NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Atibala Plant: మనిషి శరీరాన్ని వజ్రంలా చేసే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!!

Atibala Plant: Unbelievable Health Benefits of Atibala Plant, Atibala aka Country Mellow benefits in Ayurveda

Atibala Plant a.k.a Country Mellow:  మన భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి.. అటువంటి కోవకు చెందినదే అతిబల చెట్టు.. దీనినే దువ్వెన బెండ, ముద్ర బెండ, అతి బల, తుత్తురు బెండ లేదా దువ్వెన కాయ అని రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కను చాలా వరకు అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినప్పటికి.. ఇందులోని ఔషద గుణాలు మాత్రం ఎక్కువ మంది కు తెలియదు.. ఈ మొక్క అమితమైన బలం ఇస్తుంది. కాబట్టి దీనిని అతిబల మొక్క అంటారు. అతిబల మొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Atibala Plant: Unbelievable Health Benefits of Atibala Plant, Atibala aka Country Mellow benefits in Ayurveda
Atibala Plant: Unbelievable Health Benefits of Atibala Plant, Atibala aka Country Mellow benefits in Ayurveda

పిచ్చికుక్క, కోతి, పిల్లి కరిచిన చోట దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్స్ తాగించి.. ఆకుల రసాన్ని గాయాలపై పిండి, ఆ ఆకులను గాయంపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వలన వాటి విష ప్రభావం తగ్గుతుంది. ఈ ఆకుల పేస్టు ఆవాల నూనె కలిపి కీళ్ల నొప్పుల పైన అప్లై చేసే తగ్గిపోతాయి. రక్తమొలలు ఉన్నవారు ఈ ఆకులను ఉడికించి తింటే తగ్గిపోతాయి. ఆడవాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే.. ఈ ఆకులను కషాయంగా తయారుచేసుకొని చల్లారాక ఈ నీటితో శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గి పోతుంది. చర్మంపై ఎక్కడైనా వాపు వస్తే అక్కడ ఈ ఆకులను ఉడికించి కడితే వాపు తగ్గుతుంది. ఈ ఆకులకు కొంచెం పసుపు కలిపి మెత్తగా నూరి పేస్ట్ లా చేసుకోవాలి దీనిని పుండ్లు, గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి. ఈ చెట్టు ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంది. అతిబల మొక్క ఆకులు మన శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Atibala Plant: Unbelievable Health Benefits of Atibala Plant, Atibala aka Country Mellow benefits in Ayurveda
Atibala Plant: Unbelievable Health Benefits of Atibala Plant, Atibala aka Country Mellow benefits in Ayurveda

ఈ తీసుకుని నలిపి పావు లీటర్ నీటిలో వేసి సగం నీళ్ళు అయ్యేవరకు మరిగించాలి. చల్లారాక వడపోసుకొని కొంచెం తేనె కలిపి ఈ నీటిని రోజుకు మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట పోతుంది. అలాగే మూత్రాశయంలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఈ మొక్క విత్తనాలు పొడిలా చేసి వాటితో టీ తయారు చేసుకుని తాగితే అతిసార లక్షణాలు తగ్గుతయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టాలి. వీటితో కళ్ళు మూసుకొని కళ్ళు కడుక్కుంటే కళ్లు చల్లగా ఉంటాయి.

Avisa Flower Health Benefits: ఈ పూల సున్నిపిండి తో నలుగు పెట్టుకుంటే మిలమిల మెరవడం ఖాయం..!!

ఈ చెట్టు మొత్తం భాగం పూలు, కాయలు, కాండం, వేరు అన్ని నీటిలో వేసి కషాయం లాగా కాచి తాగటం వల్ల క్షయ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస నాళ వాపులు తగ్గుతాయి. జ్వరంతో బాధపడేవారు ఈ సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత ఈ నిటిని వడపోసుకొని పటిక బెల్లంతో కలిపి ఆ నీటిని కొంచం కొంచం గా తాగుతూ ఉంటే జ్వరం తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఆకుల రసాన్ని నోటిలో పోసుకొని కొంచెం సేపు తర్వాత ఉసేయలి. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు దంతాలు గట్టిగా మారి, గొంతు నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల కషాయం తాగుతుంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఇంకా గౌట్ వ్యాధికి, క్షయ వ్యాధికి, నోటి పూత కి, పేగు పూత కి దీనిని ఔషధంగా వాడతారు..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju