవన్..! ఏపీలో పరీక్షల ఘాటు రాజకీయం..!!

Political Exams: Game with Students Lokesh Jagan Pavan

Political Exams: “పెళ్లి కుదిరితేనే రోగం తగ్గుతుందని డాక్టర్ అంటే…. రోగం తగ్గితేనే పెళ్లి అవుతుందని పిల్ల తరపు వాళ్ళు చెప్పారట….!!” అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి.. పెళ్లి కుదరదు.. రోగమూ తగ్గదు…!

లోకేష్ కి, టీడీపీకి మరే ఇతర పోరాటాలు లేనట్టు పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పట్టుపడుతున్నారు. పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇంతకంటే సీరియస్ సమస్యలే లేనట్టు పరీక్షలపై లేఖ రాసారు. ఈ ఇద్దరూ స్పందించి.. పోరాటం, లేఖాస్త్రాలు చేస్తుంటే… ఈ సమయంలో రద్దు చేస్తే క్రెడిట్ వాళ్లకు పోతుందని ప్రభుత్వం పరీక్షలపై వెనక్కు తగ్గడం లేదు. ఇలా రెండు వర్గాలు కలిపి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి..! పరీక్షల రాజకీయంతో ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు..!!

Political Exams: Game with Students Lokesh Jagan Pavan
Political Exams: Game with Students Lokesh Jagan Pavan

Political Exams: రోజుకి 12 వేల కేసులు వస్తున్నా..!!

ఏపీలో రెండో దశ కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు… రోజుకి 10 వేలు, 12 వేలు.. 14 వేలు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షల విషయంలో ఏ మాత్రం నిర్ణయం మార్చుకోవడం లేదు. ఇప్పటికే సీబీఎస్ఈ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. కానీ ఏపీలో మాత్రం పరీక్షలు పెడతారట.. నిన్న కూడా విద్య శాఖ మంత్రి సురేష్ ఈ విషయాన్నీ స్పష్టం చేసారు.

* కానీ… ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకటి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా పెరుగుతుంటే చూసి చూసి పరీక్షలు పెట్టలేరు… కొంచెం ఆలస్యమైనా ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం అనివార్యం. ఆ విషయం విద్యాశాఖ మంత్రికీ, సీఎం జగన్ కీ, ప్రభుత్వ పెద్దలకు తెలుసు. టీడీపీ నేత లోకేష్ కీ, పవన్ కళ్యాణ్ కీ తెలుసు. కానీ దీని చుట్టూ రాజకీయం అల్లుకుంది కాబట్టి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. వీళ్ళు మరీ అతి పోరాటానికి పిలుపునిస్తున్నారు. ఆ వర్గం మీడియా అతి చేస్తుంది..!!

Political Exams: Game with Students Lokesh Jagan Pavan
Political Exams: Game with Students Lokesh Jagan Pavan

రెండూ ఒకే తరహా రాజకీయాలు.. ఎక్కడా తగ్గట్లేదు..!!

పదో తరగతి పరీక్షలపై లోకేష్ పోరాటం అందుకున్నారు. “పరీక్షల రద్దు కోసం ఎందాకైనా పోరాడతాం” అని లోకేష్ సెలవిస్తున్నారు…! ఉద్యమానికి సిద్ధమే అంటున్నారు. రాష్ట్రంలో పోరాడాల్సిన చాల అంశాలను పక్కన పెట్టేసి ఆయన ఇదే పాత అందుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే టీడీపీ పోరాటం అనే క్రెడిట్ వస్తుంది అనే “ముందు చూపు”తో లోకేష్ ఈ పోరాటానికి దిగినట్టు చెప్పుకోవచ్చు. ఇది గ్రహించిన ప్రభుత్వం దీన్ని తాత్సారం చేస్తుందేమో….

* కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆలోచన మరోలా ఉంది. విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. ఆందోళన చెందుతున్నారు. పరీక్షలపై పునరాలోచన చేయాలని అనుకోవడం లేదు. “లోకేష్ అడుగుతున్నారు. పోరాటం అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లెటర్లు రాస్తున్నారు. ఈ టైం లో రద్దు చేస్తే క్రెడిట్ విపక్షాలకు వెళ్లిపోతుందేమో… అందుకే తర్వాత చూద్దాం. విపక్షాలు సైలెంట్ అయ్యాక రద్దు చేద్దాం” అన్నట్టు మొండిగా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో రోజుకి 10 వేలు, 12 వేలు కేసులు నమోదై దారుణ మారణ కాండ జరుగుతున్న సమయంలో కూడా ప్రభుత్వం మొండి చూపుతో వ్యవహరిస్తోంది…! అందుకే “పెళ్లి జరగదు – రోగం తగ్గదు”.. “క్రెడిట్ రాజకీయం ఆగదు – పరీక్షలపై నిర్ణయం రాదూ”..!!

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?