NewsOrbit
జాతీయం న్యూస్

PM CARES Fund: వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు రూ.500 పిఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాలంట..! మంత్రి వినతిపై విమర్శలు..!!

PM CARES Fund: కరోనా నివారణపై గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద చర్యలు చేసిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్న వారు పిఎం కేర్స్ కు విరాళం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.  కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుండి డోస్ రూ.250ల చొప్పున కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది.

Donate rs 500 to PM CARES Fund after getting vaccinated says mp minister
Donate rs 500 to PM CARES Fund after getting vaccinated says mp minister

Read More: YS Sharmila Party: షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ ! అన్నకు మాదిరి చెల్లెలికి వర్కవుట్ అయ్యేనా?

అయితే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తరువాత పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500లు విరాళం ఇవ్వండి అంటూ మంత్రి ఉషా ఠాకూర్ విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. రెండు డోసులు వేసుకున్న తర్వాత కొద్ది మొత్తం రూ.500 ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మహామ్మారి దృష్యా వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అందుకే చేతులు జోడించి అడుగుతున్నా. దేవుడు దయ వల్ల ఇవ్వగలిగిన వాళ్లంతా రూ.500 ను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్ అని అన్నారు. ఒక్కో డోసుకు అయ్యే ఖర్చు రూ.250లు అని మనందరికీ తెలుసు. అలా రెండు డోసులు ఉచితంగా తీసుకుంటే రూ.500లు ఫండ్ రూపంలో ఇవ్వండి, ఇది నా రిక్వెస్ట్ మత్రమే అని చెప్పుకొచ్చారు.

దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నందున బీజేపీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభినందనలు తెలియజేస్తున్న క్రమంలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.

ఉషా ఠాకూర్ గతంలో కోవిడ్ రక్షణకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణకు యజ్ఞాలు, హిందూ వేద పద్ధతులను అవలంబించాలని పిలుపునివ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తరువాత ఇండోర్ విమానాశ్రయంలో వైరస్ విముక్తి కోసం అంటూ దేవి అహిల్య భాయి హోల్కర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి కీర్తనలు పాడుతూ, భజన కూడా చేశారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!